పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జయభేరి, సైదాపూర్ :
అలనాటి మధురస్మృతుల కోసం మళ్లీ ఒకరోజు శిష్యుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించి పూజ్యులైన గురువుల సమక్షంలో 39 సంవత్సరాల తర్వాత అపురూప కలయిక.. కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, దుద్దునపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1986-–87 పదోతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సమావేశ కర్తలు.. ఎస్ రాజయ్య, టి నారాయణ రెడ్డి. సభాధ్యక్షులు.. ఆడెపు రాజేందర్, పరకాల నారాయణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కే శ్రీనివాస్ రెడ్డి ఎంఈఓ, సునీత PS HM హాజరైనారు.  

విద్యాబోధనలు చెప్పినా గురువుల ఆహ్వానించుకొని వారికి ఘనంగా సన్మానం చేసినారు. ఈ సందర్భంగా మిత్రులందరికీ తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చదువులమ్మ ఒడిలో ఆటపాటలతో ఆనందంలో మునిగితేలారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. 39 సంవత్సరాల క్రితం చదువు నేర్పిన గురువులను గుర్తుంచుకొని సన్మానం చేసినందుకు ఇంత మంది విద్యార్థులు ఉన్నతంగా ఉన్నందుకు చూసి ఆనందంతో మురిసిపోతూ చిలకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలను మిగిల్చారని అన్నారు విద్యార్థులందరూ అప్పటి సంఘటనలను గురువులతో ఉన్న అనుబంధాలను మిత్రులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. 

Read More క్యాన్సర్ నిర్మూలన ధ్యేయంగా సత్యసాయి సేవా సమితి...

WhatsApp Image 2026-05-17 at 19.54.27

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

Views: 1