నేటి బాలలే రేపటి పౌరులు... అందరూ చదవాలి అందరూ ఎదగాలి

నాగులపల్లి సర్పంచ్ "రాధిక అశోక్ రెడ్డి" నాగులపల్లి ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాస, పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం

నేటి బాలలే రేపటి పౌరులు... అందరూ చదవాలి అందరూ ఎదగాలి

జయభేరి, షాద్ నగర్, జూన్ 17 : నేటి బాలలే రేపటి పౌరులు అని నాగులపల్లి గ్రామ సర్పంచ్ రాధిక అశోక్ రెడ్డి అన్నారు. గ్రామంలోని  అందరూ చదవాలి అందరూ ఎదగాలి అని  పాఠశాల విద్యార్థులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గము ఫరూక్ నగర్ మండలం నాగులపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం అక్షరాభ్యాస కార్యక్రమం, పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ పాలకమండలి నాయకులు, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాధిక అశోక్ రెడ్డి మాట్లాడుతూ... గ్రామంలోని ప్రతి కుటుంబంలోని పిల్లలు ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన  సౌకర్యాలను వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలలో చదవాలని పిలుపునిచ్చారు. పాఠశాలకు కావలసిన అన్ని సదుపాయాలను ఇదివరకే గ్రామస్తులు తమకు తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నారని గుర్తు చేశారు. మంచి కోసం మార్పు కోసం ప్రజల విద్య కోసం తమకు తోచిన సహాయ సహకారాలను భవిష్యత్తు తరాలు బాగుండే విధంగా అందిస్తానని అన్నారు. అనంతరం సర్పంచ్ రాధిక అశోక్ రెడ్డి సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించి, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధిక అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ సుమన్ గౌడ్, వార్డు సభ్యులు, రజిత, లక్ష్మీనరసింహ, స్వామి, బౌరయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు అరుంధతి వెంకట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయక్, అంగన్వాడి ఉపాధ్యాయులు.. లతా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం

Views: 11