అన్నను హతమార్చిన తమ్ముడు
మేడ్చల్ నడిరోడ్డుపై దారుణంగా హత్య.. నిందితుల కోసం గలిస్తున్న పోలీసులు
జయభేరి, మేడ్చల్ : కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఉమేష్ మద్యానికి బానిసగా మరి కుటుంబ సభ్యులను తరుచు వేదిస్తూ గొడవలు చేస్తుండటంతో ఉమేష్ ఆగడాలను భరించలేక రెండవ కుమారుడు రాకేష్ మరియు అతని మరో సోదరుడు లక్ష్మణ్ తో కలిసి ఉమేష్ ను మేడ్చల్ జాతీయ రహదారిపై పట్టపగలే కత్తులతో దారుణంగా దాడిచేసి హత్య చేసినట్టు మేడ్చల్ ఏసీపీ తెలిపారు. హత్యకు పాల్పడిన రాకేష్, లక్ష్మణ్ లు పరారీలో ఉన్నారని ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు చేస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment