జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు..

భరోసా లేని.. భద్రత లేని ఉద్యోగాలు.. జీవితాలు...

జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు..

జయభేరి, సిరిసిల్ల : భార్యల మీద ఈసమెత్తు బంగారం ఉండదు.. అద్దె ఇండ్లు.. మరణిస్తే ఆ శవాన్ని ఎక్కడ పెట్టి అంత్యక్రియలు నిర్వహించాలో తెలియని దుస్థితి... సిరిసిల్ల టివి9 రిపోర్టర్ Prasad Netha Garadas గుండెపోటుతో హఠన్మరణం చెందాక ఆయన కుటుంబ పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతుంది. ఇద్దరు ఆడపిల్లలు పెండ్లీలు కాలేదు.. చదువుకుంటున్నారు. ఒక బాబు.. వీరి భౌవిష్యత్‌‌ ఏంటో ఆలోచిస్తేనే బాధనిపిస్తుంది.

తల్లి కొడుకు శవం వద్ద  రోదిస్తూ.. కొడుక ఒక్క రూపాయి సంపాదించుకోలేదు.. పూల దండలు సంపాదించుకుంటున్నవారా... కొడుకా.. నీ పిల్లల బతుకు ఏం కావలరా కొడుకా.. మాకు అగ్గి పెడుతావనుకుంటే ..మేం నీకు పెట్టాల్సి వస్తుందరా కొడుకా.. అంటూ ఏడుస్తుంటే.. గుండె తరుకుకపోయింది.

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

సొంత ఇల్లు లేదు.. సొంత ఊళ్లో ఇల్లు లేదు.. సిరిసిల్ల అద్దె ఇల్లు.. మరణిస్తే.. శవాన్ని ఇంటికి తీసుకెళ్తే.. ఏం అనుకుంటారో అని తమ బంధువు ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వాహించాల్సిన పరిస్థితి. అంత్యక్రియల కోసం కేటీఆర్‌‌ రూ.50 వేలు, కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ తక్షణ సాయం రూ.50 వేలు పంపించారు సంతోషం కానీ.. ఇవి తాత్కాలికమే..

Read More Telangan I ఏదీ రాజ్యాంగ స్ఫూర్తి.. సందేహమా? సవాళ్ల?

జర్నలిస్టు మిత్రులు.. కేవలం ఒక్క రిపోర్టింగ్‌‌ నే నమ్ముకొని.. ఒత్తిడికి గురికావడం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతు.. అర్థంతరంగా తనవులు చాలిస్తున్నారు. కుటుంబాలను రోడ్డు మీద వేస్తున్నారు. తమ భార్య పిల్లల భద్రత కోసమో.. బౌవిష్యత్ కోసమే ఒక రూపాయి కూడా సంపాదించకుండా.. సమాజంలో పేరును మాత్రమే సంపాదించుకోని పోతున్నారు. జర్నలిస్టు మిత్రులు రిపోర్టింగ్‌‌ మాత్రమే కాదు మన కుటుంబం కోసం అదర్ ఇన్‌‌ కం  కోసం ఏదొ ఒక వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా హెల్త్ ఇన్సె రెన్స్‌‌, టర్మ్‌‌ పాలసీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు తాత్కాలిక సాయాలు చేస్తరు కావచ్చు కానీ మనం లేని లోటు మాత్రం మన కుటుంబానికి ఎవరు తీర్చలేరు.

Read More Nagaaram Municipality I ఖల్ నాయక్.. కౌన్ ఆతా బై... అనే దేవ్ దే.. ఖేంగే...

ప్రసాద్‌‌ నీ మరణం మా అందరిని కలిచివేసింది మిత్రమా.. టివి9 యజామాన్యం కూడా మానవత ధృక్పదంతో స్పందించి సిరిసిల్ల  టివి9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ కుటుంబానికి సాయం అందించాలి. కాంగ్రెస్‌‌ సర్కారు ప్రసాద్‌‌ కు ఒక డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇల్లును కేటాయించాలి. కేటీఆర్‌‌ అన్న .. ప్రసాద్‌‌ కుటుంబానికి మీ వంతు సహాయ సహకారాలు, వారి పిల్లల చదువులకు అందించాలి. జర్నలిస్టు మిత్రులు విధి నిర్వహణలో అసలు ఒత్తిడికి గురికావద్దు.. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతది.

Read More Telangana I మేయర్, కార్పోరేటర్లంతా రాజీనామా చేసి  ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి..

Views: 2