Telangana I ఇది గౌడలను అవమానించడమే..!
- రాష్ట్ర అధ్యక్షులు మద్దెల రమేష్ బాబు గౌడ్
జయభేరి, హైదరాబాద్ : గౌడ్ అఫీషియన్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోప) సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మద్దెల రమేష్ బాబు గౌడ్ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు కూడా గౌడులకు కంటి తుడుపుగా మూడు నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చి సరిపెట్టుకోవడం జరిగింది. ఇది గౌడలను అవమానించడమే అని తెలియజేశారు. దామాషా పద్ధతి ప్రకారం 15 సీట్లు పార్టీ నుండి రావలసి ఉన్నందున మరొక్కసారి ఆలోచించి ఇంకా సమయం ఉన్నందున అవకాశం కల్పించాలని పత్రికాముఖంగా అన్ని పార్టీలకు విన్నవించడం జరిగినది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ.. గౌడులు ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ నుండి అయినా స్వతంత్ర అభ్యర్థులైనా పోటీ చేస్తున్నప్పటికీ పార్టీలను చూడకుండా గౌడులు అంతా ఏకతాటిపై వచ్చి పోటీలో నిలుచున్న ప్రతి గౌడ్ ని మిగతా అన్ని బీసీ కులాలను కలుపుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా, గౌడ్ లు పోటీ లో లేని చోట మిగతా బీసీ సభ్యులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి మొగిలి రఘునాథ్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ముంజ వెంకటరాజ్యం గౌడ్, సంయుక్త కార్యదర్శులు యల్మకంటి మీరయ్య గౌడ్, మాదు సైదులు గౌడ్, కమిటీ సభ్యులు కే ఎన్ వి ప్రసాద్ గౌడ్ లు పాల్గొన్నారు.
Post Comment