బూర్గుల గ్రామాన్ని సందర్శించిన కెవిపిఎస్ జిల్లా బృందం

దళితుల ఇళ్లకు అడ్డంగా ఉన్న కంచె తొలగించిన నాయకులు

బూర్గుల గ్రామాన్ని సందర్శించిన కెవిపిఎస్ జిల్లా బృందం

జయభేరి షాద్ నగర్ ఆగస్టు 05 : దళితుల ఇండ్లకు అడ్డంగా వేసిన కంచను పరిశీలించిన కెవిపిఎస్ నాయకులు, దళిత సంఘలు, సామాజిక సంఘాల నాయకులు రాజకీయ పార్టీ నాయకులు సందర్శించి అడ్డుగా ఉన్న కంచెను తొలగించారు.

ఈ సందర్భంగా కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బోడ సామేలు గారు మాట్లాడుతూ;  సిటీకి దగ్గరలో ఉన్న  బూర్గుల గ్రామానికి చెందిన దళితులు ఇల్లు నిర్మించుకొని సంవత్సరాల పాటు అక్కడే జీవిస్తున్నరూ. దళితుల వెళ్ళే దారికి అడ్డుగా  అదే గ్రామానికి చెందిన నర్సింగ్ రావు కుటుంబీకులు  అడ్డంగా కంచె వేయడం నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ కులం పేరుతో దూషించారని  అన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దళితులకు అండగా పోలీస్ యంత్రాంగం రెవిన్యూ రంగం ఉండాలని కోరారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎంపీటీసీ బూర్గుల సుమన  ఘటన స్థలానికి వచ్చి దళితులకు అడ్డంగా వేసిన కంచెను  అందరి ముందు తొలగించడం జరిగింది.

Read More Telangana I చెత్త మనుషులు

మానవత దృక్పథంతో బూర్గుల సుమన  చెప్పడం చాలా సంతోషకరం అన్నారు. దళిత బస్తికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో  ఉద్యానవనం పార్కు నిర్మిస్తామని చెప్పారు నాయకులు కేవిపిఎస్ నాయకులు ఉద్యానవనం సంబంధించిన చెట్లను ఫారెస్ట్ డిఆర్డిఏ అధికారులతో మాట్లాడి గ్రామానికి పంపుతామని అన్నారు. కంచె స్థలంలో ఉద్యానవనము  ఏర్పాటు పట్ల గ్రామానికి చెందిన ప్రజలందరూ  ఆనందం వ్యక్తం చేశారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే బూర్గుల సుమనా  లాగా సహోదయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని పదిమందికి మేలు చేసే విధంగా మనం చూసే పనులు ఉండాలని  కెవిపిఎస్  నాయకులు కోరారు.

Read More Congress I రగులుతున్న రాజకీయం.. మంట పెట్టే వారెవరు!?

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య, ఎం. అశోక్ ,సిఐటియు నాయకులు రాజు, శ్రీను, దళిత సంఘాల నాయకులు, ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్, టిడిపి మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,   సరూర్నగర్ మండల వైస్ ఎంపీపీ మౌనిక, హరి కృష్ణ గౌడ్, గ్రామస్తులు రామకృష్ణ ,శివకుమార్, నరసింహులు, సురేష్,సాయి  శంకర్ ,శ్రీహరి, శివ,  వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I యువత ఆలోచన విధానం..!

Views: 1