షాద్‌నగర్‌లో ఉత్సాహంగా 5కే రన్
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్, కౌన్సిలర్లు, అధికారులు
జయభేరి, షాద్ నగర్, మార్చి 09 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 ప్రణాళిక కార్యాచరణలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో 5కే రన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి పరుగును ప్రారంభించారు. పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ 5కే రన్, షాద్‌నగర్ ముఖ్య కూడలి వరకు సాగింది.
Views: 30


