ఘనంగా 161వ వారపు జ్ఞానమాల
డాక్టర్.బి ఆర్. అంబేద్కర్ జ్ఞాపకాలను స్మరించుకున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మిషన్ కార్యవర్గ సభ్యులు
ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ మన్నె శ్రీనివాస్ (అంబేద్కరైట్, బీజేపీ మల్కాజ్‌గిరి & మెడికల్ జిల్లా ప్రతినిధి)
లోత్కుంటా “X” రోడ్, ఆల్వాల్ వద్ద ఘనంగా జ్ఞానమాల...
లోతుకుంట, జయభేరి : లోత్కుంటా “X” రోడ్, ఆల్వాల్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మిషన్ కార్యవర్గ సభ్యులు 161వ వారపు జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మన్నె శ్రీనివాస్ (అంబేద్కరైట్, బీజేపీ మల్కాజ్‌గిరి & మెడికల్ జిల్లా ప్రతినిధి) సభను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ మిషన్ పెద్దలు, నాయకులు, కార్యవర్గ సభ్యులు అణగారిన వర్గాల రక్షణ, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిలో అనంతరాజ్, రమేష్ కమల, పురం కన్నయ్య, కే.ఏ. లక్ష్మి, సువర్ణ, చార్లిన్‌రాజ్, సి. సురేష్ (ఢిల్లీ), ఎస్. శివశంకర్, డా. నవీన్ రాజ్, కె.ఎం. సురేష్, ఓంకార్, శివలింగం, బాల్ మల్కేష్ తదితరులు పాల్గొన్నారు.


