షాద్ నగర్ మున్సిపల్ పీఠం హస్తం పార్టీకి కైవసం
షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా అగ్గునూరి బస్వం, వైస్ చైర్మన్ గా అందే మోహన్
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన నాయకుల ప్రమాణ స్వీకారం
మొత్తం 28 వార్డులలో...హస్తం 15,కారు,11,బిజెపి 01, స్వతంత్ర అభ్యర్థి 01
జయభేరి, షాద్ నగర్, ఫిబ్రవరి 16 : పుర పోరులో ఘన విజయం సాధించిన హస్తం. పోరా హోరీగా ఉత్కంఠ పోరులో హస్తానికి కారుకు మధ్య పోటీలో షాద్ నగర్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.
గెలుపొందిన కాంగ్రెస్ నేతలు జాబితా వార్డుల వారిగా..2వ వార్డు బచ్చలి నరేష్, 5వ వార్డు సింగపాగ శిరీష, 6వ వార్డు రాజు నాయక్, 7వ వార్డు కొప్పునూరు ప్రవీణ్, 10వ వార్డు నడి కూడా శ్రావణి, 12వ వార్డు కలంకార్ దిలీప్, 13వ వార్డు హరిద్వానా ముబారక్ అలీ ఖాన్, 14వ వార్డు అందేమోహన్, 15 వ వార్డు మరియం బేగం సాదిక్, 17వ వార్డు నాజియో బేగం సర్వర్ పాషా, 18వ వార్డు సంతోషి బాయ్ చందు, 23 వ వార్డు అగ్గునూరి బస్వం, 24 వ వార్డు విశాల విశ్వం, 25 వ వార్డు పెంటయ్య, 27వ వార్డు మురళీమోహన్ (అప్పి),.
బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా...1వ వార్డు, మహమ్మద్ గౌస్ జానీ, 3వ వార్డు, అశోక్ యాదవ్,4వ వార్డు, చల్లా వాణీ పాండురంగారెడ్డి,11వ వార్డు పిల్లి శారద శేఖర్, 16 వార్డు ఒగ్గు విజయలక్ష్మి కిషోర్, 19వ వార్డు ఆల్ఫా బేగం అడ్డు, 20వ వార్డు పినమోని గోపాల్, 21వ వార్డు టీజీ వసంత శ్రీనివాస్, 22వ వార్డు నడి కూడా అనిత రఘునాథ్ యాదవ్, 26వ వార్డు ఎస్పీ శివ, 28 వార్డు చేకూరి లక్ష్మీ ప్రసన్న వేణుగోపాల్.
బీజేపీ ఒక స్థానం... 9 వ వార్డు ప్యాట అశోక్ కుమార్.,
స్వతంత్ర అభ్యర్థి ఒకటి... 8 వ వార్డు సుధీర్...నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకమండలి నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రవి యాదవ్, పార్టీ నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ తో పాటు ఆర్డీవో సరిత, ఎంపీడీవో బన్సీలాల్,ఎమ్మార్వో నాగయ్య, మున్సిపల్ కమిషనర్ సునీత తదితరులు పాల్గొన్నారు.



