హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు
రాష్ట్ర రైతుబందు సమితి కౌన్సిల్ మాజీ సభ్యలు దేవి రవీందర్.
జయభేరి, గజ్వెల్, మర్చి 01 : ప్రజల పక్షాన పోరాడుతున్న తెలంగాణ ఉద్యమ కారుడు మాజీ మంత్రి హరీష్ రావు పై అక్రమ కేసులు బనాయించడం తగదని గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ అన్నారు.
ఇటీవల కేటీఆర్, కవిత , మిగతా బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన వాటిని అధిగమించి ప్రజల ముందు దోషులు ఎవరో నిర్ధోషులు ఎవరో తెలిపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని గతంలో అసలైన ప్రజా పాలన నదించిందని ఇటువంటి చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదని అన్నారు. ప్రజలకు ఏది అవసరమో అవి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ బలీయమైన పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇటు ఆరు గ్యారంటీలు అమలుచేయక ప్రజల్లో వస్తున్న వ్యతిరేఖాతను చూసి తట్టుకోలేక ఇటువంటి డైవర్టు రాజకీయాలకు తెర లేపిందని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గరే స్వంత పార్టీ నేతలే తనను పట్టించుకోవడం లేదని స్వంత మంత్రులే తనకు విలువ ఇవ్వడం లేదని అధిష్టానం దగ్గర వాపోయిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇకనైనా మీరు ఎన్నికల్లో హామి ఇచ్చిన గ్యారెంటీల మీద దృష్టి పెట్టాలని లేకుంటే మీకు ప్రజా క్షేత్రంలో మీకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.ఈ సమావేశంలో పాల రమేష్ గౌడ్, నిజామోద్దీన్ పాల్గొన్నారు.
Post Comment