BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?

ఎల్బీనగర్ నియోజకవర్గంలో రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కలవడం పాజిటివ్ కోణంలో మధుయాష్ కి గౌడ్ కి కాంగ్రెస్ లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం లభించడం ప్రస్తుతం ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి

BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?

జయభేరి, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల పోటీ ఈసారి రసవత్తరంగా సాగనుంది... అనుకోని విధంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కలవడం దీనికి పాజిటివ్ కోణంలో మధుయాష్ కి గౌడ్ కి కాంగ్రెస్ లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం లభించడం ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.. దేవి రెడ్డి సుధీర్ అంటే ఎవరికి అర్థం కాదు తాను ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు ఎవరికి చెప్పాడు తనకు అవసరం ఉన్నప్పుడే తన మంది మార్బలాన్ని పిలిపించుకొని పనులు చకచగా కాయిస్తాడు.. అనే ఆరోపణలు ఎవ్వరిని అడిగిన ఎల్బీనగర్ నియోజకవర్గం లో చెప్తారు..

ఇక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఎలాగైనా మూడవసారి గెలవాలని ఉద్దేశంతో ఎంతకైనా తెగించే గుణం ఆయన సొంతo.. ఎల్బీనగర్ నియోజకవర్గం అంటే అతి పెద్ద నియోజకవర్గం ఇక్కడ బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు ఎక్కువగా ఉంటారు అలాగే వీరితోపాటు గౌడ సామాజిక వర్గం కూడా బాగానే ఉంటుంది.. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఓట్లు దండుకునే అవకాశం కనిపిస్తున్న ఈసారి రెడ్డి సామాజిక వర్గం దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి అనుకూలంగా కనిపించడం లేదు...

Read More శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన

ఎందుకంటే ఎల్బీనగర్లో ఇప్పటికే ఫ్లై ఓవర్లు కట్టినాను అభివృద్ధి చేశాను అని చెప్పుకొస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఆయనపై భూకబ్జా ఆరోపణలు సొంతవారికి ప్రభుత్వం నిధులు అప్పజెప్పారన్న ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నుంచి గుప్పున వినిపిస్తున్నాయి... వీటన్నింటినీ బట్టి చూస్తే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి మైనస్లు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో మధు యాష్ కి గౌడ్ ఇక్కడ గౌడ సామాజిక వర్గాన్ని ఏకం చేస్తూ ఇప్పటికే రాజకీయాన్ని మొదలెట్టి దాదాపు సుధీర్ రెడ్డి కార్పొరేటర్ లను ఓ నలుగురు ఐదుగురిని తన ఖాతాలో వేసుకున్నట్టు సమాచారం..

Read More జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్

రాజకీయంలో పైకి నవ్వుతూ కనిపించిన లోపల తడి గుడ్డతో గొంతు కోసే యత్నాలు సాగుతూ ఉంటాయి. ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి ఆ గుణం స్పష్టంగా కనిపిస్తుంది.. ఇక గౌడ సామాజిక వర్గంలో ఉన్న రామ్మోహన్రావు గౌడ్ కచ్చితంగా మధు ఎస్పీ గౌడ్ కి సపోర్ట్ చేయాల్సిందే ఎందుకంటే కాంగ్రెస్ కండువా కప్పుకున్న తరువాత ఆయన మాజీ కార్పొరేటర్లు ప్రస్తుతం దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఫంక్షన్ ఉన్న కార్పోరేటర్లు కాంగ్రెస్కు అనుకూలంగా మారిపోవడంతో మధుయాష్కీ గౌడు కు విజయం దాదాపు ఖాయమని స్పష్టంగా వినిపిస్తోంది...

Read More KTR : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా మరొకసారి గెలవాలి అని అంటే భారీగా నిధులు ఖర్చు చేయాల్సిందేనా అయిన డబ్బులు పంచితే ఓట్లు వేస్తారని నమ్మకం ఉందా పోనీ డబ్బులు పంచాడు అనుకోండి కచ్చితంగా ఓట్లు రాలుతాయా అనే అనుమానం లేకపోలేదు.. దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఇప్పటికే జర్నలిస్టులు అందరికీ ఇండ్ల పట్టాలు ఇస్తాను అని చెప్పి అవి చాక్లెట్ల బిస్కెట్ల అని నోరు పారేసుకున్న సంగతి విధితమే.. కాదు కాదు యూట్యూబర్లకు ఆన్లైన్ పేపరులకు ఇళ్ల సాగాలు ఏడ తేవాలి అని చెప్పి నాలుగు కర్చుకుని పొడుగు పత్రికలకే ఇచ్చేసిన ఘనత దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కే దక్కుతుంది..

Read More మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ పై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

తెలంగాణ ఉద్యమంలో ఆయన అనుకున్న పొడుగు పత్రికలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసాయా.. అని చిన్న పత్రికలు యూట్యూబర్స్ దుమ్మెత్తి పోస్తున్నారు.. ఇక కాంగ్రెస్ వస్తే కచ్చితంగా మీకు అన్ని విధాల సంక్షేమం అభివృద్ధి దక్కుతుంది అని నమ్మకాన్ని కలిగించారు ఎల్బీనగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని బలంగా తయారు చేసిన మల్రెడ్డి రామిరెడ్డి.. ప్రస్తుతం ఆయన చేసిన కష్టం కాంగ్రెస్ దశ తిప్పేనా అనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి...

Read More అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

మొత్తానికి మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నాక ఈసారి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి ఆశాభంగం కలగక మానదు... దేవి రెడ్డి సుధీర్ రెడ్డి వర్సెస్ మధుయాష్ కి గౌడ్ అంటే బడుగు బలహీన మైనారిటీ సాదా సీదా పేద ప్రజలు కాంగ్రెస్ నే నమ్ముతారా లేదంటే సంక్షేమ పథకాలు అందుతున్న ప్రతి గడప అధికార ప్రభుత్వానికి ఓటేసే అవకాశాలు కనిపిస్తాయి అంటే ఎల్బీనగర్ నియోజకవర్గం లో పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది..

Read More అత్తాపూర్ లో జరిగిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు  

ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి పులుసుకుంటే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పై ఉన్న ఆరోపణలు బయటికి తీసే అవకాశాలు లేకపోలేదు. తొందర ఎందుకు సుందరవదన ముందర ఉంది ముసళ్ళ పండుగ అని ముక్కును వేలేసుకుంటున్నారు ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు..

Read More ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు


...కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్

Read More పారామిలిటరీ బలగాల్లో అత్యుత్తం సీఆర్పీఎఫ్