పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే  రేఖా శ్రీధర్ రెడ్డి

పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే  రేఖా శ్రీధర్ రెడ్డి

జయభేరి, కొండమల్లేపల్లి :
పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కొండమల్లేపల్లి మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ధోనియాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు పూర్తిగా వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, పసునూరి యుగంధర్ రెడ్డి,విప్పలపల్లి జితేందర్ యాదవ్, సురేష్,వెంకట్ రెడ్డి,నీలం మల్లేష్, అంజయ్య,పెద్దిరాజు, బోడ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Views: 0