రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢి కొన్న టిప్పర్ లారీ
అంతాయిపల్లి కి చెందిన మంచాల కుమార్ (39) అనే వ్యక్తి మృ*తి
జయభేరి, శామీర్ పేట్, జూన్ 28 :
రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి తీవ్ర గాయాలై మృ*తి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా తూoకుంట లో చోటు చేసుకుంది. అంతాయిపల్లి గ్రామానికి చెందిన మంచాల కుమార్ (39) శనివారం సాయంత్రం తుంకుంట వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో తుంకుంట నుండి అల్వాల్ వైపు వెళుతున్న TS 08 UL 9699 నంబర్ గల టిప్పర్ లారీ అతివేగంతో నిర్లక్ష్యంగా నడుపుతూ కుమార్ ను ఢీ కొంది. ఈ ఘటనలో కుమార్ తలకు, ముక్కుకు తీవ్ర రక్త స్రావం అయి అతను అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న శామీర్ పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృ*తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Views: 0


