బీసీల రిజర్వేషన్ సాధించేవరకు ఉద్యమిస్తాం
రాజ్యాంగ సవరణ చేసి అయినా బీసీ రిజర్వేషన్ కేటాయించాలి
జయభేరి, సైదాపూర్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ల పిలుపుమేరకు నేడు సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీ సంక్షేమ సంఘం సైదాపూర్ మండల అధ్యక్షులు జంపల భూపతి అధ్యక్షతన మౌన దీక్ష చేపట్టడం జరిగింది, ఈ కార్యక్రమం అనంతరం జిల్లా అధికార ప్రతినిధి పెసరు కుమారస్వామి ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు రాజ్యాంగ సవరణ చేసి అయినా స్థానిక సంస్థల్లో, చట్టసభ, శాసనసభల్లో విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని లేనియెడల ఉద్యమం మరింత ఉద్రిక్తం చేస్తామని అన్నారు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్రంలోని 17 మంది ఎంపీలు కలిసికట్టుగా పార్లమెంట్ లో బీసీ బిల్లు ఆమోదం తెలిపే వరకు పార్లమెంటును స్తంభింప చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు జంపాల భూపతి,రజక సంఘం జిల్లా నాయకులు సోమారపు రాజయ్య,బీసీ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షులు నీర్ల సతీష్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం మండల నాయకులు నెల్లి శ్రీనివాస్, ఆడెపు రాజు, పరకాల నారాయణ, నెల్లి సంపత్ ముదిరాజ్, మహిపాల్ సింగ్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.


