యువత తమలోని టాలెంట్ ను పదును పెట్టుకోవాలి...

సింగింగ్ డబ్బింగ్ రంగాలలో ప్రతిభ చూపించిన యువ కళాకారిని.. మనం ఫౌండేషన్ చక్రవర్తి... అపర్ణ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎక్కలూరి వరలక్ష్మి..

యువత తమలోని టాలెంట్ ను పదును పెట్టుకోవాలి...

మనం బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో యువ కళాకారిని ఎక్కలూరి వరలక్ష్మి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు అవార్డుతో సత్కరించి అభినందనలు అందించారు ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ చక్రవర్తి అలాగే అపర్ణ చేతుల మీదుగా ఎక్కలూరి వరలక్ష్మి అవార్డు తో పాటు సర్టిఫికెట్ ను  అందుకున్నారు. ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ యువతలో స్కిల్ ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క స్కిల్ టాలెంటును పదును పెడితే భవిష్యత్తు బంగారు బాటగా మారుతుంది.

అందుకు నిదర్శనంగా ఎక్కలూరి వరలక్ష్మి సింగింగ్ డబ్బింగ్ ఆయా రంగాలలో కళాకారినిగా ప్రథమ స్థానంలో నిలిచి యువతకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఈ సందర్భంగా అవార్డు సర్టిఫికెట్ గ్రహీత ఎక్కలూరి వరలక్ష్మి మాట్లాడుతూ... ఈ అవార్డు, సర్టిఫికెట్ రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అలాగే మనం ఫౌండేషన్ ప్రతినిధులకు, అపర్ణ మేడంకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Read More telangana politics I రాజకీయ ప్రకటనల మాయాజాలం ఓటర్ల అయోమయం

Views: 2