స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

జయభేరి, సైదాపూర్ : ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు నేలకొరిగి, తమ ప్రాణాలను తృచ్చ ప్రాయంగా వదిలిపెట్టి, మనందరికీ స్వేచ్ఛ వాయువులు ప్రసాదించిన ఈ శుభదినమే మన స్వాతంత్ర దినోత్సవం. దేశమంతటా ఘనంగా జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభ తరుణంలో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దులపల్లి గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గ్రామంలో పలుచోట్ల జెండాను ఎగరవేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో భాగంగా డంపింగ్ యాడ్ వద్ద ఎంపీడీవో యాదగిరి, ఎంపీఓ కాజా బజీరుద్దీన్, ఎంపిఎం తిరుపతి, ఎంపీఓ రాణి, గ్రామ కార్యదర్శి రావుల శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ తాళ్లపల్లి సతీష్, గ్రామ మహిళా సంఘం సిఏలు కొడం హైమావతి, సునీత, సంఘ సభ్యులు జెండా పండుగను సంబరాలతో జరుపుకోవడం జరిగినది. గ్రామపంచాయతీ వద్ద గ్రామ సెక్రెటరీ రావుల శ్రీనివాస్ జండా ఎగరవేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, స్కూల్ పిల్లలు, టీచర్లు పాల్గొన్నారు.

Read More Telangana I పేట ఎవరి సొంతం..!?

IMG-20250815-WA8175

Read More Telangana I గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) 42వ వన భోజన కార్యక్రమం

Views: 5