Election Bonds I సుప్రీం ఆదేశం.. ఎన్నికల బాండ్లు బయట పెట్టాల్సిందే..
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అంటూ విరాళాల ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచొద్దంటూ సుప్రీంకోర్టు కరాకండిగా తేల్చేసింది.
జయభేరి, హైదరాబాద్ :
దేశ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్న అంశం. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అంటూ విరాళాల ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచొద్దంటూ సుప్రీంకోర్టు కరాకండిగా తేల్చేసింది. అయితే రాజకీయ నాయకులకు విరాళాలు అప్పనంగా అప్పజెప్పే వారి కంపెనీలకు ఇన్కమ్ టాక్స్ పన్ను రాయితీ ఇవ్వకూడదు అనేది ప్రధాన అంశం... ఈ విషయంపై జయభేరి కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర రాజకీయ విశ్లేషణ....
అప్పుడు ప్రజాస్వామ్యం అని పిలవబడుతుంది. కానీ వాస్తవ పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ఏంటి అని ఒక్కసారి మనకి మనమే ప్రశ్న వేసుకుంటే రాజకీయాలలో తనదైన ముద్రను ఏర్పరచుకోవడానికి కరుడుగట్టిన నేరస్తులు గూండాలు రౌడీయిజం చేసే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి తమ దగ్గర ఉన్న డబ్బులు ఇరగ వేసి అలాగే సమాజంలో ఉన్న బడాబడా కంపెనీల యజమానులను బెదిరించి వారి దగ్గర నుంచి విరాళాలు సేకరించి ప్రజలకు డబ్బు ఎర చూపించి అధికారాన్ని చేజెక్కించుకుంటున్నారు. ఇలా అధికారం చేజెక్కించుకున్న వాళ్లు ప్రజల కోసం పని చేయరు. వారు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించుకోవడానికి అలాగే విరాళాలు ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఇస్తారు వారికి అనుబంధంగా ఆదేశాలు ఆర్డినెన్స్లు చట్టాలు చేయడానికి నాయకులు పాకులాడుతుంటారు, వెంపర్లాడుతుంటారు. ఇంకోవైపు దేశంలో నల్లధనాన్ని బయటకి తీస్తా అది ప్రజలకు పంచుతాం అని చెప్పుకొచ్చిన కేంద్ర బిజెపి నేతలు ఆ దిశగా ఎంతవరకు పని చేశారో ఏమో తెలియదు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం చూస్తే రాజకీయ పార్టీలు ప్రధాన భూమిక పోషించేది నల్లధనం పెడుతున్న వారే కావడం కోసం కొస మెరుపు...
సమాజంలో కుబేరులుగా ఉన్న కార్పొరేట్ పెద్దలు ప్రభుత్వాలని శాసించే విధంగా తీవ్రంగా ప్రభుత్వ విధివిధానాలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వారు పార్టీ గెలుపు కోసం భారీ మొత్తంలో విరాళాలు అందిస్తారు కనుక వారికి ఆ విరాళాల పై పన్ను రాయితీ కూడా కల్పించే ప్రభుత్వాలు ఉంటున్నాయి కనుక ప్రభుత్వ విధివిధానాలు కార్పొరేట్ వ్యవస్థలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.
అలాంటప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం ఏ కోశానా కనిపించదు. రాజకీయాలలో ఏ మచ్చ లేకుండా తనదంటూ రాజకీయ జీవిత చరిత్రను లిఖించుకున్న రాజకీయ పెద్దమనిషి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి. ఆయన రాజకీయాల్లో ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు. రాజకీయంలో జీవితాన్ని అబద్ధంతో ప్రారంభిస్తున్నాం అని వాజ్పేయి గారు అన్నమాటలు ఈనాటికి సజీవంగానే ఉంటున్నాయి. అబద్ధపు పునాదుల మీదనే రాజకీయ ముఖచిత్రం జడలు విప్పుకుంటుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. రాజకీయ పార్టీలకు కంపెనీలు వ్యాపారస్తులు బడబడ కార్పొరేటర్లు ఇచ్చే ఎలక్ట్రో బాండ్లను సుప్రీంకోర్టు కచ్చితంగా ప్రజల ముందుకు తీసుకురావాలి బహిర్గతం చేయాలి అనే తీర్పు ఇవ్వడంతో విరాళాలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు నాన్నయాతన పడుతున్నారు. అధికార పార్టీకి విరాళాలు ఇచ్చిన మేము బయటికి తెలిస్తే మా భవిష్యత్తు కు పోలీస్ స్టాప్ పడుతుంది అనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.
2017 ఆర్థిక చట్టం ప్రకారం బహిర్గతం చేయకూడదు అనే చట్టాన్ని రాజకీయ నాయకులు అవసరానికి ఆర్థిక చట్టంలో పొందుపరిచారు తప్ప ప్రజల క్షేమాన్ని గురించి ఈనాడు ఆలోచించలేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు భారీ మొత్తంలో నగదు రూపంలో ఇచ్చే బడబడ కంపెనీలు కార్పొరేట్ వ్యవస్థలు ఈ దేశ ని పరిపాలించే రాజకీయ నాయకులనే శాసిస్తున్నారు. ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ప్రభుత్వాలుగా ఏర్పడి ప్రజలకు సేవ చేయాలి. అంతేకానీ కార్పొరేట్ కనుసన్నలో రాజకీయాన్ని నడిపిస్తూ వారికే పెద్ద పీట వేయడాన్ని ఎవరు సమర్థిస్తారు ఏ రాజ్యాంగం ప్రకారం ఇలా నడుస్తుంది అన్న సందేహాలపై సుప్రీంకోర్టు విరాళాలు ఇచ్చే ఎన్నికల బాండ్లను కచ్చితంగా బహిర్గతం చేయాలనే తీర్పును వెలువరించింది.
ప్రభుత్వాలకు విరాళాలు ఎన్నికల బాండ్లను ఇచ్చిన ఆయా కంపెనీలు గరిష్ట పరిమితిని తీసేసి లిమిట్ లేకుండా ఎక్కువ విరాళాలు ఇచ్చి అవి ఆడిట్లో లేకుండా ఉండేట్టుగా చూసుకొని పన్ను రాయితీని ఎగబడుతున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి.
పేదవాడి పై నడ్డి విరిచే పన్నులు వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వాలు బడాబడా కంపెనీలు ఫార్మా కంపెనీలపై ఎందుకు పన్ను రాయితీని తీసేస్తుంది అనే విషయంపై తీవ్రమైన ఆలోచన చర్చే జరిగి చివరికి అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల బాండ్లను బయటపెట్టాల్సిందే విరాళాలు అందించిన వారు ఎవరు పేర్లు కచ్చితంగా ప్రజల ముందు.. విరాళాలు అందించిన దాతల పేర్లు ప్రకటించాలని తీర్పు ప్రకటించింది. ఒకానొక సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా 16 వేల కోట్ల విరాళాలు అందించింది ఒక కార్పొరేట్ కంపెనీ అంటే ఇచ్చి పుచ్చుకునే విధానానికి తెరతీసి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కనుమరుగైపోయి కార్పొరేట్ కంపెనీల కోసమే పని చేసే ప్రభుత్వాలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి..
ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు గనుక అమెరికా జర్మనీ ఇలాంటి దేశాల్లో 1000 డాలర్ల కంటే ఎక్కువగా ఇచ్చిన దాతలు భారం పడుతుంది.
అదే జర్మనీలో చట్టబద్ధంగా ఖర్చు చేస్తారు... విరాళాలు తీసుకున్న ఖర్చు పెట్టిన ఆదేశ చట్ట ప్రకారంగా ఖర్చు పెడుతూ ప్రజలకు పూర్తి విరారాలను అందుబాటులో ఉంచుతారు. కానీ ఒకనాడు జర్మనీలో ఒక అధ్యక్షుడు ఆ విరాళాలు ఏమి చెప్పకుండా కొన్ని కోట్ల నిధులతో ఖర్చు చేసి అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత అక్కడి న్యాయస్థానాలు ఆ దేశాధ్యక్షుడు ఇంటిని ఆస్తిని స్వాధీనం చేసి ప్రజలకు లెక్కలు చెప్పాయి... అంటే ఆ దేశ చట్టం ప్రకారం కచ్చితంగా ప్రజలకు ఎవరు ఎవరు ఎంత విరాళాలు అందిస్తున్నారు కచ్చితంగా లెక్క చెప్పే వెలుసుబాటు అక్కడ ఉంది. అలానే మన భారతదేశంలో కూడా ఇన్కమ్ టాక్స్ మినహాయింపు కోరుకునే ఆయా బడా బడా కంపెనీల అసలు తతంగాన్ని బయటకు తీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరెవరు పరిధిలో ఎంత విరాళాలు ఎన్ని కోట్లలో ఇస్తున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచకుండా ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే అంటూ సుప్రీమ్ హుకుమ్ ను జారీ చేసింది...
ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమంతమైన పాలన, నీతివంతమైన పాలన జవాబుదారీతనం ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు పాలన యంత్రాగాలు చేతపట్టినప్పటి నుంచి జవాబుదారితనం ఉండాలి. అలా లేకుండా ఎన్నికలు జరిగే వరకు ఒకలాగా ఉండి ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజలపై పెత్తనం చెలాయించే దేశం ప్రజాస్వామ్యంలో భవిష్యత్తు ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బలమైన పునాది కాబట్టి ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి యువతకి రాజకీయ పార్టీలు ఎంత విరాళాలు అందిస్తున్నాయో కచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఆర్థిక భవిష్యత్తు నిర్ణయించే అధికారం ప్రజలకే ఉంటుంది. అంతేకానీ ఆవేశంతో అతిశయంతో సుప్రీం ఇచ్చిన తీర్పును ఆషామాషీగా చూడవద్దు. సమూలంగా కింది స్థాయి నుంచి బడ కార్పొరేట్ల వరకు ఎంతెంత విరాళాలు ఇస్తున్నారు కచ్చితంగా కార్యాచరణ దిశగా అడుగులు వేయాలి. అలా విరాళాలు ఎవరెవరిస్తున్నారు తెలిస్తే ఓట్ల కొనుగోలు కాకరమైన ఈ సమస్య సమస్య పోతుంది. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోవాలి అంటే అది మన అందరి చేతుల్లో ఉంది దానికి న్యాయస్థానాలే ఊపిరినిస్తాయని దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ....
...కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
Post Comment