Telangana 26th I భద్రతకు భరోసా ఏది!? 

మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు సేఫ్టీ క్లబ్లను ఏర్పాటు

Telangana 26th I భద్రతకు భరోసా ఏది!? 

జయభేరి, హైద‌రాబాద్ :

జనవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు సేఫ్టీ క్లబ్ అనే నిర్ణయం తీసుకొని రోడ్డు ప్రమాదాలు బారిన పడకుండా ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నిండకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది.. ఈ విషయం మనలో ఎంతమందికి తెలుసు!?

Read More BJP_Bandi Vs Ponnam I విజయ సంకల్ప యాత్ర ..? అసలు ఉద్దేశం ఏంటి!?

అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కోసం రోడ్డు ప్రమాదాల నుండీ ప్రజలను కాపాడడానికి సంయుక్త ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు సేఫ్టీ క్లబ్లను ఏర్పాటు చేస్తోంది... ఈ నిర్ణయాన్ని తెలంగాణ పోలీస్ బాస్ రవి గుప్తా ఐపిఎస్ లాంచనంగా దీన్ని ప్రారంభించారు... ఆ వివరాలు ఏంటో పూర్తి విశ్లేషణ చేసుకుందాం.....

Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?

ఆర్థిక భారంతో ఆయా కుటుంబాలు అప్పుల ఊబిలో పడిపోయి ఇంటి నుండి బండి తీసుకుని బయటికి వెళ్తే మళ్లీ ఇంటికి వచ్చేవరకు ఇంట్లో ఉన్న కుటుంబీకుల ప్రాణాలు కొట్టుమిట్టాడుతూనే ఉంటాయి... అంటే ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాల్లో ఎన్నో విషాద గాథలు, కన్నీటి కథలు మనందరికీ తెలిసిందే.. కానీ ఎవరు అంత పెద్దగా పట్టించుకోరు... ఆ ఘటన సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే కాస్త మాట్లాడుకుని ఆ తర్వాత మర్చిపోతుంటారు. జీవన క్రమంలో తమ పనుల్లో తాము మునిగిపోతుంటారు...

Read More Telangan I ఏదీ రాజ్యాంగ స్ఫూర్తి.. సందేహమా? సవాళ్ల?

భద్రతకు భరోసా మానవ రక్షణకు భరోసా ఏది అని మనం ఒకసారి ఆలోచించుకుంటే... కేంద్ర ప్రభుత్వం రోడ్డు సేఫ్టీ మంత్ అనే ఒక కార్యక్రమాన్ని గతంలోనే ప్రవేశపెట్టింది... దీన్ని అనుకరిస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు సేఫ్టీ క్లబ్బును ఏర్పాటు చేసింది.. అందుకే జనవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 14 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ట్రాఫిక్ నియమ నిబంధనలను వాహనదారులకు అవగాహన కల్పిస్తూ వారిని ప్రమాదాల నుండి ఎలా కాపాడాలో ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన పోలీసులు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉండే ఒక గొప్ప కార్యక్రమం రోడ్డు సేఫ్టీ క్లబ్... కానీ మనలో ఎంతమందికి ఈ విషయంపై అవగాహన ఉంది అనేది మనకి మనమే వేసుకోవాల్సిన ప్రశ్న... నిజానికి 2022లో రోడ్డు ప్రమాదాల నుండి మరణించిన వారి ప్రభుత్వ ఘనంగా ప్రకారం 1,68,000 మంది చనిపోయారని ప్రభుత్వ అంచనా. అంతకంటే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు...
రోడ్డు ప్రమాదాల నుంచి మనకి మనమే కాపాడుకోవాలా లేదంటే ఎవరు రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేవారు అని ఆలోచించాలా లేదంటే ప్రభుత్వాలు చట్టాలు నిర్ణయాలు విధివిధానాలు ప్రవేశపెట్టాల అని ఆలోచిస్తే... నిజానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని విధి విధానాలు అమలుపరిచిన వందల వేల లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూనే ఉన్నారు... ఇప్పుడు మనకు కావలసింది నినాదాలు కాదు ఒక నిర్ణయం కావాలి.. జీవితంలో రోడ్డు సేఫ్టీ గురించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అందుకే అంటారు మనలో డ్రైవర్లు చాలామంది ఉన్నారు కానీ ఒక మంచి డ్రైవర్ ఉన్నాడా అని మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి...

Read More School I శ్రీ చైతన్య పాఠశాలలొ వైజ్ఞానిక, సాంస్కృతిక,  క్రీడా ప్రదర్శన

నిజానికి రోజురోజుకి జనాభా పెరుగుతున్న కొద్దీ టూ వీలర్ ఫోర్ వీలర్ వాహనాలు కూడా ఎక్కువగానే పెరుగుతున్నాయి.. దాదాపుగా ఈ సంవత్సరంలో ఒక కోటి 68 లక్షల వాహనాలు రోడ్డుపై తిరుగుతున్నాయి దీనిలో 50% మన హైదరాబాదులోనే ఉన్నట్టు సమాచారం... అయితే దశాబ్ద కాలంలో మన హైదరాబాదులో 57 లక్షల వాహనాలు ఖరీదు చేయబడ్డాయి అంటే ట్రాఫిక్ రోజురోజుకు ఎంతగా పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు..

Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...

ట్రాఫిక్ పెరుగుతున్న జనాభా సంఖ్య పెరుగుతున్న రోడ్డు సౌకర్యాలు పెరగడం లేదు ఇదే ఒక పెద్ద సమస్యగా మారుతుంది... ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి సిసి రోడ్ల పునర్నిర్మానాన్ని చేస్తే వెంటనే ఏదో ఒక కారణంతో మళ్లీ ఆ రోడ్డును తొవ్వి అలాగే వదిలేసి వెళుతుంటారు. నిత్యం మనకి ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి... రోడ్లు సరిగ్గా లేకపోవడం ద్వారా ప్రమాదాలకు కారణాలుగా తయారవుతాయి... అలాగే మరణాలు తగ్గించడం కోసం ముఖ్యంగా ప్రతి ఇంట్లోనే తల్లి తండ్రి మైనర్లకు 2 వీలర్ వాహనాలు ఇవ్వడం అంత మంచి పద్ధతి కాదు...

Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..

ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మధ్యాన్ని ఎక్కువగా సేవించి జల్సా ల పేరుతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు... ఈ విషయం అందరికీ తెలిసిన మద్యం సేవించి వాహనం నడపడం పూర్తిగా నిషేధం చేయాలి... కానీ మన రాష్ట్ర ప్రభుత్వ ట్రాఫిక్ విభాగం మాత్రం చలాన్ల పేరుతో కాసులు దండుకొని ప్రభుత్వ ఖాతాలో వేసుకోవడానికి మాత్రమె పనికివస్తుంది. అంతటితో ఆ పనులు ముగుస్తున్నాయి... అందుకని చలాన్ వేయడం , ప్రజలు చలాన్లు కట్టకపోతే వాటిపై డిస్కౌంట్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. దానివల్ల ఎలాంటి మార్పు రాదు.. ఇక కొంతమంది కుర్ర కారు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తమ దగ్గర ఉన్న స్మార్ట్ఫోన్లను తీసి చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పెట్టడం పరిపాటి అయిపోయింది.. ముఖ్యంగా ఇక్కడ తీసుకోవలసిన జాగ్రత్త లైసెన్స్ ఇచ్చేముందు లూసెన్స్ వాడకుండా నియమ నిబంధనలతో సరి చేస్తే కొంత రోడ్డు ప్రమాదాలను కాపాడవచ్చు..

Read More Auto I షౌకత్ గ్యారేజ్

ఇక  రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల్ని తమకు తామే కాపాడుకోవడానికి షార్ట్ ఫిలిం ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇలా ప్రసారమాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను చిత్రీకరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి..
ముఖ్యంగా తల్లిదండ్రులు ఆ తర్వాత విద్య నేర్పే గురువులు ఆ తరువాత సామాజిక సమాజసేవకులు ప్రసార మాధ్యమాలు, ప్రభుత్వ అధికారులు వీటన్నిటితోపాటు ప్రభుత్వం ట్రాఫిక్ విభాగానికి రాష్ట్ర బడ్జెట్లో తగినంత బడ్జెట్ను కేటాయిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రమాదాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది... వ్యక్తి స్థాయి మార్పు నుండి వ్యవస్థ స్థాయి వరకు మార్పు చేస్తే మోటార్ వాహనాల చట్ట ప్రకారం తగిన నిర్ణయాలు తీసుకుంటే ట్రాఫిక్ మరణాల నుంచి ప్రజల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది... ముఖ్యంగా యువత సమస్యలను పట్టించుకోకపోవడం ఒకవేళ సమస్యల గురించి ఆలోచిస్తూ సమస్యల గురించి తెలుసుకొని అలా గాలికి వదిలేయడం చేస్తున్నారు కానీ సమాధానం వెతుక్కోవడం లేదు.. యువత ఆలోచన విధానం పూర్తిగా మారాలి.. అందుకే ప్రభుత్వం ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ భవనం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ట్రాఫిక్ ప్రమాదాల నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తున్నారు, అలాగే రామోజీ ఫిలిం డెవలప్మెంట్ అక్కడ ఒక భవనం కూడా ఏర్పాటు చేసి అనేక మార్గాల ద్వారా ట్రాఫిక్ ప్రమాదాల నుంచి కాపాడుకునే వివరణాత్మక చిత్రీకరణను ప్రదర్శిస్తుంది..
ఏది ఏమైనప్పటికీ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు మన రాష్ట్రం రోడ్డు సేఫ్టీ క్లబ్ ను ఏర్పాటు చేసి వారోత్సవాలు చేస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్క యువత తెలుసుకొని ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించి ప్రమాదాల నుంచి తమను తామే కాపాడుకోవాలి....

Read More Telangana I తుంగతుర్తి గడ్డపై ఎగరబోయే జెండా..!?

-  కడారి శ్రీనివాస్
 కాలమిస్ట్, కవి, సీనియర్ రాజకీయ విశ్లేషకులు
9848 962 799

Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

Views: 0