Telangana I మును గో.. డౌట్..

సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల రణరంగం మొదలైంది... అన్నిటికంటే భిన్నంగా మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు రసవత్తరంగా మారనుంది.. ఎందుకో ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ... 'జయభేరి' కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్

Telangana I మును గో.. డౌట్..

జయభేరి, హైద‌రాబాద్ : రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే మునుగోడుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఎన్నికలకు మరి అంత ప్రాధాన్యత ఉందన్నమాట... ఆ ప్రాధాన్యతే డబ్బు మద్యం మటన్ చికెన్ ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష... సరే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా సమాచారం.. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతోనే ఆత్మీయ సమ్మేళనాలు అలాగే జూన్ 2 నుంచి 20 రోజులపాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. ఏదైతేనేం ఎలాగో అలాగా తెలంగాణ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలను ఏకతాటి పైకి తీసుకురావడానికి ఈ తతంగం అంతా...

బీఆర్ఎస్ లో అక్కడక్కడ అసమ్మతి గళాలు వినిపిస్తున్న వాటన్నింటిని సద్దు మనిపేందుకే ఈ కార్యక్రమాలన్నీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు.. మరి ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో నిన్నగాక మొన్ననే ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైన శాసనసభ్యులు కూసుకుంట్ల భవితవ్యమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది... ఎందుకంటే ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు మద్యం మటన్ చికెన్ ప్రజలకు అందుబాటులో ఉంచి వారికి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేసి ఓట్లు దండుకున్నారని ఆరోపణలు ప్రతిపక్షాల నుండి వినిపిస్తున్న అవేవీ పట్టించుకోకుండా చకచక ప్రమాణ స్వీకారం చేసేసారు.. మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక బీ ఆర్ స్ కు కలిసి వచ్చిన ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎలక్షన్లో అధికార పార్టీకి మింగుడుపడని నిజం ప్రత్యక్షంగా కనిపిస్తోంది.

Read More ఎగ్లాస్పూర్ ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది... ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లోని శాసనసభ్యులు ప్రజలకు చేరువగా ఉండేందుకు నానా యాతనలు పడుతున్నారు.. ఇక మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు మునుపటి దాని కంటే ఎక్కువగా ఆశించే స్థాయిలో కనిపిస్తున్నారనే విషయం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. గతంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తాను గెలవడానికి తెలంగాణ పాలకవర్గం మొత్తం చెమటోడిస్తే గాని ఆయన గెలుపు సాధ్యం కాలేదు. అలాంటిది ఇప్పుడు ఎవరి గెలుపు కోసం వాళ్లు ప్రయత్నించుకునే దశలో కూసుకుంట్లకు ఎవరు తోడు నిలుస్తారు అనే ప్రశ్న ఇప్పుడే శాసనసభ్యుని మనసులో తొలిచి వేస్తుంది.. నిజమే ఉప ఎన్నికలు పాలకవర్గం వచ్చి చెమటోడ్చి కష్టపడితే గాని పూసుకుంట్ల గెలుపు సాధ్యం కాలేదు. అలాంటిది ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఇప్పటికే అధికార పార్టీ నేతలపై అసమ్మతి వర్గం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మరల గులాబీ జెండా ఎగిరేదెలా అనే అనుమానాలకు పక్కా రుజువు కనిపిస్తోంది..

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు అసెస్ మెంట్ అక్రీడిటేషన్ కౌన్సిల్ (న్యాక్ )సందర్శన

ఇక ఇదిలా ఉంటే ఆయన నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు ప్రతి పథకంలో కమిషన్లు నేతలు దండుకున్నారనే ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసేలా ప్రయత్నం చేస్తున్నారు.. ఇది చూసి తెలంగాణ అధినాయకత్వం పట్టించి పట్టించుకోనట్టుగానే నటిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రాహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది...

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు

మునుగోడు నియోజకవర్గం లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇక ఓటమి భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన అనుభవం ఉన్న ఉప ఎన్నికల్లో గెలవడానికి నానా యాతన పడ్డాడు. దీన్ని ఆసరా చేసుకుని ఈసారి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బిజెపి మరి గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది... అదే పోటీ గనుక బలంగా వస్తే ఇక మునుగోడు నియోజకవర్గంలో అధికార పార్టీ ఆశలు వదులుకోవాల్సిందేనా!?

Read More ప్రతాప్ రెడ్డికి అందజేసిన నూతన క్యాలెండర్

నిజానికి మునుగోడు నియోజకవర్గానికి అంత ప్రాధాన్యత గతంలో లేదు. కేవలం ఉప ఎన్నిక పుణ్యమా అని తెలంగాణ ప్రజానీకం అదృష్టంతా మునుగోడు నియోజకవర్గం పై పడింది. అదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో కంటే ఇప్పుడు మరి ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఎవ్వరి బాధ వాళ్ళు పడాల్సిందే అన్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ప్రజల్లోకి కచ్చితంగా వెళ్లాల్సిందే.. కాదు కూడదు లేదు అంటే శాసన సభ్యత్వం పై ఆశలు వదులుకోవాల్సిందే.. ఇక మునుగోడు నియోజకవర్గం పై అధికార పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టకపోతే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాజకీయాలనుంచి తప్పుకునే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.. ఎందుకంటే తెలంగాణలో అధికార పార్టీ హ్యాట్రిక్ కొట్టాలి అనే ఆలోచనతో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు పోతున్న ఈ తరుణంలో అన్ని నియోజకవర్గాల్లో కంటే కేవలం మునుగోడు నియోజకవర్గం పైనే ఉంది అనేది ప్రజాభిప్రాయం... మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రజల మధ్యనే ఉంటూ వస్తున్న ప్రజలు ఇప్పుడు కూసుకుంట్లను నమ్మడానికి సుముఖంగా లేరనేది పబ్లిక్ టాక్... చూద్దాం మునుగోడు నియోజకవర్గ ఇప్పుడు ఎవరికి దక్కుతుందో అనేది త్వరలోనే తెలుస్తోంది...

Read More బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ గా గోర శ్యాంసుందర్ గౌడ్.

ఇక ఈసారి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మరోసారి ఎన్నికల పండగ రానే వస్తుంది అని సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయి.. మునుగోడు ప్రజలారా అంత సంబరపడిపోకండి ఈసారి అంత డబ్బు అంత మద్యం అంత సీకను అంత మటను దొరకదు మరి... ఎందుకంటే సార్వత్రిక ఎలక్షన్లో కూసుకుంట్ల దగ్గర అంత డబ్బు ఇప్పుడు లేదంట మరి... అటు పార్టీ అభివృద్ధికి సర్డాలే ఇటు సొంత నియోజకవర్గంలో ప్రజలకు సర్దాలే... ఏం చేస్తాం నా కర్మ అనుకుంటూ కాలాన్ని నెట్టుకు పోవాల్సిందే తప్ప ఒక్కసారి పద్మవ్యూహం లోకి వెళ్లిన తర్వాత తిరిగి రావడం ఉండదనేది పాపం ఎమ్మెల్యే కి తెలిసినట్టు లేదు...

Read More మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పరామర్శించిన చల్లా ధర్మా రెడ్డి 

మునుగోడు నియోజకవర్గం ఎన్నిక ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ అన్ని నియోజకవర్గాల కంటే ప్రాధాన్యత సంతరించుకుంది.. ఎందుకంటే ఇక్కడి ప్రజలు చైతన్యవంతులుగా ఉంటారు కాబట్టి.. వారికి నచ్చినట్టుగా వారికి ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు ఇక్కడ వేస్తారు అనే భావన మునుగోడు నియోజకవర్గ అధికార ప్రతిపక్ష నాయకుల్లో బలంగా నాటుకుపోయింది.. ఏది ఏమైనా అన్ని నియోజకవర్గాల కంటే మునుగోడు నియోజకవర్గమే అధికార పార్టీకి చెప్పులో రాయిగా మారింది..

Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు

మును గో డౌట్ గానే మిగులుతుందా!?
లేదంటే అధికారాన్ని చేజిక్కించుకుంటుందా!?
ఇంకోవైపు అనూహ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను తప్పు చేశా సరిదిద్దుకునేందుకే తిరిగి కాంగ్రెస్ లోకి చేరుతున్న కేసీఆర్ను ఓడించడమే నా ఏకైక లక్ష్యం అని చిలక పలుకులు పలకడం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని అనగదొక్కడం రెండు ఒకేసారి జరుగుతున్నాయి.. అంటే మునుగోడులో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్న పరస్పర వ్యతిరేకతల మధ్య కాంగ్రెస్ ఓటమిపాలయ్యేనా!?
అదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దీన్ని ఆసరా చేసుకుని ఏమైనా మంత్రం వేస్తే ఏమో చెప్పలేం గుర్రం ఎగరవచ్చు అనే విధంగా విజయం చేరకమానదు...

Read More BJYM ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు

... కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి