College I సాంకేతికతతో భోధన చేయాలి

మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎఫీడీపీ ప్రారంభం

College I సాంకేతికతతో భోధన చేయాలి

మేడ్చల్ :

మనం జీవిస్తున్న వేగవంతమైన సాంకేతిక ప్రపంచంలో అధ్యాపకులు బోధన పద్ధతులను మెరుగుపరుచుకోవడమే కాకుండా సాంకేతికతతో విద్యార్థులకు బోధన అందించాలని బీహెచ్ఈఎల్ ఆర్అండ్ డీ డైరెక్టర్ మోహన్ రావు తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 5 రోజుల పాటు నిర్వహించనున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎస్ఓపీ) కార్యక్రమాన్ని సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ చక్రవర్తి భగవతి, హెచ్సీయూ ప్రొఫెసర్ రుక్మ రేఖ, కళాశాల ప్రిన్సిపాల్ మాధవిలత తో కలిసి సోమవారం ప్రారంభమైంది. సందర్భంగా వారు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో అభివృద్ధి చెందడానికి విద్యార్థులను శక్తివంతం చేసేందుకు సన్నద్ధం కావాలన్నారు.

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...

IMG-20240205-WA2421

Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

సాంకేతికతను అప్గ్రేడ్ చేయడానికి మరియు బోధనకు సహయపడే కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఎఫీపీ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. నైపుణ్యాలను పెంచుకోవడం, విద్యార్థులకు కొత్తదనంతో పాఠాలు చెప్పడం అధ్యాపకులు అలవర్చుకోవాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ మాధవిలత మాట్లాడుతూ ఐదు రోజుల కార్యక్రమంలో డాటా అనాలసిస్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ,ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ డిసైన్ అండ్ ఆటోమేషన్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ అనాలసిస్ అంశాలపై అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డీన్లలు. టీపీఓ, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

Read More ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్,పెన్నులు పంపిణీ