Congress I రగులుతున్న రాజకీయం.. మంట పెట్టే వారెవరు!?

మూడవసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం అని అనుకున్న కేసీఆర్ అండ్ టీం బొక్క బోర్లా పడింది... ఏకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మూడవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు...

Congress I రగులుతున్న రాజకీయం.. మంట పెట్టే వారెవరు!?

జయభేరి, హైద‌రాబాద్ :

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత ఎన్నికలు ఒక చరిత్రనే సృష్టించాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత రెండు దఫాలుగా కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరింది... మూడవసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం అని అనుకున్న కేసీఆర్ అండ్ టీం బొక్క బోర్లా పడింది... ఏకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మూడవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు... ఇంతవరకు బాగానే ఉంది సరిగ్గా రెండు నెలలు కాకముందే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు రాజకీయ దుమారం రేగుతోంది!? రాజకీయ మంటను రగిలిస్తున్నది ఎవరు? అభివృద్ధి సంక్షేమం కావాలా అలసడులు నిరసనలు సమ్మెలు ఇలాంటివి కావాలా? అనే విషయం తెలంగాణ ప్రజల్లో సర్వత్ర రగులుతోంది... ఇదే విషయంపై 'జయభేరి' చేసిన సర్వే ప్రకారం కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర రాజకీయ విశ్లేషణ....

Read More మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పరామర్శించిన చల్లా ధర్మా రెడ్డి 

మూడవ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి 6 గ్యారంటీ పథకాల్లో ప్రకటించిన ప్రకారంగా మొట్టమొదట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించారు.. అలాగే మరికొన్ని పథకాలను ముందుగా ప్రకటించిన విధంగా 100 రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అనేక విధాలుగా ఆదేశాలను జారీ చేస్తూ వస్తుంది... ఇలా ప్రభుత్వం పాలనను కొనసాగిస్తున్న తరుణంలో.. ప్రతిపక్షంలో కూర్చున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులకు రథసారధికి కంటిమీద కునుకు లేకుండా పోతుంది... పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ ససివిరా కాంగ్రెస్ పాలనను సీఎంగా రేవంత్ రెడ్డిని అంగీకరించడం లేదు... కేటీఆర్ అంగీకరించిన అంగీకరించకపోయినా పెద్ద ఒరిగింది ఏమీ లేదు... ఇక్కడ వస్తున్న ప్రస్తుత సమస్య రాజకీయ దుమారాన్ని రేపుతున్నది ఎవరు అనే ప్రశ్న ప్రజలందరికీ ఇప్పటికే అర్థమవుతుంది... మొన్నటికి మొన్న ఆటోల్లో ప్రయాణించి సెలబ్రిటీగా ఆటో వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్న కేటీఆర్ గత తొమ్మిదేళ్ల పాలనలో ఎప్పుడన్నా ఆటోవాలా గురించి ఆలోచించారా? వారి సంక్షేమం గురించి గానీ బడ్జెట్లో వారికి కొంత నిధులను కేటాయింపుగాని గృహ సౌకర్యంగానే ఇలాంటివి ఏమైనా అందించారా అనేది సబ్బండ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇది సరే.. ఇక ఇప్పటికే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో విజయం సాధించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కేటీఆర్ కి  మింగుడు పడడం లేదు... అదే వరుసలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం మరీ మింగుడు పడడం లేదు కేటీఆర్ కి... దీన్ని ఆసరా చేసుకొని సిరిసిల్ల సభలో కేటీఆర్ మాట్లాడుతూ పోయేవాళ్లు పోనీ వచ్చేవాళ్ళు రాని ఒంటరిగా ఉన్నప్పుడే గులాబీ కండువా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది..

Read More మేడ్చల్ లో కీచక పోలీస్

ఎవ్వరు ఉన్న ఎవ్వరు లేకున్నా కొత్త నాయకులను మళ్లీ తయారు చేస్తాం దానికి నేనే బాధ్యత తీసుకుంటాను అని అన్న కేటీఆర్ మాటల్లోని అంతరార్థం పరిశీలిస్తే... మరో ఐదేళ్లు తన తండ్రి బాధ్యతను పూర్తిగా తీసుకొని ఎలాగైనా ప్రజా మద్దతును కూడగట్టుకుని సీఎం కావాలనే ఆశ ఆది నుంచే మొదలు పెడుతున్నాడు..  నిజానికి రాజకీయాల్లో శత్రువులు గాని మిత్రులు గాని ఉండరు అనేది నగ్నసత్యం జగమెరిగిన నిజం.. మరి ఇలాంటి రాజకీయాల్లో కనీసం పరిజ్ఞానం లేదా.. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి తమ నియోజకవర్గ సమస్యలను తెలియజెప్పడం అంత నేరమ!? అంటే ఇక్కడ మీడియా వక్రీకరిస్తుందా? అదిగో ఫలానా ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిశాడు అనే వార్తను మూడో మనిషి చెప్పినట్టుగా ఇంత రాద్ధాంతం చేయడం దేనికి? కనీస జర్నలిజం విలువలు మరిచిన మీడియా గీత దాటుతోందా? అన్న సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి...

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలపై హాట్ కామెంటును చేస్తూ కేటీఆర్ మరోసారి రాజకీయాల్లో చురుకైన నేతగా ఎదగాలనే ఉద్దేశంతో ఆయన దానికి కాని దానికి రాజకీయ దుమారాన్ని లేపుతున్నారని ఆరోపణలు ఆ నోట ఈ నోట తెలంగాణ నిండా వినిపిస్తూనే ఉన్నాయి.... అయినా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ ది చాలా చిన్న పాత్ర... ఉద్యమం జరిగే రోజుల్లో మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో ఒక్క కేసిఆర్ నే కాదు... కెసిఆర్ తో పాటు, గాదె ఇన్నయ్య.. ఈటెల రాజేందర్ స్వర్గీయ టైగర్ నరేందర్ లాంటి సీనియర్ నేతలు కేసీఆర్ తో ఆనాడు జతకట్టి తెలంగాణ రాష్ట్రం కొరకు ఒకటయ్యారు...
తెలంగాణ ఉద్యమంలో ఎంత మందిని తొక్కుకుంటూ నెట్టేస్తూ వాడుకుంటూ ఏదో ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. వచ్చిన తెలంగాణకు అడ్డుపడి డిసెంబర్ 9నటి ప్రకటన తర్వాత తెలంగాణ ఆత్మహత్యల పర్వానికి తెరతీసింది ఎవరు? ఇలాంటి ఎన్నో సంఘటనలకు అవకాశం కల్పిస్తున్న తరుణంలో కేటీఆర్ మధ్యలో వచ్చి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను నాది తెలంగాణ అని చెప్పుకొచ్చిన కల్వకుంట్ల తారక రామారావు మీ విద్యాభ్యాసం మీ చదువు మీ విజ్ఞానం ఎక్కడెక్కడ పెరిగిందో ఈ తెలంగాణ ప్రజలకు తెలియదా? అని తెలంగాణ ప్రజలు ఒకరికి ఒకరు గుసగుసలు పెట్టుకుంటూనే ఉంటున్నారు...

Read More చలో నల్లగొండ  రైతు మహాధర్న కార్యక్రమానికి బయలుదేరిన  చందంపేట మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

అయ్యో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయకపోతే నిలదీయండి ధర్నాలు చేయండి గొడవలు చేయండి అన్నట్టుగా రాజకీయ టుమారో రేపడానికి ముఖ్య కారణం అధికారం పోయిందని అక్కసు కనిపిస్తుంది కానీ ప్రతిపక్ష నేతగా గౌరవ మర్యాదను కాపాడుకోలేక పోతున్నారు అని మరి కొంతమంది అభిప్రాయం...
వంద రోజులు ఆరు గ్యారెంటీ పథకాలు ఎలాగైనా అమలు పరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ఏదో ఒక విధంగా అడ్డుకోవడమే లక్ష్యంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్న నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజలకు ఆమోదయోగ్యంగా మాట్లాడాలి అనే విషయం తెలుసుకోవాలి కానీ ప్రతి విషయాన్ని అవసరంగా మలుచుకొని దుమారం రేపాలని చూస్తే గతంలో సీఎం రేవంత్ రెడ్డి 100 అడుగుల్లోకి తొక్కేస్తాం అన్న మాటలు రుజువైతాయో ఏమో అని కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరికొకరు చెవుల్లో చెప్పుకుంటున్నారు... తొందరెందుకు సుందరవదన ముందుంది ముసళ్ళ పండుగ అని అనుకుని కాస్త ప్రభుత్వం చేసే పనుల్లో అవినీతి అక్రమాలు భూకబ్జాలు ఏమన్నా దొరకకపోతే అని చూడొచ్చు కదా కాస్త ఓపిక పట్టొచ్చు కదా అని వాదన కూడా లేకపోలేదు... ఏది ఏమైనా సుందరానికి తొందరెక్కువ అన్న విధంగానే ప్రతిపక్ష పార్టీలో కూర్చున్న టిఆర్ఎస్ పార్టీ నిజంగా ప్రజలపై ప్రేమే ఉంటే కాస్త ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తే బాగుంటుంది అని సామాజిక వాదుల వాదన...

Read More వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అందుకనే కాస్త ఓపిక పట్టండి సారు అని అంటూ సదరు టిఆర్ఎస్ కార్యకర్తలే ఒక్కొక్కరుగా పార్టీని విడిపోయే ప్రమాదము లేకపోలేదు... అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిస్తే అంత పాపం చేసినట్టా? ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కలవకూడదా? అయినా ఎన్నికల వరకే ఈ వాదోపవాదాలు ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి ఎందుకు బిఆర్ఎస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రిగా కనబడడం లేదు? ఒక్క కేటీఆర్ కి సీఎంగా రేవంత్ రెడ్డి నచ్చడం లేదు అంటే మిగతా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ సీఎం రేవంత్ రెడ్డి అంటే గౌరవం కాబట్టి అందుకే కలిసారేమో.... ఏమో గుర్రం ఎగరవచ్చు!?

Read More నవవధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన గోలి సంతోష్

ఇప్పటికైనా రాజకీయ దుమారం లేపకుండా ప్రజా సమస్యలపై ప్రజా సంక్షేమంపై ప్రజా అవసరాలపై ప్రజా ఇబ్బందులపై దృష్టి సారించి కనీసం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మద్దతును కూడగట్టుకోలేదు ఇప్పటికైనా ప్రతిపక్షంలో కూర్చుని ప్రజా సమస్యలపై గళం విప్పండి అంటూ గడ్డి పెడుతున్నారు తెలంగాణ ప్రజలు.... సర్లే రాజకీయమంటే సందు దొరికినప్పుడే గుద్ధి మెడలు వంచడం అన్నట్టేమో ఎప్పుడు సందు దొరుకుతుందా అని చూస్తున్న ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి చాన్సే ఇవ్వడం లేదు ఏకంగా కుల గణన చేస్తూ అనేక రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్న ఈ తరుణంలో ప్రతిపక్ష పాత్రలో కూర్చున్న టిఆర్ఎస్ నేతలు ఆ టీం లీడర్ కాస్త ఆలోచించండి సార్ అని అంటున్నారు తెలంగాణ ప్రజలు.....

Read More జర్నలిస్టుల ముసుగులో వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి

...-  కడారి శ్రీనివాస్
 కాలమిస్ట్, కవి, సీనియర్ రాజకీయ విశ్లేషకులు
9848 962 799

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి