చైనా మాంజా పోలీసులు పంజా
జయభేరి, మేడ్చల్ : సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. ఎక్కడ చూసినా ఒక సంతోషకర వాతావరణం కనిపిస్తుంటుంది. వీటిలో పంతంగులు ఎగురవేయడం ఒకటి. అయితే... ఈ పతంగులకు చైనా మాంజా వాడుతుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ మంజా చుట్టుకొని గాయపడడమేగాక ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిన్నాపెద్దా తేడా లేకుండా పతంగులు, మాంజా, చరఖ్ లను కొనుగోలు చేస్తున్నారు.
విక్రయిస్తున్నవారిపై కేసులు..
నిషేధిత సింథ టిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ చైనా మాంజా విక్రయాలపై మేడ్చల్ పోలీసులు దృష్టి సారించారు. మేడ్చల్, షామీర్పేట తదితర పోలీసు స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో గాలిపటాలు, మాంజా విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
చైనా మాంజా విక్రయిస్తే చర్యలు తప్పవు: సత్యనారాయణ సీఐ, మేడ్చల్... పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మంజల విక్రయంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. బృందాలుగా ఏర్పాటు చేసి దుకాణాలలో తనిఖీలకు ఆదేశించాం. నిషేధిత మాంజాలు అమ్మకుండా దుకాణదారులకు సూచించాం.



