Telangana I పార్లమెంట్ ఎన్నికల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి
వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ కాంచన సత్యనారాయణ గుప్తా
జయభేరి, హైదరాబాద్ :
ఈ సందర్భంగా కాచం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు నుండి పార్లమెంటులో వైశ్యులకు ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమన్నారు. రాజకీయపరంగా వైశ్యుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉద్యమకారునికి మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ టికెట్ కేటాయిస్తే వైశ్యులందరూ తప్పకుండా బి అర్ ఎస్ పార్టీ వెంట నడిచి అభ్యర్థిని గెలిపించేందుకు శాయశక్తుల కృషి చేస్తామనీ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 2014, 18, 23లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని కేటాయించలేదని ఈ పార్లమెంట్ ఎన్నికలోనైన కనీసం ఒక సీటైన కేటాయించాలి అని అన్నారు. కేంద్రంలోని బిజెపి పార్టీ కూడా ఎన్నికల్లో కనీసం రెండు సీట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక సభ్యులు నంగునూరు రమేష్, రామ్ నరేష్, కాచం సాయి, కాచం సుష్మ, కోడుమూరి దయాకర్, బిల్దే శ్రీధర్, బచ్చు శ్రీనివాస్ గార్లపాటి జితేందర్, శేఖర్, ప్రభు గుప్త, ఉప్పల శ్రవణ్, పూర రమేష్, రావికంటి శ్రీనివాస్, అంజయ్య, వివిధ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.
Post Comment