tsrtc I ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

60 ఏళ్లు దాటినట్లుగా ఉండే ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారులు వివరించారు

tsrtc I ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

జయభేరి, విజయవాడ : ఏపీఎస్ఆర్టీసీ 60 ఏళ్ల పైబడిన వారికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. 25 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రాయితీని పొందాలనుకునే వృద్ధులు 60 ఏళ్లు దాటినట్లుగా ఉండే సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఆధార్ కార్డు ఫోన్ లో చూపించినా రుజువుగా భావిస్తామని చెప్పుకొచ్చారు. టికెట్లలో పాతిక శాతం రాయితీ కోసం పైన చెప్పిన వాటిల్లో ఏ ఒక్క కార్డును వెంట తీసుకొచ్చినా.. 25 శాతం రాయితీ కల్పిస్తామన్నారు.

ఆర్టీసీ అధికారులు అన్ని జిల్లాల డీఎంలు, సూపర్ వైజర్లు.. కండెక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని వివరించారు. ప్రజల్లో ఎలా అవగాహన కల్పించాలో ప్రత్యేక సమావేశాల ద్వారా సిబ్బందికి, ఏటీబీ ఏజెంట్లకు సూచించాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని... విమాన ప్రయాణాల తరహాలోనే ఆర్టీసీ ప్రవేశ పెట్టబోతున్నట్లు వెల్లడించింది. ఒక నగరం నుంచి మరో పట్టణం, నగరానికి నేరుగా బస్సు సౌకర్యం లేనప్పుడు ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే బ్రేక్ జర్నీ విధానంలో అవకాశాన్ని కల్పించింది.

Read More తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు

భద్రాచలం నుంచి తిరుపతి వెళ్లేందుకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు భద్రాచలం నుంచి విజయవాడకు, అక్కడి నుంచి తిరుపతికి ఒకేసారి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు కూడా బస్ రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. బ్రేక్ జర్నీ సమయం 2 గంటల నుంచి 22 గంటల వరకు ఉండొచ్చు. ఆర్టీసీ మొదటి దశలో రాష్ట్రంలో 137 పట్టణాలు, నగరాల నుంచి ఈ మల్టీ టికెటింగ్ సదుపాయాన్ని ప్రవేశ పెట్టింది. మరిన్ని పట్టణాలకు ఆ తర్వాత దశల్లో ఈ సౌలభ్యాన్ని విస్తరించనుంది.

Read More ఖేల్ ఖుద్ పోగ్రామ్ (అటాలపోటీ) ఏకల్ అభియాన్ ద్వారా భోవనేశ్వ (ఒడిస్సా)కి బయలుదేరిన క్రీడాకారులు

తెలంగాణ ఆర్టీసీ దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 10 శాతం రాయతీ ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 15 నుండి 29వ తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 30వ తేది వరకు ఆయా తేదీల్లో ప్రయాణానికి ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ ఉన్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. 

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు ఈ పర్వదినాలకు వెళ్తారు. అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లోనూ రాకపోకలు సాగిస్తుంటారు. 10 శాతం రాయితీని ఇవ్వాలని ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. 15 రోజులు మాత్రమే దసరా పండుగ సెలవుల సమయంలో ఈ రాయితీ అమల్లో ఉంటుంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలి.” - టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్.

Read More ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి