Students I నైపుణ్య శిక్షణకు.. కేరాఫ్ తెలంగాణ....

తెలంగాణలో ఉన్న దాదాపు 35 లక్షల నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణను ఇప్పించేందుకు తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు...

Students I నైపుణ్య శిక్షణకు.. కేరాఫ్ తెలంగాణ....

జయభేరి, హైద‌రాబాద్ :

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన దగ్గర నుంచి 6 గ్యారంటీ పథకాలను అమలు చేసే విషయంతో పాటు తెలంగాణలో ఉన్న దాదాపు 35 లక్షల నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణను ఇప్పించేందుకు తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిరుద్యోగతను పారద్రోలడానికి 35 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు  కల్పించడానికి కావలసిన సహాయ సహకారాలు తోడ్పాటు స్కిల్ యూనివర్సిటీని విజయవంతంగా నడపాలంటే కావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు, ఏ విధంగా ఉండాలి? అనేక విషయాలపై 'జయభేరి' కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ...

Read More ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 

తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన దగ్గర్నుంచి అనేకమైన విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చక చక పనులు సాగుతున్నాయి. అసలు మన రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఇంతకుముందు ఎప్పుడు లేదు. తెలంగాణలో 35 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గత 50 సంవత్సరాలలో ఆలోచించని విధంగా కేవలం రాష్ట్రం సాధించుకున్న 10 సంవత్సరాలలో ఈ ఆలోచన రావడం నిజంగా విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. పట్టణ గ్రామీణ పరిసర ప్రాంతాల్లో నివసించే యువత తమ చదువుల్లో ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపేసి ఏదో ఒక పనికి పూనుకుంటున్నారు. ఇలా జీవితాన్ని ఇంటర్మీడియట్ దశలోనే ఉపాధి కరువు పనికి పోవడం దొరికిన పనిని చేసుకోవడం ద్వారా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యన్ని మనం బయటికి తీయలేకపోతున్నాం.

Read More నీ తాటాకు చప్పులకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి

సాధారణంగా 8, 9, 10, 11, 12 తరగతిలో చదివే విద్యార్థిని విద్యార్థుల్లో కచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి పాఠ్యపుస్తకాలను ఏర్పాటు చేయాలని, మన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈనాడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ ఆ దిశగా చిన్న చిన్న తరగతుల్లో ఉన్నప్పుడే విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని గుర్తించి వాటికి తగినట్టుగా పాఠ్యాంశాన్ని చేర్చి 12వ తరగతి లోపే వారిని ప్రయోజకులుగా చేస్తే కనుక నిరుద్యోగ సమస్య ఒక్కసారిగా కాకపోయినా రాను రాను తెలంగాణలో నిరుద్యోగతను నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. సంస్కృతంలో ఒక చక్కనైన పద్యం తాగింది దాన్ని తెలుగులో పుస్తక పఠనంతో చదివే చదువు విద్యా విషయంలో వాళ్ళు ప్రయోజకులైన వాళ్ళు మూర్ఖులతో సమానం. కానీ అనుభవ పూర్వకంగా పుస్తక పఠన చేసేవాళ్లు గొప్పవారిగా అవుతారు అనేది సంస్కృతంలో వ్రాసి ఉంది. అంటే దాదాపు మన దగ్గర పుస్తక పఠన చేసే వాళ్లే ఎక్కువగా ఉన్నారని అలా చేయకూడదని అనుభవ పూర్వకంగా అంటే యువతలోని నైపుణ్యాన్ని బయటికి తీసి వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రంతో పాటు దేశం సమగ్ర ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుందనేది ఇందులో దాగిన సత్యం.

Read More పరకాల ఏజీపీగా లక్కం శంకర్

తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం సంతోషకరం. ఈ యూనివర్సిటీ ఒకేషనల్ కోర్సులు 5వ తరగతి నుండి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఇందులో విద్యార్థులకు అందించాలి. అలాగే విద్యార్థుల్లో ఎలాంటి నైపుణ్యం దాగి ఉంది అని తెలుసుకునే వారికి పెయింటింగ్ మెకానిక్ ఇలాంటి రంగాల్లో వారి ఆలోచనలకు పదును పెడుతూ ఎనిమిదో తరగతి పాసైన తర్వాత వారికి టెక్నికల్గా 36 కోర్సులు ఉన్న తరుణంలో ఏదో ఒక కోర్సులో వారి నైపుణ్యాన్ని బట్టి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలపై ఎంతైనా ఉంటుంది. 12వ తరగతి చదివిన పై విద్యార్థులకు బ్యాచిలర్ స్కిల్స్ మాస్టర్స్ లొకేషన్స్ మాస్టర్ స్కిల్స్ అనే వివిధ రకాల కోర్సులను స్కిల్ యూనివర్సిటీ ద్వారా పరిచయం చేసి డిగ్రీ పొందిన వారికి ఒకేషనల్ కోర్సెస్ లో అభివృద్ధిని సాధించేందుకు వారికి చేయూతనందిస్తూ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని ప్రోగ్రామింగ్ ను ఇలాంటి యూనివర్సిటీలలో బోధిస్తూ సాధ్యమైనంతవరకు విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకమైన ఆలోచనలను వెలికి తీయాలి. ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలలో కావలసిన సౌకర్యాలు ప్రమాణాలను బట్టి ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఇండస్ట్రీస్ తో కొలాబరేషన్ మ్యానుఫ్యాక్చరర్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ ఇలాంటి కోర్సులు విద్యార్థుల నైపుణ్యాన్ని బట్టి వారిని ప్రోత్సహిస్తూ చేయూతనందించాలి అలా చదివిన చదువు జీవితంలో వారికి ఉపయోగపడుతూ ఇండస్ట్రీలను కొలాబరేషన్ యూనివర్సిటీలు చేసుకోవడం ద్వారా కొద్ది కాలంలోనే వారికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్ లను ఏర్పాటు చేస్తూ విభిన్న రంగాల్లో వారి నైపుణ్యాన్ని బట్టి వారికి శిక్షణను అందించాలి.

Read More మహారాష్ట్రలో పనిచేయని ఆరు గ్యారంటీలు

మనదేశంలో మన రాష్ట్రంలో నిరుద్యోగ యువకలుగా మారడానికి అసలు కారణం కేవలం పాఠ్యపుస్తకాలు చదివి పరీక్షలు రాసి వదిలేయడమే... వారు చదివే చదువు వారి జీవితానికి పనికి రాకుండా పోవడం ఎందుకు మంచి ఉదాహరణ. అలా 12వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులు జీవితంలో పై చదువులు చదువుకోలేక ఆర్థిక భారంతో నిరుద్యోగ భారాన్ని మోస్తూ కేంద్ర ప్రభుత్వం అందించే పనికి ఆహార పథకంలో కార్మికులుగా మారిపోతున్నారు. దీని ద్వారా రోజురోజుకు తెలంగాణలో నిరుద్యోగ భారం ఎక్కువగా పడుతుంది. 1997లో నిరుద్యోగ భారాన్ని తగ్గించేందుకు ఆనాటి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ లో డిజైనింగ్ సర్వీసెస్ ఇలాంటి కరికులను డిజైన్ చేయాలని నిర్ణయించినప్పటికీ అది తూతూ మంత్రంగానే ముగిసిపోయింది. చాలా ఏండ్ల తర్వాత స్కిల్ గ్యాప్ ను పూడ్చడానికి మళ్లీ తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మంచి ఆలోచన నిర్ణయాన్ని తీసుకొని నిరుద్యోగ భారాన్ని తగ్గించేందుకు స్కిల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఇప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా మారింది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు పారిశ్రామిక దిగ్గజాల తోడ్పాటు ఎంతైనా అవసరం. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సద్భావన కలిగి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ను చెన్నై నుండి అందిస్తున్నారు. దీనిలో 50% ఐటిఐలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఒక గ్రామీణ ప్రాంతంలోని యువతి యువకులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది దానికి తగ్గ ప్రణాళికలు కూడా రచిస్తూ పరిశ్రమల భాగస్వామ్యాన్ని అందిస్తోంది.

Read More ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిగా స్కిల్ యూనివర్సిటీలను నడపలేవు దీనికి తోడుగా ప్రభుత్వం మరియు ఇండస్ట్రీలు కలిసి ఒక్కటిగా పని చేయాలి. యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీసి యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న ఇండస్ట్రీస్ ని యూనివర్సిటీల సహాయ సహకారాలతో స్కిల్ డెవలప్మెంట్ లో చదువుకున్న విద్యార్థులను ఆయా ఇండస్ట్రీస్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉండాలి. ఇప్పటికే సిఎస్ఆర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పారిశ్రామిక దిగజాలతో కలిసి అనేక ఉపాధి అవకాశాలను ఇండస్ట్రీస్ భాగస్వామ్యాన్ని వహిస్తున్నాయి...

Read More ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే

నిజానికి 35 లక్షల మందికి తెలంగాణలో ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే అంత మామూలు విషయం కాదు. కేవలం ఒక్క తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే ఇంత భారీ మొత్తంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించవు. ప్రైవేటు ప్రభుత్వ యూనివర్సిటీలు విద్య విషయంలో ఎలా ఉన్నాయో అలానే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు అనేకంగా తెలంగాణలో భారీగా నెలకొల్పాలి. స్కిల్ యూనివర్సిటీలలో రకరకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ను జతచేస్తూ ఆయా ఇండస్ట్రీస్ ని కొలాబరేషన్ తీసుకొని వారితో మమేకమై విద్యార్థులను నైపుణ్య శిక్షణలో తీర్చిదిద్ది ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లాగున స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు బాధ్యతలు తీసుకోవాలి వీటికి ప్రభుత్వం తోడ్పాటు సహాయ సహకారాలు కావలసిన బడ్జెట్ను ఆయా స్కిల్ యూనివర్సిటీలకు అందించాలి. విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి విద్యార్థులకు మెకానిక్ పెయింటింగ్ ఒకేషనల్ కోర్సెస్ ఇండస్ట్రీస్ లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే కోర్సెస్ ఇలా విభిన్న రకాల ఒకేషనల్ కోర్సెస్ అభ్యసించి రానున్న తెలంగాణలో నిరుద్యోగ భూతాన్ని పారద్రోలు ఎందుకు ప్రతి ఒక్క యువత నడుము కట్టి వారిలో ఉన్న స్కిల్ అంటే నైపుణ్యాన్ని బయటికి తీస్తూ ఆయా యూనివర్సిటీలో చదువుకొని జీవితంలో ఉపాధి అవకాశాలు దక్కించుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలి... ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతి యువకులకు స్కిల్ యూనివర్సిటీ ఒక్కటే సరిపోదు ఇంకా అనేకంగా ప్రభుత్వ ప్రైవేటు స్కిల్ యూనివర్సిటీలు ముందుకు వచ్చి విరివిగా యూనివర్సిటీలను నెలకొల్పి విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాన్ని బయటకి తీస్తే నిజంగా బంగారు తెలంగాణ గా మనం రేపటి తెలంగాణలో చూడవచ్చు..నిజంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ఇది ఒక విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది.

Read More ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

...-  కడారి శ్రీనివాస్
 కాలమిస్ట్, కవి, సీనియర్ రాజకీయ విశ్లేషకులు
9848 962 799

Read More మెడిసిటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి