డాక్టర్ కోవా లక్ష్మణ్ బీసీ కులాల సబ్బండ వర్గాల ఆశా జ్యోతి

ప్రొఫెసర్ యుద్దవీర్ కట్టా

డాక్టర్ కోవా లక్ష్మణ్ బీసీ కులాల సబ్బండ వర్గాల ఆశా జ్యోతి

జయభేరి, హైదరాబాద్, జూలై 5: జూలై 3న బీజేపీ డాక్టర్ కోవా లక్ష్మణ్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ మేధో విభాగం కన్వీనర్ ప్రొఫెసర్ మరియు శాస్త్రవేత్త యుద్దవీర్ కట్టా డా. లక్ష్మణ్  65వ పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణం నెలకొందని అన్నారు పార్టీ క్యాడర్ మధ్యన ప్రోఫెసర్ యుదవీర్ ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా యుద్ధవీర్ మాట్లాడుతూ... డాక్టర్ లక్ష్మణ్ ఎక్కడ పనిచేసినా తనదైన శైలిలో విజయవంతమైన ఎమ్మెల్యేగా, రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ ఎంపీగా తనదైన శైలిలో పనిచేశారని, పార్టీ అగ్ర నాయకత్వం ఆయనపై నమ్మకం ఉంచుకొని,పార్టీలో అనేక పదవులు ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారని, బీసీ సమాజ అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని యుద్దవీర్ అన్నారు.

దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేశారు. రాజ్యసభలోని అన్ని బీసీ వర్గాలకు ఆయన గొంతుకగా మారారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను ఆయన విజయవంతంగా నిర్వహించారు. ఓబీసీ జాతీయ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా బీసీ ఓటు బ్యాంకును ఆయన గణనీయంగా బీజేపీ పార్టీ కి పొలెరైజ్ అయ్యేలా కఠోరంగా శ్రమించారు. దేశంలో ఓబీసీ మోర్చాను ఆయన క్రియాశీలం చేశారు. డాక్టర్ లక్ష్మణ్ నిరంతర కృషి కారణంగా బీజేపీ లోక్ సభలో మరిన్ని సీట్లు సాధించిందని ప్రొఫెసర్ యుద్ద వీర్ కట్టా ఆయనకు మరోసారి జన్మ దిన శుభాకాంక్షలు తెలుపుతు, భవిష్యత్ లో కూడ మరింత ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు ప్రో|| యుద్ధవీర్.

Read More Congress I రగులుతున్న రాజకీయం.. మంట పెట్టే వారెవరు!?

Views: 1