దొరికిన హ్యాండ్ బ్యాగ్ ను డిపో అధికారులకు అందజేసినారు

దొరికిన హ్యాండ్ బ్యాగ్ ను డిపో అధికారులకు అందజేసినారు

జయభేరి, దేవరకొండ :
దేవరకొండ ఆర్టీసీ డిపో కండక్టర్ అలివేలు మంగ, డ్రైవర్ నజీర్ లు బస్సులో దొరికిన హ్యాండ్ బ్యాగ్ ను డిపో అధికారులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. హైదరాబాద్ గోల్నాకకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు దేవరకొండ-హైదరాబాద్ బస్సులో పోగొట్టుకున్నారు. గమనించిన కండక్టర్ డ్రైవర్ భద్రపరిచి డిపోలో అందజేశారు. అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు విచారణ జరిపి బాధిత కుటుంబానికి అందజేశారు. బ్యాగులో రూ.35 వేల విలువగల మొబైల్, రూ.2000 నగదు ఉన్నట్లు తెలిపారు. బాధితురాలు ఆర్టీసీ అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీగా విధులు నిర్వహించిన సిబ్బందిని ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ బాబు  అభినందించారు.

Views: 0