తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాబ్ మేళా

తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాబ్ మేళా

జయభేరి, దేవరకొండ :
దేవరకొండ తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల దేవరకొండ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ సహకారంతో జూలై 3 2025న జాబ్ మేళా నిర్వహించను న్నారు. ఈ కార్యక్రమాన్ని మా కార్యదర్శి  ఆమోదించారు. ఈ సందర్భంగా ఏ.ఎస్.పి మౌనిక మేడం , కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. హరిప్రియ  మేడం జాబ్ మేళా బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనదలచిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హతతో, రూపాయలు 50 రిజిస్ట్రేషన్ ఫీజు తో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, హాజరు కావలసిన స్థలం TGTWRDC(W)దేవరకొండ, HRD క్యాంపస్, డిండి రోడ్డు అని, ఈ ఉద్యోగమేళా నిర్వాహకులు అయినా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. హరిప్రియ  తెలియజేశారు.

Views: 2