పాములపర్తి వెంకట నర్సింహా రావు 104వ జయంతి వేడుకలు 

పాములపర్తి వెంకట నర్సింహా రావు 104వ జయంతి వేడుకలు 

జయభేరి, దేవరకొండ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం దేవరకొండ యందు మన దేశ మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహ రావు  104వ జయంతి సందర్బంగా ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్ వారి చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేసినారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పి. వి  సేవలను మరువలేము.భారతదేశ తొమ్మిదవ ప్రధానిగా ఆర్థిక సంస్కరణ చేసి దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దిన్నారు. బహుబాష కోవిధుడు, న్యాయవాది, రాజకీయావేత్త, రచయితగా ప్రజ్ఞ ప్రతిభలు కలవారు అని కొనియాడినారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, కార్యవర్గ సభ్యులు ముసిని వీరయ్య, కాశిమల్ల చెన్నయ్య, అలంపల్లి శ్రీనివాసులు, ప్రభాకర్ తదితరులు పాలుగోని నివాళులు అర్పించారు.

Views: 0