శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం మూడు నెలలు మూసివేత..

ఎందుకంటే..!

శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం మూడు నెలలు మూసివేత..

జయభేరి, శ్రీశైలం : శ్రీశైలం దేవాలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 31 శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేయనున్నారు.

ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను అటవీ అధికారులు నిలిపేశారు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు భక్తులను అనుమతించడం లేదని అటవీ అధికారులు తెలిపారు. జంగిల్ రైడ్ పేరుతో ఇష్టకామేశ్వరి ఆలయానికి అటవీశాఖ​ వాహనాలు నడుపుతుంది.

Read More విజయదశమి సందర్భంగా దుర్గామాతకు ఘనంగా పూజలు

శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి ఆలయం నల్లమల అడవులలో ఉంది. భద్రతా కారణాలు, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో దట్టమైన అడవి, కొండలు ఉన్నాయి. అందుకే, భద్రత మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అటవీ అధికారులు తెలిపారు.

Read More Medaram I జన జాతర మేడారం.. పట్నం వాసుల యాతన నరకం...

ఇష్టకామేశ్వరి ఆలయం, శ్రీశైలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది అమ్మవారికి అంకితం చేయబడిన ఆలయం. భక్తులు ఇక్కడ కు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తీరుతాయని నమ్ముతారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా.. తాత్కాలికంగా సందర్శన నిలిపివేయబడిందని శ్రీశైలం ఫారెస్ట్​ రేంజ్​ అధికారులు తెలిపారు.

Read More ఎంజెపి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

Views: 4

Related Posts