Medaram I జన జాతర మేడారం.. పట్నం వాసుల యాతన నరకం...

నిజమే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అంచనాలతో సమ్మక్క సారక్క జాతరకు నడుం బిగించి దాదాపు వేల సంఖ్యలో బస్సులను అక్కడికి పంపించింది.

Medaram I జన జాతర మేడారం.. పట్నం వాసుల యాతన నరకం...

జయభేరి, హైదరాబాద్ :

నిజమే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అంచనాలతో సమ్మక్క సారక్క జాతరకు నడుం బిగించి దాదాపు వేల సంఖ్యలో బస్సులను అక్కడికి పంపించింది. విషయంపై 'జయభేరి' కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సంధిస్తున్న అక్షర యజ్ఞం...

Read More కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు

తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దేవి దేవతల జాతరలు అట్టహాసంగా కొనసాగుతాయి. రాష్ట్రం సాధించుకున్న తర్వాత బోనాలు బతుకమ్మ ఇలా సమ్మక్క సారక్క జాతర కొన్ని రాష్ట్ర పండుగలుగా గుర్తించి వాటికి తగిన ప్రోత్సాహం కల్పించింది. కానీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకు ఈ పండుగ మేడారం జాతర రావడం భారీ అంచనాలతో ప్రభుత్వం వాటికి సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడం నగరవాసులకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తుంది. హైదరాబాదు నగరంలో విద్యార్థులు కాలేజీలు పాఠశాలలకు వెళ్లే బడి పిల్లలకు పనులకు వెళ్లే మహిళలకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంది.. పండుగను ఎవరు వద్దనలేదు కానీ పట్టణంలో రెగ్యులర్ గా తిరిగే బస్సులను కూడా పండుగ కోసం ప్రత్యేక బస్సులుగా నిర్ణయించడంపై జనాలు ఆవేశాన్ని వెలగకుతున్నారు..
మేడారం జాతరను చూడడానికి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్త జన సందోహం జనసంద్రంగా మారుతుంది.సమ్మక్క సారక్కకు బంగారాన్ని సమర్పిస్తున్న భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేసుకొని పూర్తిగా అమ్మవార్లను యాది పెట్టుకుని పునీతులు అవుతున్నారు.

Read More వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ప్రజల కనీస అవసరాలు పట్టించుకోని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఘాటు విమర్శలు చేస్తున్నాయి.. వైపు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాల్లో 13 సంక్షేమ పథకాలను కచ్చితంగా 100 రోజుల్లో అమలు చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు నత్తనడక నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిజం వాస్తవానికి మాట్లాడుకుంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ రేవంత్ రెడ్డి కార్యవర్గం గత ప్రభుత్వం అవినీతి అక్రమాలు కబ్జాలు ప్రాజెక్టుపై జరిగిన అవినీతిని కక్కిస్తాం అని శాసనసభ సాక్షిగా అటు అధికారం రాకముందు జనాల్లో శపథం చేసిన వాటిపై దూకుడుగా వ్యవహరిస్తూ ఇప్పుడు మేడారం జాతరకు తెలంగాణ బస్సులను జాతరకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం పై మహిళా శిరోమణులు ఆవేశంతో నానాశాపనార్ధాలు పెడుతున్నారు.

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

74 (2)

Read More ధరణితో పరిష్కారం కానీ సమస్యలు భూ భారతి తో చెక్...

అసలే ఆరు గ్యారెంటీ ల పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న బస్సులను మొత్తం తీసేసి మేడారం జాతరకు పెట్టడం వల్ల మహిళ శిరోమణులు చేసిన మేలును మర్చిపోయి ఇదేం ప్రభుత్వం అనే విమర్శల కు గొంతేత్తుతున్నారు. అసలే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ వ్యవస్థను చిన్నభిన్నం చేసిన కేసీఆర్ పాలన గాడిలో పెట్టాల్సింది పోయి తెలంగాణ ప్రజలను రవాణా సౌకర్యం అంతంతగా ఉన్న ఆర్టీసీ బస్సులను పూర్తిగా మేడారం జాతరకు తరలించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. జాతరను గొప్పగా చేస్తున్న ప్రభుత్వం మరి వాటికి రవాణా సౌకర్యం కోసం కనీసం ప్రైవేటు వెహికల్స్ నైనా ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు... కోపం వచ్చినా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఆర్టీసీ బస్సులపై చూపించడం ఆనవాయితుగా వస్తున్న ఆచారం. అదే ఆశరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తోందా?

Read More డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక సందు దొరికితే శాపనార్ధాలు పెడదాం అన్నట్టుగా చూస్తున్న ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజల్లో కొంత అసహనాన్ని రేకెత్తించేలా చేస్తున్నాయి... పండగ సరే మరి ప్రజల కష్టాలను ఎవరు పట్టించుకుంటారు అన్న ప్రశ్నలు బాహాటంగానే వెలువెత్తుతున్నాయి... ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరూ పునరాలోచించుకొని జాతరలో అమ్మవారికి కేటాయించిన బస్సులను నడిపిస్తూనే పట్నంలో మహిళా శిరోమణులకు రవాణాకు ఇబ్బందిగా కలిగిస్తున్న అసౌకర్యాన్ని గుర్తించి వెంటనే బస్సులను వెనక్కి పంపాలని కోరుతున్నారు... భక్తి ఉండాలి కానీ మరీ ఇంత మొక్కుబడిగా మూకుమ్మడిగా ఉన్న బస్సులను అక్కడికి తరలించడం నగరవాసులను ఇబ్బందికి గురి చేస్తున్నాయి... మంత్రి సీతక్క పరిపాలన పూర్తిగా పక్కనపెట్టి మేడారం జాతరలోనే కాలాన్ని గడుపుతూ తన బాధ్యతను మరిచిపోయిందా అన్నట్టుగా సీతక పాలన కొనసాగుతుందని ప్రతిపక్షాలు నోలెత్తుకుంటూ ఘాటు విమర్శలు చేస్తున్నాయి...

Read More అత్తాపూర్ లో జరిగిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు  

ఏది ఏమైనా పెత్తనంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధులను సక్రమంగా నిర్వహించాలి కానీ ఒకే మూస ధోరణితో ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో ఘాటు విమర్శలకు వాళ్లే అవకాశం కలిగించినట్టు అవుతుంది.. అందుకే అంటారు ఎగిరి ఒక పండు అందుకున్న పోతే నాలుగు రాళ్లు మీద పడ్డట్టుగా అని... సంక్షేమ అభివృద్ధి అవినీతి అక్రమాలు వీటన్నింటిని రేసుగుర్రంలో పరిగెడుతూ చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమాన్ని కాస్త పట్టించుకోవయ్యా అంటున్నారు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీగా బస్సుల్లో తిరుగుతున్న మహిళ శిరోమణులకు వారి ప్రయాణానికి ఇబ్బందికి నిరసనగా విమర్శలు మొదలవుతున్నాయి... మేడారం జాతర అందరమూ వెళ్లి చూసేద్దాం. కానీ నగరవాసుల ప్రయాణానికి నరకయాతనంగా మారుతుంది సారు అంటూ పిన్నపాలు ముఖ్యమంత్రికి చేరేలా చేయాలని మహిళా శిరోమణులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు... ఏ ఒక్కరిని కదిలించిన ఏం చేయమంటారు మేడారం జాతరకు బస్సులన్నీ పంపించాడంట సీఎం అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు...

Read More జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్

...కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత

Read More హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli

Social Links

Post Comment