Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?
దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు అందివ్వడం ఇది విప్లవాత్మకమైన ప్రక్రియగా అభివర్ణించవచ్చు.
జయభేరి, హైదరాబాద్ :
దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు అందివ్వడం ఇది విప్లవాత్మకమైన ప్రక్రియగా అభివర్ణించవచ్చు. నిజానికి భారతదేశంలోనే కాదు ఏ దేశంలో కూడా ప్రజా ఆరోగ్య సంరక్షణకు సంబంధించి డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు లేవు. కేవలం యూరప్ లోని ఎస్టోనియా దేశంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నం జరిగింది. నార్త్ యూరప్ లో ఉన్న ఈ చిన్న దేశం ప్రజా రక్షణ ఆరోగ్య వ్యవస్థ ప్రజా ఆరోగ్య పెరుగుదల కోసం అన్ని దేశాల కంటే ఈ దేశంలో 99 శాతం మంది ప్రజలకు డిజిటల్ ఆరోగ్య కార్డులు అందించి అనారోగ్య సమస్యను పూర్తిగా తుడిచివేసింది. తాజాగా ఇప్పుడు మన భారతదేశంలో మన రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిటల్ ఆరోగ్య సమాచార తక్షణమే అందివ్వాలని అందుకు తగిన ప్రొఫైల్ ని కూడా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిజిటల్ ఆరోగ్య సమాచార ఐడి కార్డులు త్వరలో రానున్నాయి.
డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు ఇవి ఎలా పనిచేస్తాయి?
డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు ప్రజలకు అందివ్వడం ద్వారా రోగి యొక్క పూర్తి సమాచారం అందులో నిక్షిప్తింపబడి ఉంటుంది. అంతేకాకుండా గతంలో ఆ రోగికి ఎలాంటి జబ్బు చేసింది అప్పుడు ఏ మందులు వాడారు దానివల్ల ఆరోగ్యం ఎంత మెరుగుపడింది అనేటువంటి పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా దాచిపెడుతోంది. డిజిటల్ ఆరోగ్య సమాచార ఐడీ కార్డులో ఇలా రోగి వ్యక్తి యొక్క పూర్తి సమాచారం ఉండడంవల్ల, సమయం ఆదా అవుతూ ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. వ్యక్తి యొక్క ఆరోగ్య సమాచారం పాలసీని మెరుగుపరచడం ఒక కుటుంబం యొక్క ఆర్థిక బడ్జెట్ను అంచనా వేసుకునేలా ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే విధంగా డిజిటల్ ఆరోగ్య సమాచార ఐడి కార్డులు పనిచేస్తాయి...
సమాజంలో అనేకమంది ప్రజలు రకరకాల జబ్బులతో బాధపడుతూ మందులు వాడి మెరుగుపడుతుంటారు. కానీ ఆరోగ్యం ఎప్పుడూ ఉన్నట్టు ఉండదు కదా అందుకని ఒక పాలసీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా గతంలో రోగి ఏవేవి ఎక్కువగా మందులు వాడాడు ఎలాంటి చికిత్స తీసుకున్నాడు అనే వివరాలు అందులో ఉండడం వల్ల వెంటనే సరైన వైద్యం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి ఏ ప్రభుత్వాలు ఆలోచించనంతగా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం ఇది ముమ్మాటికి అర్షదగ్గనీయమని చెప్పాలి. దేశంలో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ సంజీవిని ఆయుష్మాన్ భారత్ ఇలా ఎన్ని ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటి విధి విధానాల్లో కొంత జాప్యం జరిగి తక్కువ శాతం మేర ప్రజలకు ఆరోగ్యం వ్యవస్థ పని చేయడం వల్ల ఇంకా ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచే అవసరం ఏర్పడుతుంది.
నిజానికి క్షేత్రస్థాయి ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ మెరుగు పరచడానికి మూడంచెల ఆరోగ్య వ్యవస్థ ఉంటుంది. మొదటిదిగా బేస్ లెవెల్లో పిఎస్సి సిఎస్సి లు ప్రాథమికంగా కిందిస్థాయిలో పనిచేస్తారు.రెండవదిగా సెకండరీ హెల్త్ సి హెచ్ సి ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ నర్సింగ్ క్లినిక్స్ జిల్లాస్థాయి హాస్పటల్ సిబ్బంది పనిచేస్తాయి.. ఇక మూడవదిగా మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు ప్రభుత్వ వాటితో పాటు ప్రైవేటు రంగా హాస్పిటల్స్ మల్టీ నేషనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పనిచేస్తాయి. ఇలా మూడంచెల ఆరోగ్య వ్యవస్థ పని చేసే ఈ క్రమంలో నూటికి 66% ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పైనే ఈ ప్రభుత్వాలు దృష్టి సారించాలి...
ఉదాహరణకు తమిళనాడు, కేరళలో పి.హెచ్.సి వ్యవస్థ నిర్మాణాత్మకంగా పనిచేస్తూ కింది లెవెల్ లో ఉన్న పీఎస్సీలు సిహెచ్సిలు నర్సింగ్ క్లినిక్ జిల్లాస్థాయి హాస్పటల్లో మెరుగైన వైద్యం 24 గంటలు అందివ్వడం వల్ల అక్కడ రోగుల సంఖ్య కొంత తగ్గినట్టుగా సమాచారం... అందుకని ప్రాథమిక ప్రజారోగ్య వ్యవస్థ మెరుగుపడాలంటే మండల స్థాయిలో వైద్యుల కొరత ఉండకూడదు. పగలు సమయాల్లోనే కాకుండా రాత్రి వేళల్లో కూడా వైద్యం అందించడానికి 24 గంటలు డాక్టర్స్ కిందిస్థాయి ఆసుపత్రి సిబ్బంది ఫార్మా మెడికల్స్ డాక్టర్లు ఎక్కువగా పని చేయాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు గా ఎన్నికైన వాళ్ళు రూరల్ ప్రాంతాల్లో పనిచేయడానికి అంతగా సుముఖతతో లేరు. ఎందుకంటే పట్టణాల్లో నగరాల్లో ఎక్కువ ధనార్జనకు అలవాటు పడిపోయి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థ పై అంత దృష్టి కేంద్రీకరించడం లేదు. నిజానికి మన రాష్ట్రంలో 70 శాతం జనాభా కి 80 శాతం మంది డాక్టర్లు ఉండాలి. ఇది డబ్ల్యూహెచ్వో నిర్ణయం ప్రకారం ప్రతి 70 మందికి 80 మంది డాక్టర్లు ఉండాలి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు.
నిజానికి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే గతంలో కోవిడ్ వచ్చిన సమయంలో ప్రపంచం మొత్తం కోవిడ్ తో అతలాకుతలం అయిపోయింది. ఈ నేపథ్యంలో మన దేశంలో మన రాష్ట్రంలో కూడా కోవిడ్ సమస్య ఎక్కువగా వచ్చిన సందర్భంలో ఆరు నుంచి తొమ్మిది నెలలు ఎక్కువగా ప్రజలు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో మెడిసిన్ తీసుకున్నారు. అంటే దాదాపు 80 నుంచి 90 శాతం వరకు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యాన్ని అందించాయి... ఈ క్రమంలో ప్రవేటు ఆసుపత్రులు కూడా బాగానే పని చేశాయి.. కాబట్టి మన రాష్ట్రంలో డాక్టర్ల కొరత లేదని చెప్పాలి. ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి ముందుగా ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యశాఖలో కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆక్సిజన్ సమస్య, డాక్టర్లు, నర్సుల కొరత ఐసీయూ బెడ్ల సంఖ్య ఎక్కువగా లేకపోవడం, తాత్కాలికమైన బడ్జెట్ను పెడుతుండడం వల్ల ఆరోగ్య శాఖలో సరిగ్గా పనిచేసేందుకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్షన్స్ లేకపోవడం లోటుగా చెప్పుకోవచ్చు. బడ్జెట్ ఆరోగ్య వ్యవస్థ పై పెట్టే విషయంలో కేంద్ర స్థాయిలో 1.2 శాతం జిడిపిలో ఆరోగ్య శాఖకు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో రెండు శాతం ఆరోగ్య శాఖ పై బడ్జెట్ను కేటాయించారు కానీ ఇప్పుడు నాలుగు శాతానికి మన రాష్ట్రంలో బడ్జెట్ పై నిర్ణయం తీసుకున్నారు. మనదేశంలోనే పాండిచ్చేరి ఢిల్లీ ఆయా రాష్ట్రాల్లో 80 శాతం పైనే బడ్జెట్ను కేటాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఆయుష్మాన్ భారత్కు 600 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్న అంటే దాదాపు 66% నిధులు వినియోగిస్తున్న సరైన వినియోగం కావట్లేదు. మనదేశంలోనే కాకుండా శ్రీలంకలోని అలాగే కేరళ రువ్వండ ఆయా రాష్ట్రాల్లో దేశాల్లో ఆదర్శంగా ఆరోగ్య వ్యవస్థ ప్రజా ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తున్నాయి. నిజానికి భారతదేశంలో బడ్జెట్ను పెట్టిన అంతా మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానంపై వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన విద్యా ప్రమాణాలు పెంచుతూ ప్రజా ఆరోగ్యం పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా ఆయా మాధ్యమాల ద్వారా ప్రజలకు ఆలోచన కల్పించాలి..
జనాభాలను ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అనగా ప్రతి వంద మందికి ఒక డాక్టర్ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం మనదేశంలో ఆయుష్మాన్ భారత్ స్కీం పథకంలో ఎనిమిది వందల మందికి ఒక డాక్టరు ఉన్నారు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా గల తెలంగాణ రాష్ట్రంలో 40 వేల మంది డాక్టర్స్ ఉన్నారు.. ఇంకా రాబోయే కాలంలో ఎక్కువ మంది డాక్టర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాదాపు లక్ష 25 వేల మంది ప్రతి సంవత్సరం డాక్టర్లుగా తయారవుతున్నారు.. ఎందుకంటే ఇక్కడ బోధన సిబ్బంది క్వాలిటీ ప్రజా ఆరోగ్య వ్యవస్థ పై అవగాహన నేటి విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది అది కారణంగా చెప్పవచ్చు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి థైరాయిడ్ సమస్యలు అటు పట్టణాల్లో రూరల్ లో ఎక్కువ మంది ప్రజలకు వచ్చే అవకాశం ఉంది అలాగే మలేరియా ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో 50 శాతం వరకు ప్రజలు ఈ వ్యాధులతో బాధపడుతూ 90 శాతం మెడిసిన్ వాడుతున్నారని ఎన్హెచ్ఎం పిహెచ్ఎస్సి లెక్కల ప్రకారం తేల్చేసింది... అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. బస్తీ దవాఖానాల పేరుతో ఉపయోగకరంగా అర్బన్ ఏరియాలలో ప్రజా ఆరోగ్య వ్యవస్థపై దృష్టి సాధించడం వల్ల ప్రాథమిక దశలోనే ప్రజా ఆరోగ్యం నిలకడగా ఉంది. బస్తీ దవాఖానాల ద్వారా చాలామంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. అందుకని ఎప్పుడైనా సరే ప్రజా ఆరోగ్య రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో అక్కడి ప్రజలకు పూర్తిగా అవగాహన పెంచి సరైన మందులు అందిస్తూ 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణ ఉంటే కింది స్థాయి నుంచి ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచినట్లయితే క్షేత్రస్థాయిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచే విధంగా డిజిటల్ ఆరోగ్య సమాచార ఐడి కార్డులను అందివ్వాలని అందుకు తగిన ప్రొఫైల్ ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఇవే డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు అందిస్తే రాబోయే తెలంగాణలో ఆరోగ్య తెలంగాణగా మనం చూడవచ్చు....
...- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, కవి, సీనియర్ రాజకీయ విశ్లేషకులు
9848 962 799
Post Comment