Congress I వ్యవస్థీకృత విధ్వంసం ప్రజా పాలన కొనసాగేదెలా...!?

ప్రజలకు 6 గ్యారంటీల హామీ ఒక్కొక్కటిగా ప్రజలకు అందించేలాగా కసరత్తు కూడా మొదలుపెట్టింది. అయితే ఆరు హామీల గ్యారెంటీ పథకం అమలు జరిగేనా? వాటిలో ఉన్న సవాళ్లు? ప్రతి సవాళ్లు? లోటుపాట్లు? వ్యవస్థీకృత విధ్వంసం ? పర్యవసానం ఏంటి?

Congress I వ్యవస్థీకృత విధ్వంసం ప్రజా పాలన కొనసాగేదెలా...!?

జయభేరి, హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు 6 గ్యారంటీల హామీ ఒక్కొక్కటిగా ప్రజలకు అందించేలాగా కసరత్తు కూడా మొదలుపెట్టింది. అయితే ఆరు హామీల గ్యారెంటీ పథకం అమలు జరిగేనా? వాటిలో ఉన్న సవాళ్లు? ప్రతి సవాళ్లు? లోటుపాట్లు? వ్యవస్థీకృత విధ్వంసం ? పర్యవసానం ఏంటి? అనే విషయంపై జయభేరి కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర రాజకీయ విశ్లేషణ….

Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుగా చెప్పినట్టుగానే ఆరు హామీల గ్యారెంటీ పథకాలని అమలు చేసేందుకు తొలి ప్రాధాన్యతనిస్తూ ప్రజాపాలనకు తెరతీసింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది నేపథ్యంలో ప్రజా పాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తులు కోటి 20 లక్షలు .ప్రభుత్వం చెబుతున్న లెక్కల పట్టి ఒకసారి ఆలోచిస్తే కోటి 20 లక్షల దరఖాస్తులకు నాలుగున్నర కోట్ల సమస్యలు ప్రజలు ప్రజా పాలన పత్రంలో టిక్ మార్క్ పెట్టి అప్లై చేశారనే విషయం తేట తెల్లమైంది. ప్రజా పాలనలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని అధికారంలోకి వచ్చిన రెండవ రోజు నుంచి మొదలు పెట్టింది.

Read More Telangan I ఏదీ రాజ్యాంగ స్ఫూర్తి.. సందేహమా? సవాళ్ల?

ఇక గృహ అవసరాల కోసం విద్యుత్తు 200 యూనిట్లు వాడుకున్న వారికి ఉచిత విద్యుత్ అందించే లాగున పథకాలు సిద్ధం చేసి త్వరలోనే అమలు చేస్తామని శాసనసభలు చెప్పడం అలాగే గ్యాస్ సిలిండర్ గృహ అవసరాలకు సంబంధించి 500 రూపాయలకు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నాలుగు పథకాలు అమలు చేస్తున్న మిగతా పథకాలను ఎలా చేయాలనే విషయంపై దర్శన పరిచిన పడుతూ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో కుల గణనపై ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రాజెక్టులపై శ్వేత పత్రాన్ని కూడా విడుదల చేసింది.

Read More GHMC I శివ శివ.. హర హర...

ఇక ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అనుకున్న ప్రభుత్వం ప్రజా పాలనలో వచ్చిన కోటి 20 లక్షల దరఖాస్తులను స్కూటీ దాదాపు ఆ ప్రక్రియ పూర్తి కావస్తుంది. ప్రజా పాలనలో సొంత ఇంటి కోసం దాదాపు 81 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆసరా పింఛన్కు 90 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఇలా ప్రజా పాలనలో ఎక్కువమంది తెల్ల రేషన్ కార్డు కోసం పింఛన్ కోసం గ్యాస్ కోసం మహిళలకు ఇచ్చే 2500 కోసం దాదాపు నాలుగున్నర కోట్ల మంది అర్జీ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.

Read More Media I అమ్ముడుపోతున్న అక్షరం విలువలు కోల్పోతున్న జర్నలిజం...

ప్రధానంగా ప్రతి గ్యారెంటీ పథకానికి తెల్ల రేషన్ కార్డును ముడి పెట్టడం ఇప్పుడు సమస్యగా మారుతుంది. మేడ్చల్ జిల్లాలో తెల్ల రేషన్ కార్డు కోసం రెండు లక్షల 27 వేల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ఇంతమంది తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం గత ప్రభుత్వం చేసిన వ్యవస్థీకృత అపరాధ మే.. ఇప్పటికే రేషన్ కార్డు అర్జీ చేసుకున్న వారికి 500 సబ్సిడీ గ్యాస్ ఎలా అందివ్వాలని విషయంపై ఎంక్వయిరీలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఆసరా పింఛన్ కోసం ప్రజా పాలనలో ఒక కోటి మంది దరఖాస్తు పెట్టుకున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్లు కొంతమందికి తీసేసిన రేషన్ కార్డులు కూడా కొంతమందికి తీసేసి పదేళ్లపాటు ఒక్క రేషన్ కార్డులు కూడా అందివ్వలేదు గత కెసిఆర్ ప్రభుత్వం. అందుకనే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పై కోటి ఆశలు పెట్టుకున్నా ప్రజలు ఒక ఇంట్లో పింఛన్ వస్తున్న మరొకరు కూడా కావాలంటూ మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తా అన్నది కదా అనుకొని చాలామంది ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిన వాళ్లు కూడా మళ్లీ ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు దరఖాస్తు చేసుకోవడం సమస్యగా మారుతుంది. ఇదే కాకుండా ఈ పదేళ్లలో అనేక కుటుంబాలు విడిపోయి వేరొక కుటుంబాలుగా ఏర్పడడం దాని ద్వారా వారికి తెల రేషన్ కార్డులు గ్యాస్ కనెక్షన్లు పెరిగిపోవడం సర్వసాధారణమైపోయింది. ఈ దశలో గత 15లలో ప్రజలకు రేషన్ కార్డు అందివని ప్రభుత్వం పూర్తిగా రెవెన్యూ వ్యవస్థను నీరుగార్చింది. దీని ద్వారా ప్రజలకు ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ఏవైనా సరే కింది స్థాయి వరకు అందాలి అంటే ఆయా మండలాల్లో గ్రామాల్లో రెవిన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. వీఆర్వో వీఆర్ఏ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎమ్మార్వో ఇలా స్థాయిని బట్టి అధికారులు ఎవరి పని వారు చేస్తే సంక్షేమ ఫలాలు అర్హతను బట్టి వారికి అందించే వీలు వెలుసుబాటు కలుగుతోంది. కానీ కెసిఆర్ ప్రభుత్వంలో పూర్తిగా రెవిన్యూ వ్యవస్థీకృత విధ్వంసం అయిందని చెప్పక తప్పదు.

Read More Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?

ఇక కుటుంబ అవసరాల కోసం గ్యాస్ కనెక్షన్లు 500 కు సబ్సిడీ ఇస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ ఎంక్వయిరీ పూర్తిస్థాయిలో ఇంకా కొనసాగడం లేదు. గృహలక్ష్మి పథకాలు కూడా ఇంకా ఎంక్వయిరీ జరుగుతూనే ఉంది. రైతు భరోసా ఇలాంటి సంక్షేమ పథకాలు ఎలా అంది ఇవ్వాలని విషయంపై తర్జన బర్జనలు జరుగుతూనే ఉన్నాయి.. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకానికి తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం చేయడం ద్వారా ఇవి చాలా తలనొప్పులుగా మారుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వంలో 91 లక్షల మందికి రేషన్ కార్డు 35 వేల మందికి పనికి ఆహార పథకం కార్డు లభించినట్టుగా లెక్కలు చెబుతున్న గత ప్రభుత్వంలో 19 తెల్లరేషన్ కార్డులను తీసేయడం ఇప్పుడు సమస్యగా మారుతుంది. 2016లో ఈ రేషన్ కార్డులను తీసేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అదే 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులకు పెంచుతూ రేషన్ కార్డును ప్రామాణికంగా చేసుకొని సంక్షేమ పథకాలను అందించింది. కానీ 2014 నుంచి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా రేషన్ కార్డులను తీసివేయడమే కాకుండా నూతనంగా ఎవరికి రేషన్ కార్డులను అందివ్వలేదు అలాగే రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేసింది.

Read More Nagaaram Municipality I ఖల్ నాయక్.. కౌన్ ఆతా బై... అనే దేవ్ దే.. ఖేంగే...

ఇక ఆసరా పథకానికి పెన్షన్స్కు అందివ్వడానికి 65 సంవత్సరాలకు వయస్సు పరిమితిని పెంచుతూ దానికి రేషన్ కార్డును ప్రామాణికంగా చేయడం ఇప్పుడు సమస్యాత్మకంగా మారుతుంది. పెన్షన్ ఇవ్వడానికి ఒక్కొక్క కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా పనిచేసినప్పుడే ఆ కుటుంబాల్లో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సమృద్ధిగా అందుతాయి. రెవెన్యూ శాఖ ఆదాయాల్ని ధ్రువీకరించకుండా ఇది సాధ్యం కాదు. ఇప్పటివరకు రెవెన్యూ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల పది లక్షల వరకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పెండింగ్లో ఉంది. ఇక ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద స్వాము లాంటిదే ఈ పథకాల అమలు చేయడం అంటే.. నిజానికి మన బడ్జెట్ ఆరు గ్యారెంటీలు అమలు చేసుకోవాలంటే 60 వేల కోట్లు అవసరం అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి సీఎం ప్రవేశపెట్టిన బడ్జెట్ 53000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే మిగతా సొమ్మును ఎలా రాబట్టుకుంటారు ఏ విధంగా 6 గ్యారంటీ హామీ పథకాలను ప్రజలకు అందిస్తారు అనేది రానున్న రోజులు ప్రభుత్వం ప్రజలు కలిసి ఆదాయ మార్గాలను అన్వేషించాలి.

Read More Telangana I పార్లమెంట్ ఎన్నికల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి

నిజానికి రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా పని చేసినప్పుడే గ్రామంలో అర్హులు అనర్హులుగా గుర్తిస్తూ తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి ఆసరా పెన్షన్ ఇవ్వడానికి ప్రతి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందివ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ గత పది ఏళ్లలో పూర్తిగా రెవిన్యూ వ్యవస్థ అన్ని వ్యవస్థలు విధ్వంసం అయ్యాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రతి గ్రామీణ పల్లె పట్టణ నగర జీవన విధానాల్లో జీవన ప్రమాణాలు ఆర్థిక భారంతో ముడి పడిపోతున్న ఈ నవీన నాగరికత సమాజంలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అభివృద్ధి అందరికీ అందాలి అని అనుకుంటే ప్రతి మండలంలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలి. అలాగే అర్హులు అనర్హులు ఎవరో మనకి మనమే ఆలోచించుకొని మనకంటే పేదవారికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రజల సహాయ సహకారాలు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలి. అలా నిజాయితీ నిబద్ధతతో ప్రభుత్వం ప్రజలు పనిచేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అట్టడుగు స్థాయిన ఉండే పేదరికంతో బాధపడుతున్న ప్రజలందరికీ అంది వారు వారి కుటుంబాలు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి... మొత్తానికి ఆరు హామీల పథకాన్ని అమలు చేయాలి అంటే నిధులు సమకూర్చుకొని వ్యవస్థీకృత విధ్వంసాన్ని అధిగమించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేస్తూ రెండు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తూ మరో రెండు పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు విజ్ఞత కలిగిన విజ్ఞానవంతులు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తేనే బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు ప్రభుత్వం కల్పించే అవకాశాలు అంది ప్రజల ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేరుతాయి….

Read More Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

...కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత

Read More Telangan Sand I తెలంగాణ చరిత్ర, జాతి, ఎన్నటికీ క్షమించదు... ప్రకృతి సంపదను కొల్లగొట్టిన గత ప్రభుత్వపు పాలన...

Views: 0