Telangana I పేట ఎవరి సొంతం..!?
అభివృద్ధి సరే మరి ఆరోపణలు..!?
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నల్లగొండ ఉమ్మడి జిల్లా లో నియోజకవర్గాలుగా మారిపోయిన తర్వాత సూర్యాపేట జిల్లా ఇప్పుడు ప్రధానంగా వార్తలోకెక్కుతోంది...
సూర్యాపేట ఎవరి సొంతం కాబోతుంది అనే అంశం విభిన్న రకాలుగా ప్రజల్లో నుంచి వాదోపవాదనలు వినబడుతున్నాయి... వాస్తవానికి 2014, 2018లో విజయం సాధించిన మంత్రి జగదీశ్ రెడ్డి ఈసారి విజయం సాధించిన అంటే అనుమానాలు నల్లమబ్బుల్లా అడ్డొస్తున్నాయి... ఇంతకీ అసలు సూర్యపేట రాజకీయం ఈసారి ఎలా ఉండబోతుంది అనే విషయంపై జయభేరి చేసిన సర్వేపై కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సంధిస్తున్న అక్షరాస్త్రం....
నిజానికి పది సంవత్సరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పెదగా పట్టణ అభివృద్ధి ఏమి చేయలేదు కానీ 2014 నుండి 2018 నుంచి ఇప్పటివరకు మంత్రి జగదీశ్ రెడ్డి కాస్తు కూస్తో సూర్యాపేట పట్టణ నగరాభివృద్ధికి జీవం పోశారు... అసలైన కథ ఇప్పుడే మొదలుకానుంది 2023 ఎన్నికల్లో మరి ఒకవైపు తన అనుచరుడుగా ఉన్న ఒట్టే జానయ్య బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం అసలు మింగుడు పడడం లేదు... ఎందుకంటే తన బక్కలో బల్లెం లాగా ఎదిగిన వట్టే జానయ్యను మంత్రి జగదీశ్వర్ రెడ్డి ససేమిరా గెలవనీయుడు.. గెలవకుండా ఏమైనా చేయగలడు ఏదైనా చేసుకోగలరు.. ఇక సూర్యపేట నియోజకవర్గంలో సూర్యపేట పట్టణం కలిపి నాలుగు మండలాలు ఆత్మకూరు పెన్బహాడు చివ్వెంల సూర్యాపేట మొత్తానికి ఏ మండలానికి ఆ మండలం నీకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బిజెపికి అటు బిఆర్ఎస్ అధికార ప్రభుత్వానికి బలాలు సమానంగానే కనిపిస్తున్నాయి. మరి అసలు సమస్య ఎక్కడుంది అనేది ఇప్పుడు మనం కావాల్సింది...
నిజానికి సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యపేట మున్సిపల్ ఓట్లు దాదాపు 70 వేలకు పైగా ఉంటాయి ఇక్కడ కౌన్సిలర్లు వైశ్య జాతికి చెందిన ఒకరిద్దరూ రాజకీయాల్లో ఉన్నప్పటికీ పెద్దగా వైశ్య జాతి జనాభా రాజకీయాలలో లేరు. అలా అని రాజకీయాలను పట్టించుకోరు అంటే అది పెద్ద పొరపాటే.. నిజానికి సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిని గెలుపు ఓటమిలో ఉంచాలంటే కేవలం మునిసిపల్ ఓట్లే కీలకంగా మారనున్నాయి... ఇప్పుడు ఇవి ఓట్లు మంత్రి జగదీశ్రెడ్డిని ఆందోళనకు గురిచేస్తున్నాయి... ఎందుకంటే 2014 నుంచి 2018, 2023 వరకు అంటే ఇప్పటివరకు మునిసిపల్ లో ఎలాంటి అభివృద్ధి కాంట్రాక్టు పని అయినా సరే మునిసిపల్ కమిషనర్ మంత్రి గారి పై చేయి ఉంటుందనేది అక్కడి కౌన్సిలర్ల ఆరోపణ... కౌన్సిలర్లు మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేగా రాకముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ముక్కు పిండి వాళ్లను వసూలు చేశారట అందుకనే కాంగ్రెస్ను కావాలని 2014 2018లో సూర్యాపేట మున్సిపల్ ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చేసగలిగాయి..
ఇక ఇప్పుడు అదే మునిసిపల్ ఓట్లు ఎటు పడతాయని ఆలోచిస్తే కాంగ్రెస్ గత చరిత్రను తిరగేస్తే బాగోలేదు కాబట్టి ఇప్పుడు మంత్రి జగదీశ్ రెడ్డి వస్తే మళ్ళీ మునిసిపల్ కమిషనర్ మంత్రి జగదీశ్ రెడ్డి కలిపి వాళ్ళ ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుందనే ఒక గట్టి నమ్మకంతో కచ్చితంగా మంత్రి జగదీష్ రెడ్డిని ఓడించాలని దృఢ నిశ్చయాన్ని కలిగినట్టు మనకు రాజకీయ ప్రకంపనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మునిసిపల్ ఓట్లు 70 వేలకు పైగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వైశ్య జాతికి సంబంధించిన ఓట్లే కీలకంగా మారనున్నాయి..
మంత్రి జగదీష్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం ఒకవైపు ఉన్న ఆయన పై వస్తున్న ఆరోపణలు అంతేగాటుగా విమర్శలకు తావిస్తోంది.. మున్సిపల్ లో ప్రతి కాంట్రాక్టులు కమిషనర్ మంత్రికి సంబంధాలే ఉంటాయి తప్ప కౌన్సిలర్లకు మాత్రం ఒక్క రూపాయి కూడా అందకుండా వాళ్లే నోటికాడి కూడు గుంజుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు...
ఇది ఆరోపణ కాదు జగమెరిగిన సత్యం.. అందుకే ఈసారి ఎలాగైనా సరే జగదీశ్ రెడ్డి ని పక్కకు తప్పియాలని ఆలోచనలతో సూర్యాపేట మున్సిపల్ లో ఉన్న 70 వేల ఓట్లు తిరగబడే అవకాశం ఉందని తెలుస్తోంది... మొత్తానికి సూర్యాపేటలో ఒకవైపు కాంగ్రెస్ అరాచకాన్ని చూసిన ఇప్పుడు అధికార తెలంగాణ పార్టీ అరాచకాల్ని చూస్తున్నాం ఇక కొత్తవారికి అవకాశం ఇయ్యాలనే ఆలోచన సూర్యాపేట నియోజకవర్గ మండలాల్లో కనిపించడం లేదు కానీ మునిసిపల్ లో ఉన్న అధిక ఓట్ల జనాభా గల మున్సిపల్ ఓట్లు అభిప్రాయపడుతున్నాయట... ఎందుకంటే మునిసిపల్ కమిషనర్ మంత్రి వీరి ఇరువురు కలిసి చేస్తున్న కాంట్రాక్టు దక్కించుకున్న వీధి విధానాలకు కౌన్సిలర్లతో సహా అక్కడ ఉన్న ఓట్లు వేసే జనాలకు విసుగు పుట్టించిందట.. మున్సిపల్ కమిషనర్ మంత్రి గుత్తాధిపత్యానికి పూర్తిగా విసిగిపోయారట అక్కడి కౌన్సిలర్లు... అందుకే ఈసారి ఎలాగైనా శాసనసభ్యున్ని మార్చుకోవాల్సిందే అనే ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం...
సూర్యపేట పట్టణానికి సంబంధించి ఆత్మకూరు పెన్పహాడ్ చివ్వెంలా ఈ మండలాల్లో అన్ని పార్టీలకు సమాన బల బలాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థి నిర్ణయాన్ని నిర్ణయించే అధికారం సూర్యాపేట మున్సిపల్ లో ఉన్న ఓట్లకే ఎక్కువగా అవకాశం ఉంటుందనేది ఇక్కడి జనాల మాటలు అభిప్రాయాలు స్పష్టంగా వినపడుతున్నాయి...
చూద్దాం అభివృద్ధి సంక్షేమం మరొకమారు అధికార ప్రభుత్వాన్ని గెలిపిస్తుందా లేదంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలనను చూసి విసిగిపోయిన నియోజకవర్గ ప్రజలు పదేళ్లు అధికార ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను అవినీతి భూకబ్జాలను రూపుమాపేందుకు తిరగబడి నూతన శాసనసభ్యున్ని ఎన్నుకుంటారో అది అక్కడి ప్రజలే నిర్ణయించుకోవాలి మొత్తానికి చూస్తే మంత్రి జగదీష్ రెడ్డికి ఈసారి కష్టాలు తప్పవు అనేది మాత్రం స్పష్టంగా వినపడుతోంది.
... కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్
Post Comment