తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు

తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు

జయభేరి, దేవరకొండ : తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నాణ్యత ప్రమాణాలపై ఇచ్చే గుర్తింపు ప్రక్రియలో అనగా నేషనల్ అసెస్మెంట్  అక్రేడిటేషన్ కౌన్సిల్ (న్యాక్ ) బృందం రెండు రోజులు(27, 28)కళాశాలను సందర్శించారు.

ఈ న్యాక్ బృందం సందర్శనార్థం తర్వాత 6/2/25 రోజున ఫలితాలను విడుదల చేశారు. ఈ యొక్క ఫలితాలలో TGTWRDC  దేవరకొండ కళాశాలకు B++ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. న్యాక్ బృంద సందర్శన లో భాగంగా డిప్యూటీ సెక్రటరీ పద్మ మేడం, OSD డాక్టర్.నీరజ సిన్హామేడం, రీజనల్ కోఆర్డినేటర్ ఈ. బలరాం న్యాక్ బృంధంతో అకాడమిక్ నాన్ అకాడమిక్ తరగతిగదులను, డార్మెట్రి, ప్రయోగశాలల ను పరిశీలించడంతో పాటు కళాశాల విద్యార్థినుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Read More మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

దేవరకొండ ఎమ్మెల్యే బాల నాయక్ మాజీ ఎంపీటీసి కొర్రా రామ్ సింగ్ సహాయ సహకారాలను పొందడం జరిగింది. కళాశాలకు B++ గ్రేడ్ వచ్చిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం హరిప్రియ మేడం మాట్లాడుతూ మా కళాశాలకుB++ గ్రేడ్ రావడం మా అధ్యాపకులు విద్యార్థినిలు మరియు సిబ్బంది కృషి ఫలితం అన్నారు. ఈ గ్రేడు మా కళాశాలకు నాణ్యతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు ఈ గ్రేడ్ తో ఉత్సాహంతో ఉన్నారు.

Read More 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

ఈ గ్రేడింగ్ ప్రకారం మా కళాశాలకు అన్ని అంశాల్లో ప్రత్యేక ప్రాధాన్యత వస్తుంది.ఈ సందర్భంగా సెక్రటరీ కె. సీతాలక్ష్మి ఐఏఎస్ మేడం  మరియు రీజనల్ కోఆర్డినేటర్ ఈ. బలరాం, అడిషనల్ సెక్రటరీ పి. మాధవిమేడం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. హరిప్రియమేడం,ఐక్యుఎసి కోఆర్డినేటర్ జ్ఞానేశ్వరి  హర్షం  వ్యక్తం చేశారు.

Read More దేవరకొండ పట్టణ  పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక