సైదాపూర్‌లో సంక్షేమ పథకాల పండుగ మంత్రి పొన్నం ప్రభాకర్
కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండల కేంద్రంలో జూలై 19న ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. సైదాపూర్ విశాల పరపతి సహకార సంఘం హాల్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి, హుస్నాబాద్ శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్,పమేలాసత్పతిమార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంత సుధాకర్, వె ~ సైదాపూర్ సహకార సంఘం అధ్యక్షులు కొత్త తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ గుండారు శ్రీనివాస్ ఎంపీడీవో భూక్య యాదగిరి, ఎమ్మార్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, “ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలి,” అని సూచించారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు, బూతు ఏజెంట్లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.



