Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?
ఎన్నికల కోడ్ నిబంధనలు ఇప్పుడు సాధారణ జనాన్ని పీడిస్తున్నాయి.. నవంబర్ అక్టోబర్లో జరగాల్సిన పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి.. పాలకులు ప్రజలపైనే ఎలక్షన్ కోడ్ ప్రజలపై నే.. హత విధి... ‘జయభేరి’ కౌంటర్ విత్ కడారి కామెంట్
జయభేరి, హైదరాబాద్ : ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి తెలంగాణలో నోట్ల కట్టలు హద్దు అదుపు లేకుండా పోలీసులకు దొరికిపోతున్నాయి. 500 రూపాయల నోట్ల కట్టలు లెక్కలేనన్ని కోట్ల రూపాయల నగదును పట్టుకుంటున్న పోలీసులకు దిమ్మతిరిగిపోతుందనే చెప్పాలి... కేవలం ఎన్నికల్లో జనాలకు డబ్బులు పంచాలనే ఉద్దేశంతోనే ఈ డబ్బులు దొరుకుతున్నాయ!? లేక వేరే వేరే అవసరాల!? అనే అంశం ఎవరికి అర్థం కావట్లేదు. ఇక టూ వీలర్ పై కార్లలో తీసుకుపోయే డబ్బులకు సరైన ఆధార పత్రాల లేకుండా వెళ్లే వారికి షాక్ తగులుతుందీ.. మొత్తానికి కట్టలే కట్టలు నోట్ల కట్టలు భారీగా దొరికిపోతున్న, తీసుకు వెళ్ళే వారు తీసుకెళ్తూనే ఉన్నారు. ఎన్నికల కోడ్ పక్కగా నడుస్తుందా !? మరి అధికార పార్టీ వాళ్లు డబ్బులే తీసుకెళ్లట్లేదా!? అనే అనుమానాలకు తావిస్తోంది.
ఈ క్రమంలో భారీగా నగదు తో పాటు వెండి బంగారం కూడా పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు... ఇన్ని రోజులు ఈ నగదు ఎక్కడ ఏ మూలకు బస్తాలలో దాగుందో తెలియదు కానీ ఇప్పుడు నోట్ల కట్టలు కట్టలు కట్టలుగా బయటపడుతుంటే.. పాపం జనాలు చూసి ఏడవడం తప్ప అయ్యో మాకు లేకపోయే అన్న బాధ కూడా కలుగుతుందట... ఎన్నికల పుణ్యమాని దొరికిన డబ్బు అంతా ఎక్కడికి పోతుందో అని ఆలోచిస్తున్న ప్రజలకు సమాధానంగానే పోలీసులు ఐటి వాళ్లకి ఇస్తున్నామని చెప్తున్నారు.
అందుకే ఓ జనాలు జర జాగ్రత్తగుండండి..
మీరు నగదును పట్టుకెళ్లేటప్పుడు దానికి సంబంధించిన సరైన పత్రాలను చూపించి హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి అంటున్నారు పోలీసులు. నిజమే కదా ఎన్నికల కోడ్ అమలులో పక్కాగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలావరకు బంగారం వెండి దొరికినట్టుగా మనం చూస్తున్నాం. మొత్తానికి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు.
50 వేల కంటే ఎక్కువగా ఉంటే కచ్చితంగా దానిని పట్టుకొని విచారిస్తామని సరైన పత్రాలు ఉంటే వదిలేస్తామని లేకపోతే సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల పుణ్యమా అని భారీగా నగదు బంగారం వెండి దొరుకుతున్నాయి.
ఇక ఈ రెండు నెలల్లో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఆయా కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆడపిల్లకు పెళ్లిళ్లు చేయాలంటే జంకుతున్నారు. నగదు బంగారం దారి మధ్యలో పోలీసులు తనిఖీ చేసి పట్టుకుంటే పెళ్లి ఆగిపోతుందనే భయాన్ని తమనుండి పోగొట్టుకోలేకపోతున్నారు. వాస్తవానికి ఎన్నికల కమిషన ప్రజల అవసరాలకు కొంత వెలుసుబాటిస్తే బాగుంటుంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందుకే లగ్గం ఎట్లా చేయాలే అని ఆలోచిస్తూ ఈ ఎన్నికలు తొందరగా అయిపోతే బాగుండు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
...కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్