జయభేరి, తుర్కపల్లి, మే 20 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎంఈఓ వి .మాలతి అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలోని సెకండరీ గ్రేడ్ టీచర్లందరికీ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణకు మండల పరిధిలోని ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు హాజరైనారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రిసోర్స్ పర్సన్ గా అశోక్, శ్రీశైలం, సైదులు,, శ్రీధర్, భాస్కర్ రెడ్డి ,సంపత్ రెడ్డిలు వ్యవహరించారు. మొదటి రోజు శిక్షణ కార్యక్రమానికి జిల్లా పరిశీలకులుగా టి శ్రీహరి అయ్యంగార్ హాజరైనారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు