మాజీ మంత్రి స్వర్గీయ నాయిని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమం

  • నాయిని నరసింహారెడ్డి  కార్మిక హక్కుల పక్షపాతి
  • కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన నాయకుడు నాయిని నరసింహారెడ్డి
  • రాజకీయాల్లో ఆస్తులకంటే పేరు, గౌరవం సంపాదించిన అరుదైన నాయకుడు.
  • పార్టీ కోసం దశాబ్దాల పాటు సేవలు అందించిన నాయిని  కుటుంబానికి పార్టీ  అండగా ఉంటుంది
  • మాజీ మంత్రి స్వర్గీయ నాయిని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న  మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ 

మాజీ మంత్రి స్వర్గీయ నాయిని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమం

జయభేరి, దేవరకొండ :
దేవరకొండ నాయిని నరసింహారెడ్డి  కార్మిక హక్కుల పక్షపాతి అని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలో మాజీ మంత్రి స్వర్గీయ నాయిని నరసింహారెడ్డి జయంతి సందర్భంగా నాయిని నరసింహారెడ్డి చిత్ర పటానికి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ....కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన నాయకుడు నాయిని నరసింహారెడ్డి అని తెలిపారు. 

రాజకీయాల్లో ఆస్తులకంటే పేరు, గౌరవం సంపాదించిన అరుదైన నాయకుడు అని ఆయన అన్నారు. పార్టీ కోసం దశాబ్దాల పాటు సేవలు అందించిన నాయిని కుటుంబానికి పార్టీ  అండగా ఉంటుంది అని ఆయన తెలిపారు. రెండు దశాబ్దాల పాటు నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్ కి సోదరునిలా కలిసి పని చేశారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముక్కమల్ల బాలయ్య, బొడ్డుపల్లి కృష్ణ, అరెకంటి రాములు, పల్లా లోహిత్ రెడ్డి,మకాం చంద్రమౌళి, చాట్ల రాములు, రేపానీ ఇద్దయ్య, మాడెం రాములు, భారత్,పాతవత్ లక్ష్మణ్, పొట్ట మధు, జామీర్ బాబా, రిజ్వాన్, గండూరి లక్ష్మణ్, కొర్ర రాజేష్, మైనంపల్లి ప్రవీణ్, లెండాల లక్ష్మీకాంత్, వడ్థ్య గణేష్,కొర్ర జగదీష్, తదితరులు ఉన్నారు.

Read More ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

Latest News

జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి
జయభేరి, హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా, పెద్దధన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ దుష్ప్రభావాలపై వరస కథనాలను ప్రచురించిన జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఎం.ఎం.రహమాన్...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు
శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన
బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!
కుంట్లూర్ గ్రామంలో విషాదం