ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
జయభేరి, దేవరకొండ : దేవరకొండ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతుల సందర్భంగా క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగినది దాంట్లో భాగంగా స్థానిక దేవరకొండ ఎం కె ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ సుర్వి మణికంఠ పాల్గొని ఈ పోటీలను ప్రారంభించడం జరిగింది.
Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...

ఈ కార్యక్రమంలో ఎబివిపి ఉమ్మడి నల్గొండ హాస్టల్స్ కన్వీనర్ యలమల గోపీచంద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకూరి శ్రీకాంత్, లింగాల రాకేష్, దమోజు అమితేష్, సంతోష్, ఆసిఫ్, ఉమర్ ఫరూక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0


