కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు

కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు

జయభేరి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటిగా పటాపంచలు అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదిక డొల్ల అని ఎల్‌అండ్‌టీ తేల్చడంతో.. కేంద్రంలో బడే భాయ్ కూడా చేతులెత్తేశాడు. 

నిన్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముచ్చటగా మూడోసారి గత ప్రభుత్వ క్యాబినెట్‌ మినిట్స్‌ కావాలి అంటూ అడిగేసరికి కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు వాగిన కంపు నోర్లు ఇవ్వాళ కమిషన్ కు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా.. కాళేశ్వరమే తెలంగాణ కల్పతరువు.

Read More మాజీ మంత్రి స్వర్గీయ నాయిని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమం