School I శ్రీ చైతన్య పాఠశాలలొ వైజ్ఞానిక, సాంస్కృతిక,  క్రీడా ప్రదర్శన

హయత్ నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల బ్రాంచ్ లో ఈనెల 27, 29 తేదీల్లో విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీలు ఘనంగ జరిగాయి.

School I శ్రీ చైతన్య పాఠశాలలొ వైజ్ఞానిక, సాంస్కృతిక,  క్రీడా ప్రదర్శన

జయభేరి న్యూస్ :

హయత్ నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల బ్రాంచ్ లో ఈనెల 27, 29 తేదీల్లో విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీలు ఘనంగ జరిగాయి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న  మేథా శక్తిని వెలికి తీసి ఉపయోగించినప్పుడే దేశం, వారి బౌవిశ్యత్, తో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని శ్రీ చైతన్య పాఠశాలల దిల్సుఖ్నగర్, నారాయణగూడ జోన్ల ఏజీఎం సతీష్ అన్నారు.

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

హయత్ నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల బ్రాంచ్ లో ఈనెల 27,29 తేదీల్లో విద్యార్థులకు నిర్వహించారు. వివిధ రకాల పోటీల సందర్భంగా వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులు పాల్గొన్నా ఈ పోటీలు అధ్యంతం ఆసక్తిగా సాగాయి, హైదరాబాద్ అన్ని జోన్ల నుండి వచ్చిన సుమారు 550 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రదర్శన నిర్వహించారు. ఉపన్యాసం పాటలు నృత్యం క్విజ్ ఏకపాత్రాభినయం వంటివే కాకుండా వైజ్ఞానిక సాంస్కృతిక క్రీడా రంగాలలో విద్యార్థులు చూపిన ప్రతిభతో పాటు పాత్రలకు తగిన విధంగా చిన్నారులు వేసిన వేషధారణ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. రోజువారి తరగతుల బోధనతో సరిపెట్టకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్య ప్రదర్శన ద్వారా వారిని మరింత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినందుకుగాను శ్రీ చైతన్య విద్యాసంస్థలు నిరంతరం విద్యార్థులను సంసిద్ధులుగా చేస్తున్నాయన్నారు.

Read More ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

కార్యక్రమాల అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులకు చేయడానికి తమ విద్యాసంస్థలు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాయని, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు ముందుకు రావాలని ఏజీఎం సతీష్ పిలుపునిచ్చారు. అందుకు తోడ్పాటు అందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ.లు వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్స్ రవి, జితేందర్, అన్నపూర్ణ, సరిత, ప్రీతి గారాలతో పాటు ఆయా పాఠశాలల ప్రిన్సిపల్ తమ విద్యార్థులతో పాటు హాజరయ్యారు. రెండు రోజులగా కొనసాగిన ఈ కార్యక్రమంలో కాల్స బ్రాంచ్ ప్రిన్సిపాల్ కిరణ్మయి, వైస్ ప్రిన్సిపాల్ శ్వేత, డీన్ మోహన్, ఏవో శేఖర్, ఇంచార్జ్ ఉమాకాంత్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Read More దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ