Telangana I కంచర గాడిద.. రేసుగుర్రం... సన్నాసి! దద్దమ్మలు! దున్నపోతును కొనుక్కున్నది ఎవరు?
ఇక ఇదే కెసిఆర్ నీళ్ల విషయంలో తమ గొంతును వినిపించాలని నల్లగొండలో సభను ఏర్పాటు చేసి మేడిగడ్డకు పోయి ఎంపీకుంటారో పీక్కోండి? సన్నాసి దద్దమ్మలు చేతగాని ప్రభుత్వం అనే బూతు పురాణం మొదలెట్టారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కంచర గాడిద రేసుగుర్రం కథ మొదలేసుకొచ్చారు..
జయభేరి, హైదరాబాద్ :
10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎంగా కేసీఆర్ తనదైన ముద్రను వేసుకున్నాడు. దొర గడీలను నిర్మించుకొని 10 సంవత్సరాలలో విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేసి భూకబ్జా ఆక్రమణకు పాల్పడ్డాడని దొర పాలన అనిపించుకున్నాడని అనేక ఆరోపణలతో మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించక కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చి రెండు నెలలు కాకముందే ప్రతిపక్షంలో కూర్చున్న గత కెసిఆర్ అనుసర బృందం ప్రభుత్వం నశించాలి పోలీసులను నశించాలి అని ధర్నా చేయడం హాస్యాస్పదం.. నిజానికి ప్రతి రాజకీయ నాయకుడిలో మానవత్వం ఎక్కడో చోట దాగి ఉంటుంది. కానీ కెసిఆర్ కు అణువణువున అధికార దాహం తగ్గిపోలేదు అనేది నగ్నంగా కనిపిస్తోంది. ఒకవైపు శ్వేత పత్రాన్ని ప్రతి రంగంలో రిలీజ్ చేస్తూ గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల పై అవినీతి జరిగింది అంటూ జల వివాదంపై శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టే తరుణంలో గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆరోగ్య కారణాల రీత్యా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మోకాళ్ళకు శస్త్ర చికిత్స జరిగిందని దాని తర్వాత కొన్ని రోజులు ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకొని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఆ తరువాత మళ్లీ శాసనసభకు వచ్చిన దాఖలాలు లేవు. అంటే ఎమ్మెల్యేగా శాసనసభలో కూర్చోవడం తనకి ఇష్టం లేదు అనేది ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఇక నల్లగొండ సభలో కేసీఆర్ ఆయన బృందం ఏర్పాటు చేసిన జల వివాదంపై సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్ తెలంగాణలో నన్ను తిరగనివ్వరా మీకు ఎంత ధైర్యం మేడిగడ్డకు పోయి ఏం పీక్కుంటారో పీక్కోండి సన్నాసి దద్దమ్మలు చేతగాని ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మళ్ళీ అధికారం తనకే ఉందనే అహంకారాన్ని ప్రజలపై గట్టిగానే రుద్దారు.
ఇంకా ఒక్క అడుగు ముందుకేస్తూ పాలిచ్చే బర్రె నమ్మి దున్నపోతును కొనుక్కున్నారు అంటే ఈ ప్రజలకు ఇంకా సిగ్గు లజ్జ అభిమానం ఉందా అనే ప్రశ్న మనకి మనమే వేసుకోవాలి. నిజమే పాలిచ్చే బర్రెను కేసీఆర్కు అప్పజెప్పిన ఈ సన్నాసి దద్దమ్మ ప్రజలే కదా ఈ రోజున దున్నపోతును కొనుక్కుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు బానిసలుగా ఉండాల్సిన ఈ రాజకీయ నాయకులు ప్రజలనే సన్నాసులు దద్దమ్మ అని మాటలు ప్రజాక్షేత్రంలో స్టేజి మీద నుంచి విసురుతుంటే చప్పట్లు కొట్టే ఈ జనాన్ని ఎవడు బాగు చేయలేడు. జల వివాదంపై జరుగుతున్న చర్చలో శాసనసభ కి కెసిఆర్ రాకపోవడం ఆ బాధ్యతను కడియం శ్రీహరి హరీష్ రావు తీసుకొని మాట్లాడుతుండడం అధికార పార్టీకి శశి విరం మింగుడు పడటం లేదు. అందుకే ఒకవైపు నల్లగొండ మీటింగ్ జరుగుతున్నప్పుడు సీఎం కేసీఆర్ తన మంత్రివర్గం ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డను సందర్శించి అక్కడ అధికారులతో లోపాలను సవివరంగా మీడియా పాయింట్లు ప్రవేశపెట్టి జనానికి కళ్ళు తెరిపించారు. ఇక ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలి అంటే కంచర గాడిదను విడిచి పెట్టిన జనాలు రేసుగుర్రాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు అని చెప్పడం కెసిఆర్ కు ఎలక్కాయ పడ్డట్టు అయిపోయింది. ఎలాగూ కేసీఆర్ కు క చ రా అనే బిరుదు తెలంగాణ ప్రజలు చేసిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డికి రేసుగుర్రం అనే బిరుదును ఇచ్చారని చెప్పగానే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవక ముందే మీరు హామీలు ఇచ్చారు కదా వాటిపై మేము అడుగుతున్నామని టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుండడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే అవుతుంది. కడియం శ్రీహరి మర్యాదగా శాసనసభ గౌరవాన్ని కాపాడుతూ మాట్లాడిన గత ప్రభుత్వం అధికారంలో కనీసం ప్రశ్నించే తత్వాన్ని చంపుకొని బతకలేదా? చెప్పు చూపించిన బాల్క సుమన్ కెసిఆర్ పాదాలకు మడుగులోత్తలేదా? చిన్న దొర అని పిలిపించుకున్న కేటీఆర్ ఎన్నడైనా పది సంవత్సరాల్లో ఆటోలో తిరిగారా? అధికారం కోల్పోగానే అధికార దాహం తీరక పుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పసికూన పై తమ పంచాను విసురుతుంది బిఆర్ఎస్ పార్టీ. పది సంవత్సరాల కాలంలో ఇప్పుడే పుట్టిన నాలుగు నెలల పిల్ల తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నాం అని 10 సంవత్సరాల కాలాన్ని జరుపుకుంటూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నెలల పసికందును ఏమందాం అనే సోయి కూడా ఎందుకు లేకపోయిందో ఆ..నేతలే ఆలోచించుకోవాలి...
"మేం చేస్తే సంసారం అవతలి వాళ్ళు చేస్తే వ్యభిచారం "అనే విధంగా గత తెలంగాణ పాలకుల పనితీరు రోజురోజుకు దిగజారిపోతూనే ఉంది. పది సంవత్సరాల కాలంలో తెలంగాణను అన్ని విధాల విధ్వంసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం మూడవసారి అధికారం దక్కకపోయేసరికి ఆ ఫ్రస్టేషన్ భరించలేక నల్లగొండ సభలో తన కసిని తన అహంకారాన్ని పూర్తిగా ప్రజలను ఉద్దేశించి ప్రజలని తిట్టారు. ఇది అర్థం కాని ఆ జనం నవ్వుతూ కోతుల్ల చప్పట్లు కొట్టారు. కెసిఆర్ మాట్లాడిన ప్రతి మాట కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు ఆ ప్రభుత్వం కావాలని ఓట్లేసి గెలిపించిన ప్రజలకి వర్తిస్తుంది. నిజానికి ప్రజలు మార్పు కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ను పక్కనపెట్టి మూడవ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీని అందించారు. అంటే కాంగ్రెస్ పార్టీపై ఎంతో నమ్మకం పెట్టుకొని దుర పాలన నుంచి విముక్తి కోరుతూ తెలంగాణను స్వేచ్ఛ జనజీవలోకి నడిపించామని సగర్వంగా తలెత్తుకొని ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా పాలనలో గత 15లలో కనీసం రేషన్ కార్డు కూడా అంది ఇవ్వలేని దుర్వేద్యమైన పాలనలో అణచబడ్డ నెట్టివేయబడ్డ హీనంగా చూడబడిన కుటుంబాల్లో కూడా ఓ కొత్త వెలుగులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో అనేక అంశాలపై ప్రజలకు వివరిస్తూ దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించింది.. అలా దరఖాస్తులను నింపిన ప్రజలు డేటా ఎంట్రీ చేసిన ప్రభుత్వం త్వరలోనే మరో రెండు పథకాలకు శ్రీకారం చుడుతున్న రెండు నెలల కాలం వ్యవధిలోనే గత పదేళ్ల అధికారంలో ఉన్న నాయకులకు ఎందుకు అంతగా సంకలు గుద్దుకుంటున్నారు అర్థం కావడం లేదు. అంటే పదేళ్లలో మేము చేయని పనులు రెండు నెలల్లో మీరు చేస్తున్నారు మా ఉనికి దెబ్బతింటుంది అనే భయంతో లేనిపోని అపనిందలను ప్రజలకు కల్పిస్తూ మభ్యపెడుతూ కృష్ణా జలాల విషయంలో మీరే తప్పుదోవ పడుతున్నారని రెండు నెలల ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తల్లూడిన తాత ముక్కలు తిన్నట్టే అవుతుంది.. ఏ మాకు పండ్లు ఊడిపోయినాయి మేమెక్కడ తిన్నాం మటన్ చికెన్ అని వెనకటికి ఓ తాత అన్నట్టుగా గత ప్రభుత్వంలో పదేళ్ల పాలనలో మేము ఏం చేయలేదు మాకేం తెలవదు అని చెప్పుకొస్తున్న ఆ ప్రభుత్వానికి కాస్త జ్ఞానోదయం కావాలి... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రతి పేదవారి ఇంటిలో 200 యూనిట్ల వరకు ఫ్రీ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఇంకోవైపు సబ్సిడీపై ఇంటి అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు అందించే పథకాలకు శ్రీకారం చుడుతూ అనేక యూత్ డిక్లరేషన్ ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తూ కాలేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవినీతిని బయటకు తీస్తూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి లెక్కలను పక్కాగా ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ 60 రోజుల కాలం వ్యవధిలోనే రేసుగుర్రంలో పరిగెడుతుందని ప్రజల్లో బలంగా నమ్మకం ఉంది. ఇక జలవివాదంతో ఎంపీ ఎలక్షన్లో పబ్బం గడుపుకుందాం అని అనుకున్న గత బిఆర్ఎస్ పాలకులకు చేదు అనుభవమే మిగిలింది.
మొత్తానికి తెలంగాణ జల వివాదాన్ని ముందర పెట్టి రాజ్ అధికార ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్న ప్రజలు వివేకంతోనే ఆలోచిస్తూ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి అధికారం కట్టబెట్టాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారు. నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ప్రజలకు జ్ఞానోదయమైంది. మేము అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి అలాంటి వాళ్లను పట్టుకొని పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతు తెచ్చుకున్నారు అని చెప్పడం ప్రజలను వెర్రి వెంగళప్పలను చేయడమే అన్నట్టుగా కేసీఆర్ ప్రసంగం సాగిందని ప్రజల్లో బలంగా వాదన రగులుతోంది.. ఇది కదా కెసిఆర్ నైజం అన్నట్టుగా ప్రజలకు కేసీఆర్ అసలు రూపం ఏంటో పూర్తిగా అర్థమైంది.. నల్లగొండ సభలో కేసీఆర్ మరొక అడుగు ముందుకు వేస్తూ కట్టె కాలే వరకు నేను పోరాడుతా అని చెప్పడం ఆయన ఎవరి కోసం దేనికోసం ఎందుకోసం పోరాడుతాడో క్లారిటీ ఇవ్వలేకపోయారు. 10 ఏళ్లు తెలంగాణను బాగు చెయ్యి అని ప్రజలు కేసీఆర్కు అధికారం ఇస్తే అన్ని రంగాల్లో విధ్వంసాన్ని సృష్టించిన కేసీఆర్ గడీల పాలనకు తెరలేపి శాసనసభను ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేయలేదా? అది చాలదన్నట్టు మా కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఏంది? శాసనసభకు రాకుంటే ఏంది ముఖ్యమంత్రి గానే పనిచేస్తాడు అని చెప్పుకొచ్చిన ఆనాటి క్యాబినెట్ వర్గం ఈనాడు ప్రతిపక్షంలో కూర్చొమని ప్రజలు ఆదేశిస్తే ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నిస్తారు? వంద రోజుల్లో అదే ఎందుకు చేయలేదా చేయలేదు ఇది ఎందుకు చేయలేదు అని అడగడం తప్ప మరే విషయాలపై మాట్లాడే అవకాశం గత పాలకులకు లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో విద్య వైద్యం నీళ్లు నిధులు నియామకాలు అన్ని రంగాల్లో వ్యవస్థలను పూర్తిగా విధ్వంసం చేసిన ఘనత తెరాస నాయకులది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపించుకోవాలో ఇప్పటికే ఖరారు చేసుకున్న సందర్భంలో జల వివాదాన్ని మరొకసారి పైకి తీస్తూ కేసీఆర్ అతని రాజకీయ బృందం బాగానే ప్రజలను వాడుకుంటున్న ప్రజలు శాసనసభ ఎన్నికల్లో తీర్పించినట్టుగానే పార్లమెంటు ఎన్నికల్లో తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది.
అందుకనే కెసిఆర్ సన్నాసి దద్దమ్మ చేతగాని ప్రభుత్వం పరిపాలన చేయలేని ప్రభుత్వం అని ఎన్ని మాటలు అన్న ప్రజలు మాత్రం కంచర గాడిదగా అభివర్ణిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని రేసుగుర్రం గా అభిమానిస్తూ అన్ని రంగాల్లో ప్రక్షాళన చేయాలని అధికారాన్ని కట్టబెట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి నిర్మొహమాటంగా అధికారాన్ని కట్టబెట్టే అవకాశం లేకపోలేదు... అందుకే గాడిద గాడిదపనే చేస్తుంది గుర్రం గుర్రం పని చేస్తుంది. అంటే ఎవరి పని వారు చేసుకోవాలి.. ఎందుకంటే ప్రజలే న్యాయ నిర్ణీతలు... బిగ్ బాస్ లు... ఒక మాటలో కెసిఆర్ భాషలో చెప్పాలంటే పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును కొనుక్కున్న దద్దమ్మలు సన్నాసులు తెలివి తక్కువ వాళ్ళు? పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలో మీరే నిర్ణయించుకోండి మరి?
...కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
Post Comment