telangana politics I రాజకీయ ప్రకటనల మాయాజాలం ఓటర్ల అయోమయం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.
జయభేరి, హైదరాబాద్ : నిజానికి ఆనాటి రోజుల్లో ఒక ప్రకటన ఇస్తే దాంట్లో ఎంతో కొంత వాస్తవం అనేది కచ్చితంగా ఉండేలా చూసుకున్నారు ఆనాటి ప్రజా పరిపాలకులు... కానీ నేటి రాజకీయాల్లో మానవ జీవన విధానంలో మార్పు చెందిన దగ్గర నుంచి ప్రకటన అంటే పచ్చి అబద్ధం అన్నట్టుగా మీడియా కథనాలు ఇవ్వాల జనాలను పక్కదోవ పట్టిస్తున్నాయి.. మీడియా అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన నాలుగవ పిల్లర్గా అర్ధాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ, అదే మీడియా వ్యాపార వస్తువుగా మారిపోయి సమాజాన్ని బాగు చేయకపోగా వక్రీకరించే దిశగా ఆచరణాత్మకంగా అడుగులు వేస్తోంది..
తెలంగాణ ప్రజలను పక్కదోవ పట్టించేందుకు తెలంగాణ భాషను యాసను ఆధారం చేసుకుని రాజకీయ పార్టీలు చేసే ప్రకటనలు ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి... రాష్ట్ర రాజకీయాల్లో నాయకులు ఓట్లు వేయాలి అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి కానీ వీళ్ళు చేసే సోషల్ మీడియా ప్రచారం మామూలుగా లేదు ఒకరిపై మరొకరు పోటీ తత్వంతో చేసే రాజకీయ ప్రయోజనాలను కోసం చేసే ప్రకటనలు ఇప్పుడు జనాలకే కాదు, ఆయా పార్టీల నేతలకు ముగింత కలవరాన్ని తెచ్చిపెడుతుందనే విషయం ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది... ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్లు చేసిన రాజకీయ ప్రకటన ఎంతో ఇబ్బంది పెట్టిందని, కేంద్ర ఎన్నికల కమిషనర్ కి కంప్లైంట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే... ఇక ఇదే కోవలో ఒక పార్టీని అయోమయంలో పడేంతగా చేసిన రాజకీయ ప్రకటనలు ఇక ప్రజలను అదేనండి ఓటర్లను ఎంత అయోమయంలో పడేసిందో మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు...
ప్రధానంగా ప్రజా సమస్యలను మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రజల జీవన ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడంలో ఆయా రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల కోసం పని చేయాలి... అందుకోసం ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజల్లో ఉండే సమస్యలని వారి జీవనస్థితిగతులను తెలుసుకొని ప్రయత్నం చేయాలి... కానీ ఇప్పుడున్న మూడు ప్రధాన పార్టీల నేతలు కేవలం సోషల్ మీడియా ప్రచారానికి ఎక్కువగా ముగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది... అందుకేనేమో సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను చూసి ఆపోజిషన్ పార్టీ నేతలే బెంబేలెత్తిపోయేలా చేస్తున్న రాజకీయ ప్రకటనలో నటించే నటీనటులు నటించడం లేదు వాళ్ళు జీవం పోస్తున్నారు... ఆ నటీనటులను తలదన్నే మాదిరిగానే రాజకీయ పార్టీల నేతలు కూడా భలేగా నటిస్తూ ప్రజల మధ్యన తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు... ఒకరు దోష వేస్తూ ఓట్లు అడుక్కోవడం ఇంకొకరు ఒక బాబాతో చెప్పులతో కొట్టించుకొని ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం.... మొత్తానికి ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో ఆయా మతాలలో ప్రార్థనలు పూజలు...
ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ నేతలు ప్రజల మద్దతు కూడగట్టుకుంటూనే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకొని ఆ తరువాత వివిధ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూ ప్రజలను ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు... ఇదెక్కడి ప్రజాస్వామ్యం!? ఇది ఎక్కడి పోటీ తత్వం!? అనే రీతిలో నేటి రాజకీయ నాయకుల పరిస్థితి చూస్తుంటే పగటి వేషగాడిలాగా కనిపిస్తోంది... మొత్తానికి వివిధ శాటిలైట్ ఛానల్లో వచ్చే రాజకీయ ప్రకటనలు చూసి జనాలు ఆశ్చర్యపోతూ అవునా అనిపించేంతగా తమ మనసును ఆయా పార్టీల వైపు మళ్ళింపచేస్తున్నారు... వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు నేతలు వచ్చి వారి సమస్యలు తెలుసుకోవాలి గాని ఇలా కేవలం సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తూ ఓట్లు దండుకునే వారిని ఇకనైనా పసిగట్టి ఓటర్లు జాగ్రత్త పడాలి...
రెండున్నర గంటల సినిమా చూసి మనం ఏడుస్తాం నవ్వుతాం మనల్ని మనమే మరచిపోతాం ఇక అదే కోవలో రాజకీయ ప్రకటనలు చూసి కూడా జనం ఒకంత ఒత్తిడికి లోనయ్యి ఓటును తమ వైపు మళ్లింపుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఆయా పార్టీల సోషల్ మీడియా కథనాలు.... వాస్తవాన్ని గ్రహింపజేసేలా నిజాన్ని నిర్భయంగా చెప్పేలా మీడియా నేడు పనిచేయటం లేదు అనేది నగ్నసత్యం... ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేటి రాజకీయాలు పూర్తిగా ఆర్థిక సంబంధమైన రాజకీయాలుగా మారిపోయి జనాల జీవన పరిస్థితిని దుర్భర జీవితంలోకి నెట్టివేస్తున్నాయి... ఇదిలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పూర్తిగా బానిస బతుకుల మధ్యనే తెలంగాణ జీవన ముఖచిత్రం బలి కాక తప్పదు... పొలిటికల్ ఆడ్ ఇది పదునైన కత్తిలా పనిచేస్తాయి...
ఒక వైపే చూస్తున్న ప్రజలకి మరొకవైపు ఏది నిజమో ఏది అబద్దమో తెలియజేసేలా ప్రజలు ఆలోచన చేయాలి... అంతేకానీ ప్రకటనలను చూసి మోసపోవద్దు. వాళ్ళు చెప్పే మాటలు అస్సలు వినొద్దు... ఎందుకంటే రాజకీయంలో ప్రకటనలు చేస్తూ వారు ఓటు వేసిన తరువాత ఆ ప్రకటనలు మన కంటికి కనపడవు... గెలిచిన నేతలే మన కళ్ళ ముందర ఉంటారు. వారితో మనం పని చేయించుకోవాలి కానీ వారికి వత్తాసు పలుకుతూ బానిసలుగా మారవద్దు... ప్రకటనల ఉచ్చులో పడిపోయి ఐదు సంవత్సరాల బంగారు జీవితాన్ని పాడు చేసుకోవద్దు... నేటి ఆధునిక సాంకేతిక సమాజంలో ప్రకటనలు చేసుకోవచ్చు కానీ వాటిని నియంత్రణ చేసే దిశగా నియంత్రణ నియంమవాలి చేతులుడికిపోయింది...
అందు కారణం వారికున్న రాజ్యాంగపు హక్కులను ఆసరాగా చేసుకుని ప్రకటనలను గుప్పిస్తున్నారు... అందువల్ల మనం విజ్ఞులైన ఓటర్లు... ఒక నిమిషం ఆలోచించి, ఓటు వేసే ముందు మన కోసం ఎవరు పనిచేస్తారో తెలుసుకొని వారికి ఓటు వేసుకోవాలి.. ప్రకటనల ఉచ్చులు పడిపోకుండా ఓటర్లు తస్మా జాగ్రత్త పగటి వేషగాళ్ల అమ్మాయిలు పడిపోకండి ప్రజాస్వామ్య మనుగడను దెబ్బతీయకండి... సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దు.... ఎన్నికలు ప్రజ స్వామ్య బద్దంగా జరుగుతాయి. కాబట్టి అపోహలకు తావులేదు...
... కడారి శ్రీనివాస్
రాజకీయ విశ్లేషకులు
Post Comment