Telangana I కాంగ్రెస్ పార్టీ ఓకే ఆశాదీపంలా కనిపిస్తోంది
కాంగ్రెస్ చుట్టే తెలంగాణ రాజకీయాలు.. అనూహ్య పరిస్థితుల నడుమ పుంజుకున్న కాంగ్రెస్.. కీలకంగా మారిన కర్ణాటకలో గెలుపు.. బీఆర్ఎస్, బీజేపీ లకు వణుకుపుట్టిస్తున్న 6 హామీలు.. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు..
కాంగ్రెస్ చుట్టే తెలంగాణ రాజకీయాలు..
అనూహ్య పరిస్థితుల నడుమ పుంజుకున్న కాంగ్రెస్..
కీలకంగా మారిన కర్ణాటకలో గెలుపు..
బీఆర్ఎస్, బీజేపీ లకు వణుకుపుట్టిస్తున్న 6 హామీలు..
తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు..
కొత్త ఉత్సాహాన్నిచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వం..
ఆచి తూచి అభ్యర్థులను ప్రకటిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం..
పూర్తిగా ఉనికిని కోల్పోతున్న భారతీయ జనతా పార్టీ..
బండి సంజయ్ ను తప్పించి చారిత్రాత్మక తప్పిదం..
బీ.ఆర్.ఎస్. అవినీతిపాలన అంతం చూడాలన్నదే ప్రజల నిర్ణయం..
ఎలాంటి తప్పిదం చేయకుండా ముందుకెళితే కాంగ్రెస్ దే అధికారం అంటున్న రాజకీయ విశ్లేషకులు..
ఈ పాపం పాలకులదే.. తమ స్వప్రయోజనాల కోసం తెలంగాణ సంపదను దోచుకుంది.. తెలంగాణ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది.. ఈ నిజాలన్నీ గ్రహించేసరికి తొమ్మిది సంవత్సరాలు దాటి పదో సంవత్సరంలోకి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన వచ్చేసింది.. ప్రస్తుతం తాము నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని ప్రజలందరూ నెమరు వేసుకుంటున్నారు.. ఈ పరిస్థితుల్లో వారికి కాంగ్రెస్ పార్టీ ఓకే ఆశాదీపంలా కనిపిస్తోంది.. ఎలాగైనా కాంగ్రెస్ ను గెలిపించుకుని తమ జీవితాలను బాగుచేసుకోవాలనే ఆలోచనలో వారు పడిపోయారు..
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం క్షణ క్షణానికి మారిపోతోంది.. ఎలాగైనా మూడవసారి గెలిచి అధికార పీఠం అధిరోహించాలని అధికార బీ.ఆర్.ఎస్. పార్టీ కుయుక్తులు పన్నుతుంటే.., కర్ణాటకలో అధికారం కోల్పోయి కన్నులొట్టపోయి నెట్టుకొస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో పాగా వేయాలని పావులు కదుపుతోంది.. కాగా తెలంగాణ ఇచ్చి, అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలుగు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది..
భారత దేశంలో ఎన్నెన్నో సంచలన రీ ఫార్మ్స్ ని తీసుకుని వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు నిజాలను ప్రజలకు వివరించి, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ మాత్రమే అని మరోసారి నిరూపించడానికి సన్నద్ధం అవుతోంది.. ఆ కోవలోనే పేరున్న ఇతర పార్టీ నాయకులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది.. గెలుపు గుర్రాలను ఏరి కోరి ఎంచుకుంటోంది.. కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడి, తెలంగాణాలో సరికొత్త పరిపాలనను తీసుకురావాలని ఉవ్విళ్లూరుతోంది.. దీనికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తూనే ఉంది.. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు రేవంత్ ప్రస్తావన కొంతమేర నచ్చకపోయినా.. అధికారం చేజిక్కించుకోవాలంటే కలిసి పనిచేయక తప్పదనే నిర్ణయానికి వారందరూ వచ్చినట్లు తెలుస్తోంది..
ఆ క్రమంలోనే అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దొరికేలా కసరత్తును కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.. ఢిల్లీలో జరిగిన ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటి సమావేశం కూడా ముగిసింది.. అందరూ ఊహించినట్లుగానే సమతుల్యంగా లిస్ట్ తయారయ్యింది.. ఈ లిస్ట్ అందరికీ ఆమోద్యయోగంగానే ఉందనేది కాంగ్రెస్ వర్గాల భావన.. ఖచ్చితంగా ఇదే లిస్ట్ తో ఎన్నికల్లోకి వెళ్తే విజయం ఖాయమనే ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు.. కాగా కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా సేవలు అందిస్తున్న ఉద్దండులైన నాయకులకు కొదవలేదు.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా చెప్పవచ్చు.. ఇక ఎంతో అనుభవం ఉన్న మల్లికార్జున్ ఖర్గే నాయకత్వం, బుల్లెట్ లా దూసుకునిపోయే రాహుల్ గాంధీ, పార్టీకి ఆకర్షణగా నిలుస్తున్న ప్రియాంక లాంటి వారు ఉండనే ఉన్నారు.. పైగా కర్ణాటక విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ క్యాడర్ తెలంగాణలోనూ జెండా పాతాలని ఉవ్విల్లూరుతున్నారు..
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని చేయగల సత్తాను కలిగుండానే భావాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకుని పోతున్నారు.. పైగా కాంగ్రెస్ అంటే ఒక మహా సముద్రమని, చిన్న చిన్న అంతరాయాలు, సుడిగుండాలు మామూలే అని, ఎన్ని అతంగాకు ఎదురైనా చివరకి సముద్రం ప్రశాతంగా ఉంటుందని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన పరిస్థితులను సర్దుకుంటుందని విశ్లేషకులు సైతం అంటున్న మాట..
తెలంగాణ రాష్ట్రాన్ని కానుకగా ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబానికి కృతజ్ఞతా ఉంటాను.. అవసరం అయితే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికైనా సిద్ధమని, బీరాలు పలికి సోనియా పాదాలకు కుటుంబసమేతంగా వెళ్లి నమస్కరించి వచ్చిన కేసీఆర్ తర్వాతి కాలంలో తన వాగ్ధానాన్ని తుంగలో తొక్కారు.. ఇప్పుడైతే ఏకంగా తెలంగాణ పోరాటాల వల్ల వచ్చిందని, తాను చావునోట్లో తలకాయ పెడితే తెలంగాణ ఇచ్చారని బహిరంగ సభల్లో బలంగా చెబుతున్నారు.. అంతే కాకుండా గత పది సంవత్సరాలుగా తెలంగాణలో అధికారంలోనేని కాగ్రెస్ పార్టీని పట్టుకుని, తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయే అని చెబుతుండటం దారుణమైన విషయమని ప్రజలు చర్చించుకుంటున్నారు..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పక్కనబెట్టి, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఏమిటని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.. బీజేపీ జోలికి వస్తే తమ బండారం బయటపడి ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందనే కేసీఆర్ బీజేపీ పెద్దలకు అణిగిమణికి ఉంటున్నారన్నది తేటతెల్లమవుతోంది.. తన కూతురు లిక్కర్ స్కాం, పేపర్ లీకేజీలో తన సుపుత్రుడు చేసిన నిర్వాకం బయటపడి ఎక్కడ పారిపోవాల్సి వస్తుందో అని కేసీఆర్ భయపడిపోతున్నాడని విశ్లేషకుల వాదన.. నిజానికి ఇది వాస్తవం కూడా..
ఇక బీజేపీ పూర్తిగా తెలంగాణపై ఆశలు వదిలేసినట్టే కనిపిస్తోంది.. ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుని కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టాలన్నదే వారి కోరికగా కనిపిస్తోంది..దీనికోసం లోపాయికారిగా వారు బీ.ఆర్.ఎస్. తో ఒప్పొందం కూడా కుదుర్చుకున్నట్లు కాంగ్రెస్ వారు ఆరోపిస్తున్నారు.. పైగా బీ.ఆర్.ఎస్. అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కూడా కోట్లాది రూపాయలు అక్రమంగా వెనుకేసుకున్నారు కాబట్టి.. రాబోయే ఎన్నికల్లో ఎంతైనా ఖర్చుబెట్టగలుగుతారు కాబట్టి.. బీ.ఆర్.ఎస్. పార్టీని నమ్ముకుంటే తాము అనుకున్నన్ని లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోవచ్చని భావిస్తోంది..
కేంద్రంలో అధికారం చేపట్టడానికి తెలంగాణ నుంచి లభించే ఎంపీ సీట్లు కూడా ఎంతో కీలకం అన్నది జగమెరిగిన సత్యమే.. బీజేపీ, బీ.ఆర్.ఎస్. పార్టీలు తమ ఉనికి కోసం మాత్రమే పనిచేస్తున్నాయని, రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాయని నిజాన్ని ప్రజలు గ్రహించారు.. ప్రజల బాగోగులకోసం ఈ రెండు పార్టీలు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్నది వారు గ్రహించారు.. ఇచ్చిన మాటకు కట్టుబడి, తమ పార్టీ నామరూపాలు అవుతుందని తెలిసినా కూడా సోనియా తెగువ చూపి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని ఇచ్చిన సంగతి వారిప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు..
ఈసారి కూడా చారిత్రాత్మక తప్పిదం చేస్తే, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఆందోళన సర్వత్రా నెలకొంది.. ఈ సారి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి సోనియా గాంధీ, ఆమె కుటుంబం ఋణం తీర్చుకోవాలనే నిశ్చయానికి వారందరూ వచ్చారన్నది పచ్చినిజం.. పైపెచ్చు కుదేలైపోయిన రాష్ట్రంలోని అన్నివర్గాలు, సంతోషంగా బ్రతికి బట్టకట్టాలంటే ఒక్క కాంగ్రెస్ వల్లనే సాధ్యం అవుతుందని వారు గట్టిగా నమ్ముతున్నారు.. ఇదే కాకుండా సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గు చూపుతున్నాయి.. తప్పని సరిగా తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెబుతున్నాయి..
అయితే ఇక్కడొక సమస్య ఉంది.. కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ వారీ నాయకులు.. ఎవరి క్యాడర్ వారికి ఉంది.. అందరూ తోపులే అన్న భావన అందరిలో ఉంది.. కనుక ఎలాంటి ఇగోలకు పోకుండా, వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా, కలిసికట్టుగా ప్రతి నాయకుడు పనిచేస్తే తెలంగాణాలో అధికారం కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం.. ఇది వాస్తవం కూడా.. ఈ నిజాన్ని గ్రహించి ముందుకు వెళ్తే.. విజయం నల్లేరుమీద నడకే అవుతుందన్నది అక్షర సత్యం..
... BV రమణ
Cell: +91 93902 67118
Post Comment