telangana I రాజ్యాంగ స్పూర్తికి తిలోధకాలు...!?

స్వేచ్ఛ సమానత్వం న్యాయం సౌభ్రాతృత్వం 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో అందరికీ అందాయా!?

telangana I రాజ్యాంగ స్పూర్తికి  తిలోధకాలు...!?

జయభేరి, హైద‌రాబాద్ :

గణతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత దాని యొక్క ప్రాముఖ్యతను రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకోవాలని సదుద్దేశంతో మరొక కథనాన్ని అందిస్తున్నాం... రాజ్యాంగపు నిర్మాతలు ఆశించిన ఉద్దేశం ఏమిటి!? స్వేచ్ఛ సమానత్వం న్యాయం సౌభ్రాతృత్వం 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో అందరికీ అందాయా!? జమీందారీ భూస్వామ్య పాతతర పోకడలు మళ్లీ పునరావృతం అవుతున్నాయా!? అనే విషయాలపై జయభేరి కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ....

Read More బిఆర్ఎస్ మైనార్టీ నాయకుల ప్రత్యేక ప్రార్థనలు

రాజ్యాంగ స్పూర్తికి ఆశయానికి దేశ పౌరులందరూ లోబడి పని చేయాలి.. రాజ్యాంగం ఆశయాలు ఉద్దేశాలు రాజ్యాంగం యొక్క ఆత్మ లాంటిది అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏనాడో వర్ణించాడు.. నిజానికి చెప్పాలంటే రాజ్యాంగంలో నాలుగు పాదాలు ఉంటాయి. మొదటిది స్వేచ్ఛ 42 వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్వేచ్ఛ మత స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ ఇలా వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రాదేశిక సూత్రాలలో మొదటిగా స్వేచ్ఛ గురించి రాజ్యాంగంలో విధివిధానాలతో పూర్తిగా లిఖించబడి ఉంది... కానీ 75 ఏళ్ల స్వతంత్ర భారత వనిలో ఈ స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి సమానంగా అందుతుందా అనేది మనం ఆలోచించాలి.. రెండవదిగా సమానత్వం.. సమానత్వం మనుషుల్లో ఏకం కావాలని గణతంత్ర దినోత్సవ తర్వాత ఒక చట్టాన్ని చేసుకొని ఆ చట్టం ప్రకారం లోబడి పని చేస్తున్న నేటి వరకు సమానత్వం లేక వర్గీకరణ అసమానతలు కులం అంటూ విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయ పార్టీలు ఉన్నన్ని రోజులు సమానత్వం రాజ్యాంగంలోనే తప్ప సమాజంలో లేదు అనేది ఒక వాదన బలంగా వినబడుతోంది..

Read More సీసీ కెమెరాల ఏర్పాటుకు హెచ్ బి ఎల్  పరిశ్రమ సహకారం

మూడవది న్యాయం.. ఇక న్యాయం విషయానికొస్తే దీంట్లో సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయం అనేది కచ్చితంగా ఇవ్వాలి అని మనకు రాజ్యాంగం చెబుతోంది.. కానీ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.. రాజకీయంగా అగ్రకులాల వాళ్లే అధిక ధన సంపన్నులే రాజకీయాల్లో అధికారాలను అనుభవిస్తున్నారు... పేరుకే ఎస్సీ సామాజిక వర్గాలుగా ఏర్పాటైన తరువాత ఆయా నియోజకవర్గాల్లో ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని నియంత్రించే ముఖ్యమంత్రి స్థానంలో ఆధిపత్య కులాలు ఉండడం వల్లనే దొరల పాలన భూస్వామ్య వ్యవస్థ పాలన మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి... ఇక ఆర్థిక స్వేచ్ఛ ఇది ఎప్పటికి నెరవేరుతుందో ఎవరికి అర్థం కాదు.. ఎందుకంటే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి అలవి కానీ హామీలను పథకాలను ప్రజలకు అందిస్తూ వ్యక్తి యొక్క ఆర్థిక స్వేచ్ఛను హరించేస్తున్నారు.. కేవలం ప్రజలు తమ స్వశక్తిని నమ్ముకోక ప్రభుత్వం అందించే పథకాలపై పరుగులు తీస్తున్నారు... ఇది పూర్తిగా వ్యక్తి యొక్క న్యాయ స్వేచ్ఛను పాడుచేసినట్టే అవుతుంది.. 1975 నుండి రాజ్యాంగ ప్రవేశికను ఏర్పాటుచేసిన న్యాయవ్యవస్థలు ఆ లక్ష్యాన్ని ఊటంకిస్తూనే ఉన్నాయి.. అలాగే న్యాయం కోసం సివిల్ కోర్టులో పోలీస్ స్టేషన్లో సమాజంలో ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అని చెప్పడానికి సిగ్గు పడుతున్నాను... ఇక నాలుగోది సౌబ్రాతృత్వం అంటే వ్యక్తిగత గుర్తింపు హుందాతనం గౌరవంగా జీవించడం ఇలాంటివి 75 ఏళ్ల భారత స్వాతంత్రంలో ఆశించినంత మేర లేదు కానీ ఇంకా సౌబ్రాత్రుత్వం సమాజంలో సరిగా లేదు అని చెప్పక తప్పదు...

Read More ప్రజా సంక్షేమమే కాంగ్రేస్ ప్రభుత్వ లక్ష్యం...  ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న ప్రాంతాలు విభిన్న భాషలు ఇలా 75 ఏళ్ల నుంచి ఒకే రాజ్యాంగం కింద ఉండడం మనందరికీ గర్వకారణం... ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య దేశాలు ఎన్ని ఉన్నా భారతదేశం విలక్షణమైన దేశంగా గుర్తింపు తెచ్చుకుంది... కానీ ఇక్కడ ఇవే రాజకీయ పార్టీలు కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తూ  రాజ్యాంగం యొక్క ఆత్మను నాశనం చేస్తున్నాయి.. 2000 సంవత్సరంలో m m వెంకటాచలయ్య కొన్ని సూత్రాలను అమలు చేశారు అవి పరిగణలోకి రాలేకపోయాయి. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు రాజ్యాంగానికి లోబడి కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న రాజకీయాలు లక్ష్యాలు వేరు ఆశయాలు వేరు ఉద్దేశాలు వేరు... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తున్నారు.. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉనికిని చాటుకోవడానికి రాజ్యాంగపరంగా కావలసిన హక్కులను వినియోగించుకుంటూ తమ వీధిని తాము మరిచిపోతూ రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలిస్తున్నారు.. ఉదాహరణకి ఒక రాజకీయ పార్టీ దీర్ఘకాలికంగా అధికారం కోసం ప్రయత్నించడమే.. ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యం మనుగడకు చెంపపెట్టుగా మారుతుంది.. అధికారం కోసం అయితే రాజ్యాంగం పూర్తిగా దెబ్బతింటుంది...
రాజ్యాంగంలో పార్లమెంటరీ విధానం శాసన కార్య నిర్వహణ వర్గ విధానం ఇలా స్వతంత్రంగా పనిచేయాలని రాజ్యాంగం మనకు సూచిస్తుంది.. కానీ ఇవి స్వతంత్రంగా పనిచేస్తున్నాయా లేదా అనేది మనమే ఆలోచించాలి.. అధికారం విభజనలో న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ ఈ రెండు వర్గాల నుంచి పాలన అధికారం కోసం వైరుధ్యాల మధ్య పోటీ తత్వం పెరిగి ప్రజాస్వామ్యకమైన దిగా దేశం అపనిందల పాలవుతుంది... న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ప్రజాస్వామ్యమైనదిగా ప్రజాస్వామ్యం కనిపిస్తుంది అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు... 1975 1980 ఈ మధ్యకాలంలో న్యాయవ్యవస్థ ధర్మాస వ్యవస్థ ఆమోదించబడి ఆదేశిక సూత్రాలను అమలు చేశాయి... ఇక రాజ్యాంగ స్పూర్తికి నిలువుటదంగా మారేది ఎన్నికల కమిషన్..

Read More భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 

భారతదేశంలో ఎన్నికల కమిషన్ అసలు ఉందా లేదా అనే అనుమానాల మధ్య టిఎన్ శేషన్ ఎన్నికల అధికారిగా పని చేసినన్ని రోజులు ఎన్నికల సంఘం యొక్క అధికారాలను ఉన్నది ఉన్నట్టుగా రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని కొనసాగించారు... ఎన్నికల కమిషన్ గా పనిచేసిన అన్ని రోజులు టిఎన్ స్టేషన్ విధి విధానాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు... నిజానికి ఎన్నికల కమిషన్ ఏ రాజకీయ పార్టీకి మొగ్గు చూపకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి అలా వ్యవహరిస్తున్నాయా లేదా అనేది మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి... ఎన్నికల సంఘానికి కొన్ని అధికారాలను ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ అవసరం. అన్ని రంగాల అభివృద్ధికి బ్యాలెన్స్ సమానత్వానికి భారత రాజ్యాంగం ప్రాదేశిక సూత్రాలలో స్పష్టంగా తెలియజేసింది... కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఆయా రాజకీయ పార్టీలు అధికారాన్ని చేసి ఎక్కించుకున్న తర్వాత ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశ ఇలా విభజించి ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం ఉత్తర భారత దేశానికే ఎక్కువగా ఆర్థిక నిధులను కేటాయిస్తూ దక్షిణ భారతదేశ లో ఉన్న ఆయా రాష్ట్రాలను పక్కన పెడుతూ ఉండడం ఇది సరైన పద్ధతి కాదు... ఇలా చేయకుండా ఉండడానికి నాడు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని ప్రాంతాల రాష్ట్రాల అభివృద్ధికి పనిచేయాలని నిర్దేశించుకున్నప్పటికీ గత పది సంవత్సరాల నుండి ప్రణాళిక సంఘం యొక్క ఉద్దేశాలు ఆశయాలు గాలికి వదిలేశారు... దీని స్థానంలో నీతి ఆయోగ్ ను తీసుకువచ్చి ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇవ్వడమే...
రాజ్యాంగానికి హృదయం తన స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ న్యాయవ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిన అనుమానం లేదు.. ఎందుకంటే 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు నియమించాలి.

Read More మహారాష్ట్రలో పనిచేయని ఆరు గ్యారంటీలు

ఉన్నత న్యాయస్థానాలలో మన దగ్గర 18 మంది న్యాయమూర్తులు ఉన్నారు. దీనివల్ల ఏకకాలంలో కేసులను తీర్పు తీయాలి అని అంటే చాలా కఠిన తరం అయిపోతుంది... అలాగే జడ్జిలు తక్కువగా ఉండటం వల్ల కఠినధరమైన కేసులలో తీర్పు తీర్చడానికి జడ్జి చాలా తీర్పును రాయాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని కేసుల్లో అన్యాయం జరిగే అవకాశం కూడా లేకపోలేదు... మొత్తానికి భారతదేశ రాజ్యాంగం అమలుకు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న మనం రాజ్యాంగ స్పూర్తికి తెలవ దాకాలిస్తున్నామా అనే విషయాన్ని ఒక్కసారి అందరూ ఆలోచించి దేశ సార్వ బహుమతికత్వాన్ని కలిగి ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ స్పూర్తికి ఆటంకం కలిగించకుండా అన్ని వర్గాల ప్రజలు సామాజిక ఆర్థిక న్యాయ సమానత్వ సౌబ్రత్వ స్వేచ్ఛను కలిగి ఉండేలా రాజ్యాంగం ఆదేశించినప్పటికీ ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తున్న ఆయా రాజకీయ పార్టీల వ్యవహార శైలి తీరు మారకపోతే రాజ్యాంగ స్ఫూర్తిగా తిలోదకాలు ఇస్తున్నట్టే....

Read More పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

...-  కడారి శ్రీనివాస్
 కాలమిస్ట్, కవి, సీనియర్ రాజకీయ విశ్లేషకులు
9848 962 799

Read More నీ తాటాకు చప్పులకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి