Telangana I మేయర్, కార్పోరేటర్లంతా రాజీనామా చేసి  ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి..

- జవహార్ నగర్ ప్రజల సవాల్

Telangana I మేయర్, కార్పోరేటర్లంతా రాజీనామా చేసి  ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి..

ఈ నెల 19వ తేదినా అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు..?
అవిశ్వాసమంటూ ఆటాలాడుతున్న ఒకే బి.ఆర్.ఎస్ గూటి రెండు వర్గాల కార్పోరేటర్లు..
డిప్యూటీ మేయర్ అక్రమాలపై తెలంగాణ సి.యస్ కి మేయర్ వర్గం ఫిర్యాదు.. ఇన్ని రోజులు ఏం చేశారంటూ ప్రజల సెటైర్లు..
రెండు వర్గాల పాకులాటంతా మేయర్ పీఠం కోసమే..
నెల రోజులుగా విహారయాత్రల్లోనే పాలకులు..
బిఆర్ఎస్ నుండి గెలిచి ఈ మధ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్పోరేటర్ నీహారిక మద్దతు ఏ వర్గానికి వుండబోతుంది..?
పార్టీ మారిన నిహారికపై BRS గూటి మేయర్ కావ్య ఇన్ని రోజులు ఎలాంటి చర్యలు తీసుకోలేరెందుకు..?
అవిశ్వాసం మేము పెడతాం మేడ్చల్ కలెక్టర్ ఆమోదం తెలిపి అందరి పదవులు బర్తరఫ్ చేసి ముందస్తు ఎన్నికలు పెట్టాలని ప్రజల డిమాండ్..
మాకు పాలకులు వున్న ఒకటే లేకున్న ఒకటే..చేసేదేమి లేదు అక్రమాలు తప్ప అంటూ ప్రజల ఆగ్రహం.

జయభేరి, మేడ్చల్ :

Read More గాంధీభవన్ లో సోషల్ మీడియా మీటింగ్

భూముల కబ్జాలు, పేదలు ఇండ్లు కడితే పైసలు వసూలు చేయడం.. ట్యాక్సుల పేరుతో కమీషన్లు దండుకోవడం, అక్రమ వెంచర్లు చేయడం లేదా ప్లాట్లు దండుకోవడం తప్పా చేసిందేమి లేదంటూ పలువురు కార్పోరేటర్లపై ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు.....

Read More శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు 

మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ మేకల కావ్యపై.. డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ తో పాటు పలువురు కార్పోరేటర్లు అవిశ్వాస తీర్మానానికై ఆర్జీ పెట్టారు. ఇలా మేయర్ వర్గం, డిప్యూటీ మేయర్ వర్గంగా చీలిపోయిన కార్పోరేటర్లు జవహార్ నగర్ ప్రజలకు శాపంగా మారారు.

Read More అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

గతంలో కూడ మేయర్ కావ్య పై  అవిశ్వాసంమంటూ హంగామా చేసిన కార్పోరేటర్లకు ఏమిచ్చారో.. ఏమి చెప్పారో తెలియదు కాని ఏమి ఎరుగనట్లు అందరు సైలెంట్ ఐపోయారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేయర్ పై అవిశ్వాసం అంటూ జవహార్ నగర్ పాలనలో అలజడి సృష్టిస్తూ  మేయర్ వర్గం ఒక దిక్కు.. డిప్యూటీ మేయర్ వర్గం మరో దిక్కున రాష్ట్రం దాటిపోయి నెల రోజులుగా రహస్య యాత్రలు చేస్తున్నారు.. కొందరైతే మధ్యం బాటిల్లతో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తూన్నారు.. దీని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో లీకై వైరల్ అవడం, దీనికితోడు కిడ్నాపుల డ్రామాలతో టెన్షన్ వాతావరణం సృష్టించడం వల్ల ప్రజల నుండి నెటిజన్ల నుండి తీవ్రంగా విమర్శల దుమారం రేగింది.. దీంతో మేయర్ కావ్య తన వర్గం కార్పోరేటర్లతో యాత్రల నుండి తేరుకుని తిరిగి జవహార్ నగర్ కి చేరుకుని రోడ్లపై జనాలకి అందుబాటులోకి వచ్చారు. 

Read More విద్యాధరి ఆలయంలో మాజీ మంత్రి 

ఇక డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ తన వర్గానికి చెందిన 18 మంది కార్పోరేటర్లతో కలిసి ఈ నెల 19వ తేదీన జరగబోయే "అవిశ్వాస తీర్మానం" కోసం ఎదురు చూస్తూ విహారయాత్రల్లో తేలుతూనే వున్నారు. తమ రాజకీయ స్వలాభాల కోసం అవిశ్వాసలు పెట్టి పాలన మరిచి నెల రోజులుగా ప్రజలకు అందుబాటులో లేకుండా కంటికి కనపడనంతా యాత్రల్లో మునిగి ఎంజాయ్ చేస్తార..? అంటూ పాలక వర్గంపై తీవ్రంగా మండిపడుతున్నారు జవహార్ నగర్ ప్రజలు. అందరిపై అవిశ్వాసం మేము పెడతాం..మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆమోదం తెలపాలని.. జవహార్ నగర్ లో పాలక వర్గం వున్న ఒకటే లేకున్న ఒకటే..చేసిందేమి లేదు అక్రమాలు తప్ప అంటూ ప్రజల విమర్శిస్తున్నారు.

Read More గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్  ప్రభుత్వ లక్ష్యo

వీరిలో కొందరు కార్పోరేటర్లు అయితే వీల్లకేదో తమ వార్డు పరిధికి వచ్చే బస్తీలను, భూములను రాసిచ్చినట్టు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా భూముల కబ్జాలు, పేదలు ఇండ్లు కడితే పైసలు వసూలు చేయడం.. ఇవ్వకుంటే కూల్చిపియ్యడం, ట్యాక్సుల పేరుతో కమీషన్లు దండుకోవడం, అక్రమ వెంచర్లు చేయడం లేదా అందులో ప్లాట్లు దండుకోవడం తప్పా చేసేదేమి లేదంటూ ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపిస్తూన్నారు.. మీపై మీరు అవిశ్వాసాలు కాదు నిజాయితీ వుంటే మేయర్ తో పాటు పాలక వర్గం మొత్తం రాజీనామాలు చేసి "ప్రజాక్షేత్రంలో" తేల్చుకుని ప్రజల విశ్వాసాన్ని గెల్చుకోవాలని జవహార్ నగర్ పాలక వర్గానికి స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు సవాల్ విసిరి డిమాండ్ చేస్తున్నారు.

Read More కేసీఆర్ గారు మిరెక్కడా...? 

ఇదిలా వుండగా బిఆర్ఎస్ నుండి గెలిచి ఈ మధ్య అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్పోరేటర్ నీహారిక మద్దతు ఏ వర్గానికి వుండబోతుంది..? BRS పార్టీ గుర్తుతో గెలిచిన నిహారిక కాంగ్రెస్ లోకి వెల్లినందుకు BRS గూటి మేయర్ కావ్య ఇన్ని రోజులు ఎలాంటి చర్యలు తీసుకోలేరెందుకు..? ఏమైన చీకటి ఒప్పందాలు వున్నాయ అంటు గుసగుసలు గుప్పుమంటున్నాయి.

Read More రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు ఎంపికైన తుంకుంట పాఠశాల విద్యార్థులు 

Latest News

నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి
మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల...
Reba Monica John
Rashmika Mandanna
Rashi Singh
గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...
స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు