రేపు యాదాద్రికి సీఎం రాక
రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
జయభేరీ, యాదగిరిగుట్ట, మే 21:.యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వేద పాఠశాల నిర్మాణం,పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఈనెల 23న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కంచి కామ కోటి పీఠాధిపతి శ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ తో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నట్లు
గురువారం కొండపైన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం రోజున ఉద యం 9.35 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు చేపట్టడం కోసం ఆలయానికి చేరుకోరు న్నట్లు తెలిపారు.
ప్రధానంగా టెంపుల్ సిటీ నందు వేద పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించి, భక్తుల సౌకర్యార్థం కొండపైన శ్రీ స్వామి వారికి కళ్యాణ మండపం, దీక్షాపరులకు సదనం,
మెట్ల మార్గంలో పైకప్పు ఏర్పాటు,ఆలయ వాయువ్య దిశలో మెట్లు ఏర్పాటు చేయడం కోసం పనులు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టను న్నట్లు ఈ ఒక్క నిధులు ప్రభుత్వము,దాతల సహకారంతో పనులు చేపట్టినట్లు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. త్వరలోనే పనులకు టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకుని పనులు చేపట్టడం జరుగుతుందని ఈవో తెలిపారు
యాదగిరిగుట్ట ఆలయ వేళలో మార్పు..
Read More వందే రామం.. జగద్గురుం..
ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కంచి కామకోటి పీఠాధిపతి ప్రముఖులు రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయ వేళలో మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. తెల్లవారుజామునే మూడు గంటలకు ఆలయాన్ని తెరిచి పూజా కార్యక్రమాలు చేపడతామని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తులకు ఇబ్బంది కలగకుండానే కార్యక్రమాన్ని కొనసాగించేలా చూస్తామని తెలిపారు.
Views: 0


