వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

జయభేరి, పరకాల : 
శుక్రవారం సంగెం మండలం తీగరాజు పల్లి గ్రామంలో బాల వికాస వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

బాల వికాస వారి సేవలు అభినందనీయమని, పరకాల నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. బాల వికాస కేంద్రంతో తనకు గత కొద్ది సంవత్సరాలుగా అనుబంధం ఉందని, వారు ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్లు, మహిళలను చైతన్యవంతులను చేయడంలో బాల వికాస కేంద్రం ముందుంటుందని, మహిళల ఆర్థికాభివృద్ధికి సంస్థ నిర్వాహకులను కృషి చేయడం  అభినందనీయమన్నారు. బాలావికాస కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవలందించాలని కోరారు.

Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..