వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

ప్రభుత్వ వైఖరి పట్ల నల్ల బ్లాడ్జిలతో వీఆర్ఏల నిరసన

వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

జయభేరి, వర్గల్, ఫిబ్రవరి 07 :
వీఆర్ఏ లను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడాన్ని వీఆర్ఏ జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ గురువారం వీఆర్ఏలు వర్గల్ తహసీల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్లాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వీఆర్ఏ జేఏఎస్ నాయకులు మాట్లాడుతూ.. 2022లో 80 రోజుల సుదీర్ఘ సమ్మె పోరాట ఫలితంగా గత ప్రభుత్వం జీవో నెంబరు 81, 85 లను విడుదల చేసిందన్నారు. ఆ జీవో ని అనుసరించి రాష్ట్రంలో ఉన్న 20,555 మంది వీఆర్ఏ ల్లో 16,758 మంది వీఆర్ఏ లకు పదోన్నతులు ఇచ్చి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. 

ఆ జీవోలో ఉన్న 3797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి 19 నెలలు గడుస్తున్న నేటికీ వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదన్నారు. పలుమార్లు ముఖ్యమంత్రి రెవిన్యూ శాఖ మంత్రిని రెవెన్యూ అధికారులను కలిసి సమస్య విన్నవించి అనేక నిరసనలు తెలిపినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించని కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. జీవో ఇచ్చి 19 నెలలు కావస్తుందని, ప్రభుత్వం విఆర్ఏ ల సమస్యల పరిష్కారం కోసం కమిటీని వేసి సంవత్సరం అవుతుంది. 

Read More ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ఇప్పటివరకు ప్రభుత్వం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? రెవిన్యూ శాఖ మంత్రి సీసీఎల్ఏ వీఆర్ఏ వారసులతో ఎందుకు చర్చించడం లేదు సమస్య పరిష్కరించుటకు ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదు? వీఆర్ఏలు 300 మంది పైగా మరణించిన అనేకమంది వీఆర్ఏ వారసులు ఆత్మ హత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలైన వీఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, జీవో నెంబర్ 81,85 ప్రకారం వారసులకి ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో మల్లేష్, నర్సింలు,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ